సోగ్గాడితడే..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జయలలిత జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న చిత్రం -తలైవి. కంగనా రనౌత్‌ను జయగా చూపించనున్నాడు దర్శకుడు ఎఎల్ విజయ్. ఈ పాత్ర పోషణకు పెద్ద పరిశోధనే చేశానంటూ అనేక సందర్భాల్లో చెప్పింది, చెబుతోంది కంగన. అయితే, జయ జీవిత చరిత్ర అనగానే -ఆ చరిత్రతో ముడిపడివున్న కొన్ని ముఖ్యపాత్రలు మస్తిష్కంలోకి వస్తాయి. అలా -తలైవి కథలో అతి ముఖ్యమైన ఎంజీ రామచంద్రన్ పాత్రను అరవింద్ స్వామి పోషిస్తున్నాడు. రామచంద్రన్‌గా అరవిందస్వామి ఫస్ట్ లుక్‌తోనే ఇంటెన్స్ ఇపాక్ట్‌నివ్వడం ఒకటైతే -ప్రాజెక్టు కోసం మేకర్లు ఎలాంటి వర్కౌట్స్ చేస్తున్నారోనన్న విషయం చెప్పకనే చెప్పడం రెండోది. ఇక జయ జీవితాన్ని కథగా చెప్పాలంటే -శోభన్‌బాబు పాత్రను ప్రస్తావించకుండా చెప్పటం అసాధ్యం. ఇద్దరిమధ్యా ప్రత్యేకమైన అనుబంధంపై ఇండస్ట్రీలో ఎన్నో కథనాలు వినిపిస్తుంటాయి. అలాంటి ముఖ్య పాత్ర కోసం -తలైవి టీం బెంగాలీ నటుడిని ఎంపిక చేసిందన్నది తాజా సమాచారం. అతనే -జిషు సేన్ గుప్తా. ఇటీవలే థియేటర్లకొచ్చిన నాగశౌర్య అశ్వథ్థామ చిత్రంలో జిషు ప్రతినాయక పాత్రతో మెప్పించాడు. ఆయన్ని శోభన్ పాత్ర కోసం తీసుకున్నారని, త్వరలోనే లుక్ బయటకు వచ్చే అవకాశం లేకపోలేదన్న మాట వినిపిస్తోంది. ఆసక్తి పెంచుతోన్న భారీ ప్రాజెక్టు తలైవి -తమిళంతోపాటు హిందీ, తెలుగు భాషల్లో విడుదల కానుంది.