S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకృష్ణ లీలారింఛోళి

09/11/2019 - 19:21

తే.గీ. కష్టపడువాని నెవ్వారు గాంచఁబోరు
మిగుల నటియించు వారికే మేలు గల్గు
ఎందుఁ జూచిన ఁ గన్పట్టు నిది నిజమ్ము
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

09/10/2019 - 20:04

తే.గీ. వింత రోగాలు మందులు వేనవేలు
వైద్యశాలల రోగుల బారులకట !
భాగ్యహీనులు క్షేమంబుఁ బడయు నటులఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

09/09/2019 - 20:05

తే.గీ. వివిధ సందర్భములలోన విజ్ఞులకట!
దీపముల నార్పివేతురే! దిక్కుమాలి
నట్టి పాశ్చాత్య సంస్కృతి ననుకరించు
చుండె ఁ గేకుల కోతలెచ్చోట ఁగనగఁ
జూడుమో కర్మసాక్షి ! యో సూర్యదేవ!

09/09/2019 - 20:35

తే.గీ. తల్లి గోదారి కవనంపు ధారఁ గురిపి
దాహముందీర్ప నెంచెనా తల్లికంతఁ
జేతులెత్తియు మ్రొక్కెద శిరము వంచి
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

09/06/2019 - 19:33

తే.గీ. చదివితిని సమాజము నంతఁ జక్కగాను
లోపములు సవరింప నాలోచనొకటి
మదిన మెదలంగ శతకమై యెదలు దట్టెఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

09/05/2019 - 19:55

తే.గీ. ప్రేగుఁ ద్రెంచుకు పుట్టిరి పిల్లలపుడు
కడుపుఁజించుకునీనాడు కడు విచిత్ర
రీ ఁ బుట్టుచునున్న తీరేమి వింత?
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

09/04/2019 - 20:02

తే.గీ. గంగలో మున్గి తమవంటి కంటినట్టి
మురికి ఁ దొలగించుకుందురే! మూఢమతులు
మనసుకంటిన మలినాల మలుపుకొనరె?
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

09/03/2019 - 20:14

తే.గీ. క్రమము దప్పియు జీవిత కాలమందు
తెగిన గాలిపటము వోలెఁ దిరుగ నేల?
ప్రతినిమేషము నుపయోగ పరచు కొనరె
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

08/30/2019 - 20:33

తే.గీ. కాని కూడని పనులతో ఁగాలయాప
నంబుఁ జేసెడి వారు లోకంబునందుఁ
బెచ్చు పెరుగుచునున్నారు వేయి కనులఁ
జూడుమా కర్మసాక్షి! యో సూర్యదేవ!

08/29/2019 - 19:47

తే.గీ. వ్యసనముల బారిఁబడిపోయి పతనమగుచుఁ
దన గృహంబును ఁ బట్టించుకొనక దిరిగి
తిరిగి చెడిపోవ ఫలమేమి? యెఱుగరేలః
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

Pages