పూరి బోర్డులో అనన్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూరి జగన్నాథ్ -విజయ్ దేవరకొండ కాంబోలో తెరకెక్కుతోన్న క్రేజీ ప్రాజెక్టు బోర్డులోకి బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే తాజాగా చేరింది. మొదటి షెడ్యూల్ ముంబైలో పూర్తిచేసిన చిత్రయూనిట్, తాజా షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో మొదలెట్టింది. సెకెండ్ షెడ్యూల్‌కు వచ్చిన అనన్య -సెట్స్‌లో విజయ్, దర్శకుడు పూరి, నిర్మాత చార్మితో దిగిన ఫొటోలను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. విజయ్‌తో రొమాన్స్‌ చేసే ఫిమేల్ లీడ్ కోసం అనన్యకు ముందు అనేక పేర్లు వినిపించాయి. వర్కౌట్ కాకపోవడంతే -అనన్యను ఫైనల్ చేసుకుంది పూరీ టీం. బాలీవుడ్ నటుడు చుంకీ పాండే కూతురిగా బాలీవుడ్‌లో అరంగేట్రం చేసిన అనన్య -స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2తో మంచి పేరు తెచ్చుకుంది. ప్రొఫెషనల్ ఫైటర్ క్యారెక్టర్ చేస్తున్న విజయ్ -పాత్ర కోసం ఇప్పటికే మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నాడు. హిందీ, తెలుగు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతోన్న చిత్రానికి బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్, అపూర్వ మెహతా నిర్మాణ భాగస్వాములుగా ఉన్నారు. ఈ సినిమాలో రమ్యకృష్ణ కీలక పాత్ర చేస్తోంది. పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, చార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.