శ్రీకృష్ణ లీలారింఛోళి

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. తల్లి గోదారి కవనంపు ధారఁ గురిపి
దాహముందీర్ప నెంచెనా తల్లికంతఁ
జేతులెత్తియు మ్రొక్కెద శిరము వంచి
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!
భావం: కర్మసాక్షివైన ఓ సూర్యనారాయణమూర్తీ! పుణ్యభాగీరథీ సమపూజలందుకుంటున్న రాజమహేంద్రవరపు గోదావరమ్మ కవనధార కురిపించి నా దాహం తీర్చాలని తలచిందికదా! ఆ గోదావరీ మాతకు శిరసు వంచి చేతులెత్తిమ్రొక్కడం తప్ప, ఏమిచ్చి ఆ తల్లి ఋణం తీర్చోకోగలను? మాతా! గోదావరీ నదీమ తల్లీ ల మనసా స్మరామి. ఆ తల్లి దీవనలు నీ దయామృతం నాపై అపారంగా కురుస్తూనే ఉండాలని కోరుకునే నా మనసును నీవే చూడుమా కర్మసాక్షివైన ఓ సూర్యదేవ!
తే.గీ. గోవులందునఁ గొవువున్న కోటిదేవ
తలనుఁగాదని శక్తులు తగ్గినంతఁ
గటకటా!కబేళాలకే కముగ నంపు
చుంటిరే బుద్ధిజీవులు కంటిరేనిఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!
భావం: అయ్యయ్యో !సకల దేవతాస్థావరాలైన గోవులను శక్తులుడిగిన అనంతరం భయంకరంగా ఈ బుద్ధి జీవులు ఏకంగా కబేళాలకు పంపేస్తున్నారే!ఇంతకంటే ఘోరమేముంటుంది గనుక?్భతదయఅపారంగా కల్గిన భారతావనిలో ఇలాంటి దురాగతానికి స్థానం లేదే? కర్మసాక్షివైన ఓ సూర్యదేవా చూడవయ్య!

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262