శ్రీకృష్ణ లీలారింఛోళి

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. గంగలో మున్గి తమవంటి కంటినట్టి
మురికి ఁ దొలగించుకుందురే! మూఢమతులు
మనసుకంటిన మలినాల మలుపుకొనరె?
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: ఎంతోమంది గంగలో మునకవేసి తమ వంటి కంటిన మురికిని తొలగించుకుంటున్నారు తప్ప తమ తమ మనసుల కంటిన మురికి అంటే మలినాలను,దోషాలను లేక దురాలోచనలను ప్రక్షాళనం చేసుకోవాలనే ఆలోచన చేయడం లేదే ? ఇదెక్కడి విడ్డూరం. కర్మసాక్షివైన ఓ సూర్యదేవ వీరిని ఓ సారి చూడవయ్య లోకప్రభూ!
తే.గీ. అప్పు పుట్టంగ వలెనన్నఁ దిప్పలపుడు
పిలచి యప్పిచ్చుచున్నారు. విధి విచిత్ర
మప్పు వల్లను ఁ గల్గెడి ముప్పు దలుపఁ
బోరలేమిటికో కదా ! పుడమి జనులు
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!
భావం: ఒకప్పుడు అప్పు పుట్టాలంటే ఎనె్నన్నో తిప్పలు పడాల్సి వచ్చేది. ఈరోజుల్లో బ్యాంకులు గానీ, ఇతరత్రా వ్యక్తుల్లో కానీ చిత్ర విచిత్రంగాపిలిచి మరీ అప్పిస్తున్నారు. అప్పువల్ల కలిగే ముప్పును గుర్తించలేకపోతున్నారే ఈ మనుష్యులు. అప్పుల వల్ల ప్రాణాలకు హాని కూడా ఈ రోజుల్లో జరుగుతున్నది. దీనిని గుర్తించకుండానే తిరిగి అప్పులు ఇస్తున్నారని తీసుకొనేవారు పెరుగుతున్నారు. వీరందరినీ ఓసారి చూడవయ్య కర్మసాక్షివైన ఓ సూర్యదేవా!

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262