శ్రీకృష్ణ లీలారింఛోళి

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. వ్యసనముల బారిఁబడిపోయి పతనమగుచుఁ
దన గృహంబును ఁ బట్టించుకొనక దిరిగి
తిరిగి చెడిపోవ ఫలమేమి? యెఱుగరేలః
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: ఎంతోమంది అనాలోచితంగా దుర్వ్యసనాల బారిన పడి భార్యా పిల్లలను ఇంటిని పట్టించుకోకుండా చెడు తిరుగుళ్లు తిరిగి చెడిపోతున్నారు. ఫలితం ఏముంది? ఈ విషయాన్ని గ్రహించలేక పోతున్నారు. ఇంటిని ఒంటిని గుల్లచేసుకొంటూ అనారోగ్యం పాలవుతున్నారు. అలాంటి వాళ్ల కళ్లు తెరుచుకోవాలి. కర్మసాక్షివైన ఓ సూర్యదేవ! చూడవయ్య ప్రభూ!
తే.గీ. చూచుచుంటివి నీవని సుంత భయము
నొందకుండంగఁ జేతురే యెందరెంద
రోకదా! పాపకార్యాలనే క మిచటఁ
జూడుమో కర్మసాక్షి!యో సూర్యదేవ!

భావం: ఓ సూర్యదేవ! ఆ పైనుండి నీవు చూస్తుంటావు అనే భయం కొద్దిగా కూడా లేకుండా ఎందరెందరో అనేకానేక పాపకార్యాలు చేస్తూ పోతున్నారు. వాటి ఫలితం భయంకరంగా ఉంటుందని గుర్తించలేకపోతున్నారు. భగవంతుడు సర్వాంతర్యామి అని తెలుసుకోలేని అమాయకులున్న ఈ లోకం, లోకంలోని మనుష్యులను చూడవయ్య కర్మసాక్షివైన ఓ సూర్యదేవా!

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262