మెయిన్ ఫీచర్

ఆడపిల్ల.. అందరికీ కనుపాప!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాళ్లేమి చదువకోలేదు. అయితేనేమి ఆ పల్లెవాసులు అమ్మాయి పుడితే పండుగ చేసుకుంటారు. మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలను ప్రైవేటు స్కూళ్లకు పంపకపోయినప్పటికీ ప్రభుత్వ పాఠశాలలకు పంపి చదివిస్తారు. ఆ పల్లెలు ఆడపిల్లల బోసి నవ్వులకు ఆహ్వానం పలుకుతున్నాయి. రాచరికపు ఠీవికి నిదర్శనంగా నిలిచే రాజస్థాన్‌లోని పలు పల్లెలు ఆడపిల్లను రక్షించుకుందాం అంటూ దండు వలే కదులుతున్నాయి. అంగన్‌వాడీ కార్యకర్త నుంచి ఆ ఊరి సర్పంచ్ వరకూ అందరూ ఐకమత్యంగా కదులుతూ ఆడపిల్లలను అక్కున చేర్చుకుంటున్నారు. వీరిని ఆ రాష్ట్ర ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థ వెన్నుతట్టి ప్రోత్సహిస్తుంటాయి. ప్రతి ఏటా దారుణంగా పడిపోతున్న ఆడపిల్లల సంఖ్య చివరకు సమాజ మనుగడనే ప్రశ్నార్థకం చేస్తుందని అక్షరం ముక్క నేర్వని ఆ పల్లెవాసుల విశ్వాసం ముందు ఆధునిక సమాజం తలవంచాల్సిందే. ఆడపిల్లను రక్షించుకుంటే కంటికి కనుపాపా వలే ఆ బిడ్టే మనల్ని కాపాడుతుందనే వారి నమ్మకం ఆడపిల్లల జీవితాల్లో కొత్త కాంతులు పూయిస్తోంది.
ఆడపిల్లను అక్కున చేర్చుకుందాం అంటూ సాగుతున్న ఈ ఉద్యమం రాజస్థాన్‌లో ఆరు జిల్లాల్లో 180 పంచాయతీల్లో సాగుతోంది. ఉవ్వెత్తున సాగుతున్న ఈ ఉద్యమానికి ప్రేరణ ఓ అంగన్‌వాడీ కార్యకర్త. సికార్ జిల్లాలోని మొట్లవాస్ గ్రామంలో ఉద్యమానికి అంకురార్పణ జరిగింది.
ఇద్దరు ఆడపిల్లల తల్లి అయిన మంజుదేవి అనే ఈ అంగన్‌వాడీ కార్యకర్త సర్పంచ్‌గా పోటీచేసి గెలుపొందింది. అంగన్‌వాడీ కార్యకర్త కాబట్టి ఆడపిల్లల స్థితిగతులు ప్రత్యక్షంగా తెలుసుకుంది. పురిట్లోనే ప్రాణాలు తీసేస్తున్న ఆడపిల్లలను రక్షించుకోవాల్సిన బాధ్యతను భుజానకెత్తుకుంది. తొలుత గ్రామంలోని తల్లిదండ్రులను సమావేశపరచి ఆడపిల్లల ఆవశ్యకత సమాజానికి ఎంత అవసరమో కౌనె్సలింగ్ ఇప్పించింది. తదనంతరం ఆడపిల్లలను పుట్టిన ఇంటికి, అలాగే ఆడపిల్లలను స్కూల్లో చేర్పించిన తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేస్తూ పంచాయతీ తరపున ఉత్తరాలు పంపేది. ఇలా మంజూదేవి చేపట్టిన ఉద్యమం అందరినీ ఆకట్టుకోవటమే కాదు థికారియా జిల్లాకు పాకింది. అక్కడైతే మహిళలు ఆడపిల్లలను మగపిల్లలతో పాటు సమానంగా చూడాలంటూ ఇంటింటికి వెళ్లి సంతకాల ఉద్యమం లేవదీశారు. ఇద్దరు ఆడపిల్లలు పుట్టిన తల్లులను ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకోమని మంజుదేవి ప్రోత్సహించేది.
