చిన్నచూపు తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రవిజతే, శ్రావణి నిక్కీ, శృతిశెట్టి లీడ్‌రోల్స్‌లో రాజారెడ్డి బ్యానర్‌పై విడుదలైన సినిమా -అనుభవించు రాజా. తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో దర్శకుడు సురేష్ తిరుమూరు మాట్లాడుతూ -తెలుగు రాష్ట్రాల్లో మా అంచనాలకు మించి సినిమాకు స్పందన వస్తోంది. ఇలాంటి టైంలో మాకో దురదృష్టకర సంఘటన ఎదురైంది. బుక్ మై షో కొలమానంలో మా సినిమాకు వస్తోన్న స్పందనను తక్కువ చేసి చూపించటం దారుణం. పొరబాటు ఎక్కడ జరిగిందో తెలీలేదని, సరిచేస్తామని ‘బుక్ మై షో’ వారు చెబుతున్నా -అప్పటికే ప్రపంచానికి తప్పుడు సమాచారం వెళ్లడం బాధించే విషయమే. నర్శిపట్నంలాంటి చిన్న కేంద్రాల్లో సైతం సినిమా విజయవంతంగా రన్నవుతుంటే, ఈ నిర్వాకం కారణంగా సినిమా భవిష్యత్ ఏమవుతుందోనన్న ఆందోళన లేకపోలేదు. చిన్న సినిమా కదా అని చిన్న చూపు చూడొద్దు అన్నారు. రవితేజ మాట్లాడుతూ -హీరోగా అవకాశమిచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు. సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుండటం హ్యాపీగా ఉంది. విడుదలైన అన్ని ఏరియాల్లో పాజిటివ్ టాక్ వుంది. సపోర్ట్ చేస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు అన్నాడు. సినిమా సక్సెస్ పట్ల హీరోయిన్లు శ్రావణి నిక్కీ, కృతిశెట్టి ఆనందం వ్యక్తం చేశారు.