S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

02/18/2016 - 21:40

కరడుగట్టిన ఉగ్రవాదంపై ఆమె చేస్తున్న అనితర సాధ్యమైన పోరాటానికి ఆ దేశ మహిళలు సలామ్ చేస్తున్నారు. కదిలే బొమ్మలను నేస్తాలుగా చేసుకుని ఖదీజ-అల్-సలామి మహిళల్లో తీసుకువస్తున్న చైతన్యం ఉగ్రవాదులకు కంటగింపుగా మారినప్పటికీ వారి బెదిరింపులు...తుపాకీ గుళ్లకు బెదరక సమస్యలను అధిగమిస్తూ ముందుకు సాగుతోంది.

02/17/2016 - 21:11

లోకం పోకడ అంతగా తెలియని టీనేజీ యువతీ యువకులు తాము చూసిందల్ల నిజం అని నమ్మేస్తారు.. తాము చేసిందల్లా ‘కరక్టే’ అని భ్రమిస్తుంటారు. చదువుకోవాల్సిన వయసులో కొంతమంది ప్రేమపేరుతో కాలాన్ని వృథా చేస్తూ సమస్యల బారిన పడుతుంటారు. ముఖ్యంగా టీనేజీ యువతులు ప్రేమమోజులో పడి సులువుగా మోసపోతున్న ఉదంతాలు నేడు నిత్యకృత్యమైపోయాయి.

02/17/2016 - 05:17

‘పెళ్లి’ అనేది ‘నూరేళ్ల పంట’ అనీ, ‘నూరు ఏళ్లపాటు సాగవలసిన పంట’ అనీ, ఒక తరానికీ మరో తరానికీ మధ్య సుమారు ఇరవై ఏళ్ల వ్యత్యాసం వుంటుంది కాబట్టి ఐదు తరాల వరకు మూడు పూలు ఆరు కాయలుగా పెరుగుతూ మాధుర్యాన్ని పెంచి అందరికీ పంచేదనీ, వేద సంప్రదాయాన్ని తు.చ తప్పకుండా పాటించే భారతీయులందరికీ తెలిసిన విషయం.

02/13/2016 - 21:26

‘ప్రేమ.. ప్యార్.. లవ్..’ అన్న పదాలు ఈ కాలం యువత పెదాలమీద ఊతపదాలుగా మారినంత మాత్రాన- ‘ప్రణ యం’ అనేది ఈ నవతరంలోనే పుట్టిందని అనుకోవలసిన అవసరం లేదు. మనిషి పుట్టినపుడే ప్రేమ కూడా పుట్టింది. ప్రేమానుభూతిని, అందులోని మాధుర్యాన్ని, ఘాడతను, అది దూరమైనపుడు కలిగే వేదనను, బాధను వర్ణించి చెప్పిన ప్రేమికుల కథలు మన కావ్యాల్లో, ప్రబంధాల్లో, చరిత్రలో ఎన్నో ఉన్నాయి.

02/12/2016 - 20:12

స్కూల్ వ్యాన్ రాగానే ఎంతో ఉత్సాహంతో పరుగెత్తుకెళ్లి ఎక్కే పావని- వారం రోజులుగా వాళ్ళమ్మ కేకలేస్తే గానీ బడికి వెళ్లడం లేదు. అదీ ముభావంగా ప్రవర్తిస్తూ మొక్కుబడిగా స్కూల్ వ్యాన్ ఎక్కుతూ వుంది. పావని ముఖంలోని నిర్లిప్తత, స్కూల్ అంటే కలిగిన అయిష్టత గురించి వాళ్ళమ్మ నాలుగు రోజులుగా తెగ ఆలోచిస్తోంది.

02/11/2016 - 22:25

సనాతన సాంప్రదాయాలకు, మేలైన కుటుంబ వ్యవస్థకు అద్దం పట్టే భారతీయ సమాజంలో పెళ్లిళ్లకు సంబంధించి ఇప్పటికీ పెద్దల మాటే చెల్లుబాటవుతోంది. కుటుంబ పెద్దల ఇష్టప్రకారమే అధికశాతం వివాహాలు జరుగుతున్నాయి. తల్లిదండ్రులు చూసిన వరుడితో మూడుముళ్లూ వేయించుకుని యువతులు దాంపత్యబంధంలోకి అడుగుపెడుతున్నారు.

02/11/2016 - 07:38

ఎవరు ఔనన్నా, కాదన్నా ప్రేమికులు స్వేచ్ఛాజీవులు.. ఆంక్షల సంకెళ్లు వారిని ఏ విధంగానూ బంధించలేవు.. ప్రేమమత్తులో తేలియాడే కుర్రకారు తమదైన లోకంలో విహరిస్తుంటారు.. ఏటా ‘వాలెంటైన్స్ డే’ వస్తోందంటే చాలు- ప్రేమైకజీవుల సంబరాలకు సరిహద్దులే ఉండవు.. ఫిబ్రవరి 14న విశ్వవ్యాప్తంగా ‘వాలెంటైన్స్ డే’ జరుపుకోనున్న తరుణంలో వారం రోజుల ముందే ‘వాలెంటైన్ వీక్’ పేరిట సర్వత్రా కోలాహలం మిన్నంటుతోంది.

02/10/2016 - 08:38

నేటి నవనాగరిక యుగంలో మీడియా, ఇంటర్నెట్ కారణంగా అనేకానేక అంశాలపై అన్ని వర్గాల్లో అవగాహన పెరిగింది. ఒక వస్తువు గురించి, ఒక ప్రదేశం గురించి, ఒక వ్యాధి గురించి, ఒక పుస్తకం గురించి.. ఇలా ఏ సమాచారం కావాలన్నా గూగుల్‌లో సెర్చ్ చేస్తే క్షణాల్లో స్క్రీన్ మీద ప్రత్యక్షమవుతుంది.

02/06/2016 - 23:52

ఓసారి నా దగ్గరకి 24 ఏళ్ల కుర్రాడొచ్చాడు కన్సల్టేషన్‌కి. చాలా ‘డల్’గా ఉన్నాడు. ‘ఏమైంది బ్రదర్..?’ అని ఆసక్తిగా అడిగా. ‘పండక్కి ఇంటికి వెళ్లా.. చాలా ఆనందంగా ఇంటికెళ్లిన నాకు అక్కడ నిరాశ ఎదురైంది. నా గర్ల్‌ఫ్రెండ్ నాతో విడిపోయింది’- అని కన్నీరు పెడుతూ చెప్పాడు.

02/05/2016 - 20:18

కాయకష్టం చేస్తూ వేళకు ఆహారం తీసుకునే గ్రామీణులు ఆరోగ్యవంతంగా ఉంటారని అనుకోవడం సహజం. మంచి ఆహారపు అలవాట్లు, మేలైన ఆరోగ్య పద్ధతులకు దూరమవుతున్నందున నగర వాసుల్లోనే ఊబకాయం, మధుమేహం వంటి వ్యాధులు ఎక్కువగా ఉన్నట్లు భావిస్తాం. అయితే, ఉరుకులు పరుగుల ఆధునిక యుగంలో పల్లెల్లోనూ జీవనశైలి మారుతున్నందున గ్రామీణులు సైతం రక్తపోటు వంటి అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నట్లు ‘జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే’లో వెల్లడైంది.

Pages