28న.. లోకల్ బోయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళ ప్రాచీన యుద్ధ విద్య ఆడిమురై నేపథ్యంగా రూపొందిన చిత్రం -లోకల్ బోయ్. ధనుష్ ద్విపాత్రాభినయ పాత్రతో రూపొందిన సినిమా తమిళంలో సంక్రాంతికి విడదలై మంచి రెస్పాన్స్ సాధించింది. ఆ చిత్రాన్ని ఫిబ్రవరి 28న తెలుగు ప్రేక్షకులకు విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై సీహెచ్ సతీష్‌కుమార్ అందిస్తున్నారు. హీరోయిన్లుగా మెహరీన్, స్నేహ చేసిన సినిమాలో ప్రతినాయక పాత్రను నవీన్‌చంద్ర పోషించాడు. ఈ సందర్భంగా నిర్మాత సతీష్‌కుమార్ మాట్లాడుతూ -మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంగా రూపొందిన చిత్రం కోసం ధనుష్ ప్రత్యేక శిక్షణ తీసుకుని చేసిన సినిమా ఇది. ప్రాచీన యుద్ధవిద్య ఆడిమురై గొప్పతనం సినిమాలో చూస్తారు. 28న విడుదలవుతోన్న చిత్రం తెలుగు ఆడియన్స్‌నీ ఎంటర్‌టైన్ చేస్తుందనే నమ్ముతున్నా. తెలుగు ప్రేక్షకులకు పరిచయమున్న ఆర్టిస్టులే సినిమాలో ఎక్కువగా ఉండటంతో -స్ట్రెయిట్ తెలుగు సినిమా చూస్తున్నామన్న భావనే కలుగుతుంది. సినిమాను సక్సెస్ చేయాలని కోరుతున్నా అన్నారు.