S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

12/25/2015 - 23:16

మంచి పోషక విలువలున్న ఆహారం తీసుకుంటే శారీరక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే, క్రమం తప్పకుండా నిత్యం ఉదయం వేళ అల్పాహారం తీసుకునే చిన్నారుల్లో మేధో వికాసం ఆశాజనకంగా ఉంటుందని పరిశోధకులు తాజా అధ్యయనంలో కనుగొన్నారు. తొమ్మిది నుంచి పదకొండేళ్ల వయ సు కలిగిన సుమారు అయిదువేల మంది విద్యార్థుల ఆహారపు అలవాట్లపై సర్వే చేసిన అనంతరం పరిశోధకులు ఈ మాట చెబుతున్నారు.

12/24/2015 - 07:54

18 ఏళ్లలోపు వారంతా బాలలేనని, వారి పట్ల ఎలాంటి వివక్ష ఉండరాదని
ఐక్యరాజ్య సమితి గతంలోనే స్పష్టం చేసింది. ఈ లక్ష్యంతో బాలల హక్కుల కోసం గతంలో నిర్వహించిన సదస్సులో మన దేశం కూడా గొంతు కలిపింది.
ఈ దిశగా ఆలోచిస్తే-

12/22/2015 - 22:55

నేటి ఆధునిక యుగంలో వయోభేదం లేకుండా అందరి జీవితాలూ ఉరుకులు, పరుగుల మయమే. ఎల్‌కెజి చదివే పిల్లలు సైతం ఆటపాటలకు నోచుకోకుండా పుస్తకాల భారాన్ని మోయక తప్పడం లేదు. చిన్నారుల్ని ఆడుకోవడానికి అనుమతిస్తే వారు చదువులో వెనుకబడిపోతారనే భ్రమలో పేరెంట్స్ వారిని కట్టడి చేస్తున్నారు. ఆటపాటలు అలవాటైతే తమ పిల్లలు ఈ పోటీ ప్రపంచంలో నెగ్గుకురాలేరని తల్లిదండ్రులు భావిస్తుంటారు.

12/22/2015 - 05:07

‘మిస్ వరల్డ్ 2015’ విజేత మిరేయా
======================

12/18/2015 - 22:31

నేటి నవ నాగరిక యుగంలో చాలామంది దంపతులు ‘మేమిద్దరం... మాకిద్దరు...’ అనే కానె్సప్ట్‌లో బతికేస్తున్నారు. ‘చిన్న కుటుంబం... చింతలు లేని కుటుంబం...’ అనేది ఆర్థిక కోణంలో బాగానే ఉంటుంది. అనవసర ఖర్చులకు కళ్లెం వేయవచ్చు. కుటుంబంలో ఒకరో, ఇద్దరో పిల్లలు ఉండడంతో ‘ఎవరికి వారు యమునాతీరే’ అన్నట్లు నేడు పరిస్థితులు మారిపోయాయి. పిల్లలకు ఆదర్శంగా ఉండాల్సిన తల్లిదండ్రులే విలువలను పాటించడం అరుదుగా కనిపిస్తోంది.

12/17/2015 - 01:56

ఇరవై ఏళ్ల వర్షారాణికి ఒకప్పుడు నలుగురిలో తిరగాలంటేనే మితిమీరిన మొహమాటం.. బడికి వెళ్లాలంటేనే ఎంతో బిడియం.. అలాంటిది ఇపుడు ఆమె అందరిలో చలాకీగా తిరుగుతూ నవ్వుతూ కనిపిస్తుంది.. బాక్సింగ్ క్రీడ తన జీవితాన్ని మార్చేసిందని, తాను ఇపుడు ఎంతో శక్తిమంతురాలినని ఆమె ధైర్యంగా చెబుతోంది.. ఆత్మవిశ్వాసం పెరగడంతో అటు ఆటలో, ఇటు చదువులో దూసుకుపోతున్నానని ఎంతో సంతోషంగా అంటోంది..
***

12/15/2015 - 22:46

ఆ సంఘటన ఆసేతుహిమాచలం మహిళల్ని కదిలించి వేసింది.. పల్లెలు, పట్టణాలనే తేడాలేకుండా నారీలోకం
నిరసన గళం విప్పి కదం తొక్కింది.. ఆందోళన కెరటాలు ఉవ్వెత్తున ఎగసి పడడంతో కేంద్ర ప్రభుత్వం జడత్వాన్ని

12/15/2015 - 01:51

పప్పులు, కూరలు, పండ్లు, నూనెలు, ఉల్లిపాయలు, బియ్యం... ఇలా నిత్యావసర సరకుల ధరలన్నీ ఇపుడు కొండెక్కి కూర్చోవడంతో పేద, మధ్య తరగతి వారు కడుపునిండా తృప్తిగా భోజనం చేసే పరిస్థితులు కనిపించడం లేదు. బతుకుబండికి అవసరమైన తిండి విషయంలో నేడు ఒకటికి పదిసార్లు ఆలోచించి డబ్బు ఖర్చు చేయాల్సి వస్తోంది. అధికధరలకు జడిసి అరకొరగా కొంటు న్న ఆహార పదార్థాలతో శరీరానికి అవసరమైన పోషకాలు లభించని దుస్థితి నేడు నెలకొంది.

12/12/2015 - 21:52

అవిభక్త మద్రాసు రాష్ట్రంలో గుంటూరు జిల్లాలో ఉన్న ఉన్నత పాఠశాలలు మరి ఏ ఇతర భాషా ప్రాంతాలలోనూ లేవని చెప్పుకునేవారు విద్యారంగ ప్రముఖులు. ‘అది గొప్ప తెలుంగునాడునన్’. అఖిల భారతదేశంలోనే మహా వైభవోపేతంగా శివరాత్రి ఉత్సవం జరుపుకునే పది దివ్య క్షేత్రాలు పేర్కొనవలసి వస్తే మా త్రికూటేశ్వరగిరి అందులో తప్పక ఉంటుంది. జనప్రియంగా కోటప్పకొండ తిరునాళ్లు అని మా పరగణా అంతా చెప్పుకొని మురిసిపోతుంటారు మా జిల్లావారు.

12/11/2015 - 22:24

పిల్లలు అనగానే టీవీలో ఎపుడూ కార్టూన్ నెట్‌వర్క్ చూడటం, వీడియో గేమ్స్ ఆడటం, పేరెంట్స్ తిడతారన్న ఒత్తిడికి లోనై చదవడం.. వంటివి మనకు వెంటనే గుర్తుకొస్తాయి. అయితే, ఆ కుర్రాడు మాత్రం ఇందుకు పూర్తిగా విభిన్నంగా కనిపిస్తాడు. పేదవర్గాలకు చెందిన తన వయసు చిన్నారులకు పాఠాలు చెబుతూ ‘టీచర్ అవతారం’ ఎత్తుతూ అందరి ప్రశంసలు పొందుతున్నాడు.

Pages