ఇక వేగం పెంచుతా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండస్ట్రీకి వచ్చి పుష్కరకాలం దాటింది. 35 సినిమాలకంటే ఎక్కువ చేయలేదు. ఏడాదికి రెండు మూడు సినిమాలకంటే ఎక్కువ చేయలేకపోయా. ఈ లెక్క ప్రకారం చూస్తే కెరీర్ కూల్‌గా వెళ్తున్నట్టే. బట్, ఇకపై వేగాన్ని పెంచాలనుకుంటున్నా. పెంచుతా.
*
నచ్చావులే, నువ్విలా, ఎక్కడికి పోతావు చిన్నవాడా, కార్తికేయ హిట్ చిత్రాలకు సంగీతం సమకూర్చాడు శేఖర్ చంద్ర. ప్రస్తుతం ఆయన చేసిన వలయం ఫిబ్రవరి 21న థియేటర్లకు వస్తోంది. ఆ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా శేఖర్‌చంద్ర మీడియాతో ముచ్చటించాడు.
* పధ్నాలుగేళ్ల కెరీర్ పూర్తి చేశా. 35 సినిమాల వరకూ మ్యూజిక్‌నిచ్చాను. ఎక్కడిపోతావు చిన్నవాడా, సవారి, కల్యాణ్‌రామ్ హీరోగా చేసిన 118.. ఇలా మంచి పేరు తెచ్చిన చిత్రాలున్నాయి. 118లో చందమామ సాంగ్ పాపులరైనట్టే.. ఇటీవల వచ్చిన సవారిలో రెండు పాటలు యూత్‌కి కనెక్టయ్యాయి. అందులో ముఖ్యంగా ‘నీ కన్నులు’ అన్న పాట. ఆ పాటకొచ్చిన రెస్పాన్స్ ఎప్పటికీ మర్చిపోలేను. ఇప్పటికే 10 మిలియన్ వ్యూస్ దాటింది.
* పెద్ద చిత్రాలకు సంగీతం సమకూర్చే చాన్స్ ఇంకా రాలేదన్న చిన్న అసంతృప్తి వుంది. ఓ పెద్ద హీరో సినిమాకి మ్యూజిక్‌నిస్తే -అది ఎక్కువమందికి రీచవుతుంది. జనాల్లోకి వెళ్లగలుగుతాం. బట్, చేసేవి చిన్న సినిమాలే అయినా కానె్సప్ట్ ఓరియంటెడ్ చిత్రాలే చేస్తున్నా. అందుకే నానుంచి ఫ్రెష్ మ్యూజిక్ వస్తోంది.
* శేఖర్‌చంద్ర అనగానే మంచి మెలోడీ సాంగ్స్ ఇస్తాడన్న ముద్రపడింది. ఒకపక్క సంతోషించే విషయమే. కానీ, మెలోడీయేతర మ్యూజిక్ కోసం నాకు ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు. ఇది బాధించే విషయం. నా కెరీర్‌కు అదొక మైనస్. మెలోడీకి ఈక్వల్‌గా ఫాస్ట్‌బీట్సూ ఇవ్వగలను. అలా నన్ను నేను ప్రూవ్ చేసుకునే సినిమా కోసం చూస్తున్నా.
* నిజానికి మెలోడీనే మెజారిటీ ఆఫ్ ఆడియన్స్ ఇష్టపడతారు. కాకపోతే, మెల్లగా రీచవుతుంది. బట్, ఎక్కువ కాలం గుర్తుండిపోతుంది. ఫాస్ట్‌బీట్స్ త్వరగా ఎక్కేస్తాయి. ఆడియన్స్‌కి ఇమీడియేట్ ఊపునిస్తాయి కానీ, అంతేవేగంగా ప్రభావాన్ని కోల్పోతాయి. ఎక్కువగా థ్రిల్లర్లు, లవ్ స్టోరీలే చేశా. థ్రిల్లర్లతో మంచి బీజీఎం, లవ్ స్టోరీలతో మెలోడీ ఇవ్వొచ్చు.
* మిగిలిన భాషా సినిమాలు మాటెలావున్నా, తెలుగులోనే నేను సాధించాల్సింది చాలావుంది. దాని తరువాత అవకాశం వస్తే వాటిగురించి ఆలోచిస్తా.
* తాజాగా నేను సంగీతం అందించిన వలయం సినిమా విడుదలవుతోంది. నిర్మాత బెక్కం వేణుగోపాల్ నిర్మించనున్న ప్రాజెక్టుకూ సంగీతం ఇవ్వనున్నా. హుషారు టీంతో సాయిధన్సిక ప్రధాన పాత్రలో ఆ సినిమా ఉంటుంది.

-‘వి’