మెయిన్ ఫీచర్

‘కాళీ’ఘాట్.. దీదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇప్పటికీ ఈ దీదీ సాధారణమైన నేత చీర, కాళ్లకు హవాయ్ చెప్పులు, చేతి సంచితోనే బయటకు అడుగుపెడతారు. ఆ సంచిలో ఉండేది చాక్లెట్లు మాత్రమే. తనకు చిన్నపిల్లలు ఎదురుపడితే వారి చేతిలో గుప్పెడు చాక్లెట్లు ఇచ్చివారిని ఆప్యాయంగా తడిమే దీదీ అంటే బెంగాల్‌వాసులకు ఎంతో మమకారం. కాళీఘాట్‌లో 30 ఏళ్ల నుంచి ఓ పాన్‌షాప్ ఉంది. అక్కడ అన్ని పార్టీలకు చెందిన చోటామోటా రాజకీయ నాయకులు సిగరెట్లు కొనుగోలు చేస్తారు. ఎవ్వరూ కూడా పైసా చేతిలో పెట్టరు. కాని తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రం అలా చేయరు. అమ్మో! దీదీకి తెలిస్తే..అని అంటారు.

దక్షిణ కోల్‌కతాలోని కాలిఘాట్ అంటే ప్రపంచ ప్రసిద్ధిచెందిన ప్రాంతం. అక్కడ ముచ్చటగా ముగ్గురమ్మలు కొలువుతీరున్నారు. ఆ ముగ్గురు అమ్మలు కూడా ప్రపంచ ప్రసిద్ధులే. ఒకరు దేవీ స్వరూపిణీ, మరొకామె దివ్యత్వాన్ని సంతరించుకున్న సేవాతత్పరురాలు, మరొకామె కోట్లాది మంది కార్యకర్తలు ఆరాధించే రాజకీయ నాయకురాలు. వీరి గురించి వేరే చెప్పనక్కర్లేదనుకుంటా. ఒకరు కోల్‌కతావాసుల దైవం కాళిమాత, మరోకామె మదర్ థెరిస్సా, మూడో వ్యక్తి నేటీ సమకాలీన బెంగాల్ రాజకీయాలను శాసించే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. రెండు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన కాలిఘాట్‌లో నివశించే కోల్‌కతావాసులకు దుర్గామాత అంటే ఎనలేని భక్తి, అదే కాళీమాత అంటే మాత్రం భయం. దసరా ఉత్సవాలు వచ్చాయంటే ఐదురోజుల పాటు కోల్‌కతావాసులు భక్తిశ్రద్ధలతో దుర్గామాతను ఆరాధిస్తారు. విచిత్రమేమిటంటే కోల్‌కతాలో దుర్గామాత ఆలయాలే లేవు అన్నీ కూడా కాళీమాత దేవాలయాలే ఉన్నాయి. వీటిల్లో ప్రసిద్ధిచెందినదే కాళీఘాట్. ఇక్కడే మదర్ థెరిస్సా సేవానిలయం ఉండగా.. ఇక అందరికీ సుపరిచితమైన హజ్రారోడ్డులోని హరీష్ ఛటర్జీ వీధిలో ముఖ్యమంత్రి మమతాబెనర్జీ నివాసం ఉంది. ఆ వీధి పేరు, ఆమె ఇంటి పేరు కూడా కాళీఘాట్. ఆ వీధి షాపులతో నిండి ఉంటుంది. జనం రద్దీగా ఉండే ఆ ప్రాంతంలో మమత ఇంటి ముందు ఇద్దరు రైల్వై ప్రొటక్షన్ ఫోర్స్ గార్డ్స్ మాత్రమే ఉంటారు.
అతి సామాన్యంగా కనిపించే ఆ నివాసం రాష్ట్ర రాజకీయాలను శాసిస్తుంటే అక్కడి జనానికి మాత్రం ఎలాంటి రాజకీయాలు తెలియవు. వారికి తెలిసిందల్లా దీదీ రాజకీయమే. ప్రపంచాన్ని ప్రభావితం చేసే నేతలలో ఒకరిగా ఎదిగిన ఈ దీదీ మాత్రం అతి సామాన్యమైన, నిరాడంబరమైన జీవితాన్ని గడుపుతుంటారు. ఆమె నిరాడంబరమే కానీ అక్కడ జరిగే రాజకీయ చర్చలు, ఎత్తుగడలు మాత్రం ఆ రాష్ట్రానే్న కాదు దేశానే్న ప్రభావితం చేస్తుంటాయి.
