అదే అయితే.. అనూహ్యమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీనియర్ హీరోగా కెరీర్లో ఎన్నో హిట్లు ఫ్లాపులు చూశాడు బాలకృష్ణ. వరుసగా రెండు మూడు ఫ్లాపులొచ్చేసరికి -బెదిరిపోతాడని అనుకోలేం. కథానాయకుడు, మహానాయకుడు, రూలర్.. ఇలా గత ఏడాదిలో మూడు డిజాస్టర్లు ఎదురొచ్చినా -ప్రయోగాలపై తనకున్న ఆసక్తిని మరోసారి రుచి చూపేందుకు బాలయ్య రెడీ అవుతున్నాడన్న మాట వినిపిస్తోంది. అందుకు -బోయపాటి ప్రాజెక్టు వేదికకానుందన్న మాట వినిపిస్తోంది. బాలయ్య, బోయపాటి కాంబోపై ఇండస్ట్రీలో మంచి అంచనాలు లేకపోలేదు. సో, -హ్యాట్రిక్ ప్రాజెక్టు హిట్టు కోసం తమ మార్కులోని పక్కా కమర్షియల్ కంటెంట్‌వైపు వెళ్తారనే అనుకున్నారంతా. అయితే తాజాగా వినిపిస్తోన్న కథనాలు -అంచనాలకు అతీతంగా ఉండి బాలయ్య ఫ్యాన్స్‌లో ఆత్రుత పెంచేలా కనిపిస్తున్నాయి. ‘నవగ్రహాలు -మనిషిపై వాటి ఇంపాక్ట్’ అన్న కంటెంటే ఇతివృత్తంగా ప్రాజెక్టు ఉండనుందట. రొటీన్ ప్రాజెక్టులతో టాలీవుడ్‌లో ఒకరమైన స్తబ్దత కనిపిస్తోంది. ఇలాంటి టైంలో ఒకింత చురుకు పుట్టించాలంటే -ప్రయోగమేదైనా జరగాలి. ఐతిహాసాలు, జానపదాల కథలతో సినిమాలు చేసిన అనుభవం బాలయ్యకు తక్కువేం కాదు. యంగ్ హీరోగా ఉన్న టైంలోనే ‘్భరవద్వీపం’ సినిమాలో శాపానికి గురై యువరాజు కురూపిగా మారిన గెటప్‌లో షాక్‌నిచ్చాడు బాలయ్య. అలాంటి వైవిధ్యాన్ని చూపించే అనుభవం ఎలానూ ఉంది కనుక- రొటీన్‌కి భిన్నమైన ‘నవగ్రహాల’ కథాంశంతో బాలయ్య కోసం బోయపాటి ప్రాజెక్టు సిద్ధం చేశాడంటున్నారు. కథలో కీలక భూమిక పోషించే వారణాసి ఎడిసోడ్‌లో బాలకృష్ణ ‘అఘోర’గా కనిపిస్తాడన్న టాక్ వినిపిస్తోంది. కొద్దిరోజుల క్రితమే బాలయ్య ‘అఘోర’ పాత్ర చేస్తున్నట్టు కథనాలొచ్చాయి. అదే ఇప్పుడు రిపీటవ్వటం చూస్తుంటే -బోయపాటి ‘నవగ్రహాల’ కథతోనే వస్తున్నాడని అనుకోవచ్చు. పాత్రలమధ్య వైరుధ్యాన్ని చూపించేందుకు మేకోవర్‌కు ప్రాధాన్యతనిచ్చే బాలయ్య -అఘోర అప్పియరెన్స్‌తో మరోసారి ఇండస్ట్రీకి షాక్‌నిచ్చే అవకాశం లేకపోలేదంటున్నారు. పరాజయాలను పెద్దగా పట్టించుకోకున్నా -పడిపోయిన ఇమేజ్ గ్రాఫ్‌ను పైకి లేపాలంటే హిట్టొక్కటే మార్గం. అందుకు -అనూహ్యమైన కథతో రాకతప్పదు. మానవ నమ్మకాలతో మిళితమైవున్న కంటెంట్‌ను చిక్కటి కథగా చెప్పగలిగితే -ఆడియన్స్‌ని మెప్పించటం కష్టం కాదు. అలాగే, కొత్త సీజన్‌కు ఈ సినిమా నాంది కావొచ్చు కూడా. సో, బాలయ్య బోయపాటిలు ఇలాంటి ఆలోచనే చేస్తున్నారా? అనిపిస్తోంది. బోయపాటి ప్రాజెక్టులో బాలయ్య సరసన కనిపించే హీరోయిన్లు ఎవరన్న విషయంపైనా ఇండస్ట్రీలో ఆసక్తి లేకపోలేదు.