మెయిన్ ఫీచర్

ఓ పోస్టర్... పోరాటానికి సంకల్పం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచంలో బాల కార్మికులు ఎక్కువగా ఉన్న దేశాలలో మన దేశం ఒకటి. దేశంలో 5.7 మిలియన్ల బాలకార్మికలు ఉన్నారు. ఐదేళ్ల వయసు నుంచి 17 ఏళ్లలోపు వారే. ఐఎల్‌ఓ ఇచ్చిన సమాచారం మేరకు ప్రపంచ వ్యాప్తంగా 168 మిలియన్ల మంది బాల కార్మికలు పనిచేస్తున్నారు. ఈ బాల కార్మికలలో సగానికి సగం మంది వ్యవసాయ రంగంలోనే మగ్గుతున్నారు. అగ్గిపుల్లలు, కార్పెట్ల తయారీ పరిశ్రమలతో పాటు హోటళ్లలో అంట్లు కడుగుతూ, ధనికుల ఇళ్లల్లో కూరగాయలు తదితర వాటిని మోస్తూ కాలం గడుపుతున్నారు. ప్రభుత్వం సైతం సరైన చర్యలు తీసుకోవటం లేదు. దాదాపు మూడు దశాబ్దాల క్రితంనాటి చట్టాల్నే అమలు చేస్తూ మైనింగ్, సిమెంట్ పరిశ్రమ తదితర పరిశ్రమలలో పనిచేసే బాల కార్మికులను మాత్రమే గుర్తించి వారికి విముక్తి కలిగిస్తోంది.

ముంబయి మురికివాడలలోని బాలకార్మికుల వేదనపై ఓ విద్యార్థి చేసిన స్కూల్ ప్రాజెక్టు వర్క్ నేడు జాతీయ మీడియాను సైతం ఆకర్షిస్తోంది. ఆ విద్యార్థి నేడు జాతీయ స్థాయి ప్రసార మాధ్యమాలలో హీరో అయ్యాడు. అతను చేసిన చిన్న పని మీడియాను, పోలీసు యంత్రాంగాన్ని ఆకట్టుకుని బాల కార్మిక వ్యవస్థపై పోరాటానికి సంకల్పించేలా చేసింది.
పదిహేడేళ్ల కునాల్ భార్గవ్ ముంబయిలోని అమెరికన్ స్కూలులో చదువుతున్నాడు. స్కూలు ప్రాజెక్టు వర్క్‌లో భాగంగా అతను ముంబయి మురికివాడల్లోని బాల కార్మికలపై ప్రాజెక్టు వర్క్ చేశాడు. ఇందుకోసం అతను తీసి న చిత్రాలు ఆ మహానగరం అంతటా వెలశాయి. సలామ్ బాలక్ అనే స్వచ్ఛంద సంస్థ ఆ చిత్రాలను నగరం అంతా పోస్టర్లుగా అంటించేలా కృషిచేసింది. ఈ పోస్టర్లను చూసిన ముంబయివాసులలో చర్చ మొదలైంది. అంతలా ఆకట్టుకునేలా కునాల్ భార్గవ్ చిత్రాలను తీశాడు. పోలీసు యంత్రాంగం సైతం ఈ పోస్టర్ ఉద్యమానికి ఆకర్షితురాలైంది. పోలీసులు రంగంలోకి దిగి పిల్లలను బడి పట్టేంచే పనిలోనిమగ్నయ్యారు. ముంబయిలో కునాల్ భార్గవ్ చేస్తున్న పోస్టర్ ఉద్యమం ప్రతి ఒక్కరిలోనూ చైతన్యం తీసుకువచ్చి నేను సైతం అంటూ పోస్టర్స్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అంతేకాదు దీనిపై పెద్దఎత్తున చర్చ జరిగేటట్లు చేసింది. థామ్సన్ రిటర్స్ ఫౌండేషన్ సైతం ముందుకు వచ్చి బాలకార్మికుల విముక్తి, పోస్టర్ ఉద్యమానికి బాసటగా నిలిచింది. మొత్తానికి 17 ఏళ్ల విద్యార్థిలో మొదలైన ఈ ఆలోచన నేడు విశ్వవ్యాపితంగా విస్తరించి బాల కార్మికలు విముక్తికి దోహదం చేస్తోంది.