శ్రీకృష్ణ లీలారింఛోళి

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. కష్టపడువాని నెవ్వారు గాంచఁబోరు
మిగుల నటియించు వారికే మేలు గల్గు
ఎందుఁ జూచిన ఁ గన్పట్టు నిది నిజమ్ము
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: నేటికాలంలో ప్రభుత్వ, ప్రభుత్వేతర, మరే ఇతరములలో నైనా కష్టపడే వారిని గుర్తించి ప్రోత్సహించమనేది చాలా అరుదు. కష్టపడలేని తత్వంతో జీతభత్యాలనిచ్చే వారి మెప్పు పొందటానికి నటన చూపే మహానటులకే మేలు కలుగుతోంది. ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి కదా. ఇది అక్షర సత్యం అనడంలో సందేహం కూడా లేదు. కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! నీవైనా వీరిని అదుపు చేయ చూడము ప్రభూ!
తే.గీ. సన్నగిల్ని భక్తితో సల్పు వివిధ
మందు నిల్పక మళ్లించు మనుజులారా!
పొందు ఫలితమ్ము శూన్యమ్ము పుడమిలోనఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!
భావం: పూజాదికాలన్నీ భక్తి శ్రద్ధలతో చేయాలి. కానీ నేడు ఎక్కడ చూసినా హంగు ఆర్భాటాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. మేము ఇన్ని పూలు పెట్టాము అనో, లక్షవత్తుల నోము నోచుకున్నామనో చెప్తూ పూజకు ఇంతమంది వచ్చారనో లేక ఫలాన ప్రముఖులు మా పూజకు వచ్చారనో చెప్పుకుంటున్నారు. అసలు పూజమాత్రం ఏదో మొక్కుబడిగా చేసేస్తున్నారు. మనసును పూజలో నిల్పడంలేదు. చిత్తశుద్దిలేకుండా చేసే ఈ పూజల వల్ల వచ్చ్ఫేలాలు ఏముంటాయి? దీనిని గుర్తించని వీరిని నీవే చూడుమా కర్మసాక్షివైన ఓ సూర్యదేవ!

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262