ఇప్పటికీ ఈ దీదీ సాధారణమైన నేత చీర, కాళ్లకు హవాయ్ చెప్పులు, చేతి సంచితోనే బయటకు అడుగుపెడతారు. ఆ సంచిలో ఉండేది చాక్లెట్లు మాత్రమే. తనకు చిన్నపిల్లలు ఎదురుపడితే వారి చేతిలో గుప్పెడు చాక్లెట్లు ఇచ్చివారిని ఆప్యాయంగా తడిమే దీదీ అంటే బెంగాల్‌వాసులకు ఎంతో మమకారం. అక్కడ ఎన్నాళ్ల నుంచో టీ దుకాణం నడుపుకుంటూ జీవిస్తున్న చంద్రనాథ్‌ను మమత గురించి అడిగితే చాలు ముఖం విప్పారుతోంది. కోల్‌కతా ప్రశాంతంగా ఉంది. దీదీకి గాకుండా మరొకరికి ఓటు ఎలా వేస్తామంటూ ఎదురు ప్రశ్నిస్తాడు. మమతా బెనర్జీ ఇంటి ఎదురుగా పిల్లలు క్రికెట్ ఆడుతుంటారు. అక్కడ అందరినీ ఆకట్టుకునే ఓ బోర్డు కనిపిస్తోంది. అదేమిటంటే ‘జాగో బెంగాల్’ అని రాసి ఉంటుంది. ఇది తృణమూల్ కాంగ్రెస్ నినాదమని అందరికీ తెలుసు.
అక్కడే ఉన్న కిరాణా దుకాణ యజమానిని ఈసారి ఎన్నికలలో దీదీ పరిస్థితి ఏమిటి అని ప్రశ్నిస్తే.. ‘ఆయన రెండు చేతులు జోడించి నాకు ఎలాంటి రాజకీయ పరిస్థితులు గురించి తెలియదు. దీదీ పుణ్యమా అని ఇక్కడ ప్రశాంతంగా ఉంటున్నాను అని అంటాడు. అక్కడ ఉండే టాక్సీ డ్రైవర్‌ను అడిగినా ‘‘నేను రాజకీయాలకు కొన్ని మైళ్లదూరంలో ఉంటాను అని సమాధానమిస్తాడు. హాజ్రారోడ్డును క్రాస్ చేసుకుని కాళీఘాట్ రోడ్డులో ఉన్న పాన్‌షాపు నడుపుతున్న యజమానురాలితో.. ఈసారికూడా దీదీ అధికారంలోకి వస్తారా అని ప్రశ్నిస్తే.. మీకెందుకు అనుమానం అంటూ ఎదురు ప్రశ్నిస్తోంది. ఈ ఐదేళ్లలో కోల్‌కతా రూపురేఖలే మారిపోయాయి. అంతెందుకు నేను పుట్టి పెరిగిన మిడ్నాపూర్ గ్రామంలో ఐదేళ్ల క్రితం రోడ్డు సౌకర్యమే లేదు. కాని నేడు అక్కడకు వెళ్లి చూడండి మీరే ఆశ్చర్యపోతారు అంటూ సమాధానమిస్తోంది. ఆమె గత 30 ఏళ్ల నుంచి అక్కడ పాన్ షాపు నడుపుతోంది. అన్ని పార్టీలకు చెందిన చోటామోటా రాజకీయ నాయకులు ఆమె వద్ద సిగరెట్లు కొనుగోలు చేస్తారు. ఎవ్వరూ కూడా పైసా చేతిలో పెట్టరు. కాని తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రం అలా చేయరు. అమ్మో! దీదీకి తెలిస్తే..అని అంటారు. కాళీఘాట్‌వాసులకు దీదీ అనే రాజకీయం మాత్రమే తెలుసు. మరే రాజకీయ పరిస్థితులపై అక్కడ ఎవ్వరికీ అవగాహన లేదు. అందుకే పశ్చిమ బెంగాల్‌వాసులకు దుర్గాదేవి అంటే భక్తి.. కాళీ అంటే అంత భయం మరి.