అదట.. కారణం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారీ అంచనాలతో వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ -బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టడం తెలిసిందే. రెండువారాల క్రితమే సినిమా వచ్చిపోయినా -్ఫ్లప్‌పై మాత్రం ఇంకా పోస్ట్‌మార్టమ్స్ నడుస్తున్నాయి. తాజాగా సినిమా ఫ్లాప్‌నకు విజయ్ కారణమంటూ దర్శకుడు క్రాంతిమాధవ్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు కథనాలు వస్తుండటం గగ్గోలు లేపుతోంది. వరల్డ్ ఫేమస్ లవర్ ప్రమోషన్స్‌కు దూరంగా ఉన్నట్టు విజయ్ కనిపించినా -కథలో వేళ్లు, కాళ్లు పెట్టడంవల్లే సినిమా పరాజయం వైపు ప్రయాణించిందన్న అసంతృప్తిని క్రాంతిమాధవ్ వ్యక్తం చేస్తున్నాడట. అలాగే, తాను మొదట ప్రిపేర్ చేసుకున్న సీన్స్‌ని పక్కన పెట్టించి -చాలా సన్నివేశాలను రీషూట్ చేయించటంతో కథ బ్యాలెన్స్ తప్పిందన్నది క్రాంతి అంటోన్న మాట. ఇండస్ట్రీలో విజయ్ ఇమేజ్ నడుస్తుండటంతో -ముందు సినిమా ఫ్లాప్‌తో తాను కంట్రోల్ చేయలేని స్థితిలో ఉండటం.. వెరసి డబ్ల్యుఎఫ్‌ఎల్‌తో తనకు చెడ్డపేరే మిగిలిందన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. దర్శకుడిగా తనకు స్వేచ్ఛ లేకుండా చేయడం, బ్యాలెన్సింగ్ స్క్రిప్ట్‌ని విజయ్ తనకు అనుకూలంగా మార్చుకోవడమే వరల్డ్ ఫేమస్ లవర్ ఫ్లాప్‌నకు కారణమంటూ దర్శకుడు క్రాంతిమాధవ్ తన పోస్ట్‌మార్టమ్ రిపోర్టులో అభిప్రాయపడుతున్నట్టు ఫిల్మ్‌నగర్ వర్గాలు అంటున్నాయి.