దౌసా గ్రామంలో ఆడపిల్ల పుట్టిన వెంటనే ఆ పాప పేరుతో బ్యాంక్ ఎకౌంట్ పాస్‌బుక్కు, బర్త్ సర్ట్ఫికెట్ వెనువెంటనే మంజూరుచేస్తారు. ఆడపిల్లల సంరక్షణ కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహాకాలను బ్యాంక్ ఎకౌంట్‌లో వేస్తారు. మొదటి ఇన్‌స్టాల్‌మెంట్‌ను ఆడపిల్ల పుట్టిన వెంటనే బ్యాంక్‌లో జమ అవతుంది. మిగిలిన ఇన్‌స్టాల్‌మెంట్స్ ఆ పాప చదువులకు, పెళ్లి తదితర వాటికి జమజేస్తారు. ఈ ప్రోత్సాహాకాలు ఎప్పటికప్పుడు జమ అయ్యేలా పంచాయతీ మెంబర్లు బాధ్యత తీసుకుంటారు. సమాజంలో బాలిక కీలక భూమిక పోషిస్తే సామాజిక ప్రగతి త్వరితగతిన సాధించవచ్చని మంజూదేవి ప్రగాఢ విస్వాసం.
తొలగిన పరదా..
దౌలత్‌పురా గ్రామంలో ఈ ఉద్యమం వల్ల ఆడపిల్లలకు అనాదిగా ఉండే పరదా తొలగిపోయింది. ఈ గ్రామంలో కూడా వనితా రాజ్వాత్ అనే అంగన్‌వాడీ కార్యకర్త సర్పంచ్ అయినప్పటి నుంచి ఆడపిల్లలకు అడ్డుగోడగా నిలిచిన అనేక ఆచారాలకు ఆమె స్వస్తి పలికించారు. ఆమె సైతం పంచాయతీ మీటింగ్‌లకు పరదా లేకుండా రావటం ప్రారంభించింది. తొలుత పురుష మెంబర్ల నుంచి విమర్శలు ఎదుర్కొన్నా క్రమేణా వారిలో మార్పు తీసుకువచ్చింది. ఈ మార్పు గ్రామం మొత్తం ఆచరించేలా వారిలో చైతన్యం తీసుకువచ్చి పరదాల చాటు నుంచి బాలికలు, మహిళలను బయటకు తీసుకువచ్చింది. అలాగే గ్రామంలో ఉండే పాఠశాలకు ఆడపిల్లలను పంపేలా కృషిచేశారు. ఇపుడు ఆ పాఠశాలలో 200 మంది బాలికలు చదువుతుంటే 20 మంది బాలురు మాత్రమే చదువుతున్నారు. అదేవిధంగా గ్రామంలో ప్రభుత్వ నర్స్‌ను నియమించి చిన్నారి బాలికలు ఆరోగ్యంగా ఎదిగేలా ఎప్పటికప్పుడు టీకాలు తదితర వాటిని వేయిస్తోంది గ్రామంలో 50 మరుగుదొడ్లు నిర్మించింది. ప్రస్తుతం ఈగ్రామంలో గ్రామస్తులందరూ కలసి బాలిక జన్మోత్సవం వైభవంగా నిర్వహిస్తూ బాలికా సంరక్షణకు తోడ్పాటునందిస్తున్నారు.
జైరాంపుర గ్రామంలో సౌలాల్ గోలియా అనే సామాన్య రైతు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బాలికలు జన్మించిన వెంటనే వారికి శుభాకాంక్షలు చెబుతూ ఉత్తరాలు పంపటం, పుట్టిన బాలికల వివరాలు నమోదు చేస్తాడు. ఈ గ్రామంలోనూ పంచాయతీ అధికారులు ఏటా బాలికా జన్మోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. పంచాయతీ సభ్యులు సైతం ఇంటింటికి వెళ్లి బాలికా సంరక్షణ ఆవశ్యకతను వివరించటం వల్ల గత ఏడాది ఈ గ్రామంలో 115 మంది బాలికలు జన్మించగా, 111 మంది బాలురు జన్మించారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలో 350 మంది బాలికలు విద్యనభ్యసిస్తుండగా..200 మంది బాలురు విద్యనభ్యసిస్తున్నారు. లాల్‌పురాలో సైతం సర్పంచ్ ఓం ప్రకాశ్ బైర్వా తన గ్రామంలో బాలికలు కనీసం 12వ తరగతి వరకు చదివించాలనే ఆయన ప్రయత్నం ఫలించి మధ్యలో చదువు ఆపేసే బాలికల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.
ఈ జిల్లాల్లో 1,460 మగబిడ్డలు జన్మిస్తే వీరికి ధీటుగా 1,620 మంది బాలికలు సైతం జన్మించారు. మగపిల్లలతో పాటు ఆడపిల్లల పుట్టుక ఇక్కడ సమాంతరంగా సాగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ‘్భటీ బచావో’కు ఈ జిల్లాల్లో సాగుతున్న కార్యక్రమాలు స్ఫూర్తిదాయకం అవుతాయనటంలో ఎలాంటి సందేహం లేదు. *