శ్రీకృష్ణ లీలారింఛోళి

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. వివిధ సందర్భములలోన విజ్ఞులకట!
దీపముల నార్పివేతురే! దిక్కుమాలి
నట్టి పాశ్చాత్య సంస్కృతి ననుకరించు
చుండె ఁ గేకుల కోతలెచ్చోట ఁగనగఁ
జూడుమో కర్మసాక్షి ! యో సూర్యదేవ!
భావం: ఏకార్యక్రమ ప్రారంభంలోనైనా దీపజ్యోతిని ప్రజల్వనం చేసి దీపజ్యోతి నమోస్తుతే అంటూ నమస్కరించే హైందవ జాతి పాశ్చాత్య పోకడలకు పోయి నేడు దీపాలను ఆర్పివేసి కేకులను కట్ చేయడం చేస్తున్నారు. హిందువులందరూ ఏ పండుగకైనా నలుగురినీ పిలిచి ఐకమత్యంతో సంబరాలు చేసుకోవడం అలవాటు దానిని వదిలి విడగొట్టిపాలించు అనే నీతిని ప్రబోధించే పాశ్చాత్య సంస్కృతిని అనుకరిస్తూ ఐకమత్యంతో ఉండవలసిన వారు విభేదించుకుంటున్నారు. వీరిని నీవే చూడవయ్య కర్మసాక్షివైన ఓ సూర్యదేవ!
తే.గీ. యంత్రభూతాల వికటాట్ట హాసములకు
జనిత సాంకేతిక జ్ఞాన సాగరంపు
కెరటముల ధాటికోడుచుఁ గీర్తిఁగాంచు
వృత్తికళల వైభోగంపు వెలుగులారెఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!
భావం: భూతాల వంటి పెద్ద పెద్ద యంత్రాల పనితీరువల్ల సాంకేతిక విజ్ఞాన సాగరంలో పుట్టు కెరటాల విజృంభణకు కీర్తిప్రతిష్టలనుగన్న వృత్తి కళావైభోగపు వెలుగులు ఆరిపోతున్నాయే!అయ్యో! ఆ కళాకారులు జీవించేలావారికి ఆదరణ లభించేలా కరుణచూపవయ్య కర్మసాక్షి వైన ఓ సూర్యదేవ!

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262