శ్రీకృష్ణ లీలారింఛోళి

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. ప్రేగుఁ ద్రెంచుకు పుట్టిరి పిల్లలపుడు
కడుపుఁజించుకునీనాడు కడు విచిత్ర
రీ ఁ బుట్టుచునున్న తీరేమి వింత?
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!
భావం: పాతకాలంలో పిల్లలతా మాతృగర్భం నుంచి ప్రేగు త్రెంచుకుని సహజ జన్మాలకు నోచుకునేవారు. ఈ కాలంలో స్వార్థ సంకుచిత భావాలు గుండెల్లో గూడల్లుకోవడం వల్లనో యేమో చిత్రాతి చిత్రంగా కడుపు చించుకుని పుడుతున్నారే! వీరిలో మానవత్వం మరుగై పోతున్నదీ,అంతేకాక కన్నతల్లిదండ్రులపై ప్రేమాపాయ్యతలు కరువైపోతున్నాయి ఇదేమి చిత్రం? ఇదేమి వింత కర్మసాక్షివైన ఓ సూర్యదేవ నీవైనా చూడవయ్య ప్రభూ!
తే.గీ. మసక బారిన మనుసులు మనుజులందు
నట్టి మనుసులు గడుగంగ నడుముగట్టఁ
గోరు సరికదా! మనములు ఘోరముగను
గాయపరతురు వారేల? రుూ యవనికిఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!
భావం: ఈ రోజుల్లో మనుజుల మనసులు మసిమారిపోతున్నాయి. మసకబారిన మనసులను ప్రక్షాళన చేసుకోవడానికి పూనుకోక ఇతరుల మనసులను గాయపరుస్తుంటారు. ఇలాంటివారు ఈ భూమికి భారం కదా. అలాంటి వారెందరో ఈ పుణ్యభూమిలో అధికసంఖ్యలో ఉన్నారు. వారిని నీవు ఒక్కసారైనా చూడుమా కర్మసాక్షివైన ఓ సూర్యదేవ!

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262