మెయిన్ ఫీచర్

ఒంటరి ప్రయాణమా? వదిలేయ్ బెంగ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీలో నిర్భయ ఘటన యావత్ ప్రపంచాన్ని కదిలించినట్లే పురనిక్ అనే ఈ యువకుడ్ని కూడా కదిలించింది. నిస్సహాయ స్థితిలో సాయం కోసం ఎదురు చూసే అమ్మాయిలకు అండగా నిలవాలనుకున్నాడు. మెరుపులాంటి ఆలోచనతో ఆపద నుంచి గట్టెక్కించేందుకు పూనుకున్నాడు. అనుకున్నదే తడువు ‘వార్’ (వార్ ఎగైనెస్ట్ రైల్వే రౌడీ) అనే సంస్థను ఏర్పాటుచేశాడు. నిర్భయ ఘటన మగవారినందరినీ తలదించుకునేలా చేసిందని పురనిక్ అంటాడు. రైలులో ఒంటరిగా అమ్మాయిలు ప్రయాణిస్తున్నారంటే పోకిరీ వెధవల పోకడలు ఇక చెప్పనవసరం లేదు. వాళ్లు చేసే ఆగడాలను భరించలేక, వారిని అడ్డుకట్ట వేసేందుకు తోటి ప్రయాణీకులు ముందుకురాక చాలామంది అమ్మాయిలు ప్రయాణాలలో ఇబ్బందులకు గురవుతుంటారు. రైళ్లలో రౌడీల ఆగడాలను గమనించిన పురనిక్ నిర్భయ ఘటన జరిగిన మరుసటి సంవత్సరమే అంటే 2013లో ఈ ‘వార్’ను ఏర్పాటుచేశాడు. తొలుత స్నేహితులు దీనిని వ్యతిరేకించినా తదనంతరం వారు జతయ్యారు. ఈ సంస్థ సభ్యులు ఆర్‌పిఎఫ్ పోలీసులతో అనుసంధానమై పనిచేస్తారు. ఈ సభ్యులు ముఖ్యమైన రైల్వే స్టేషన్‌లలో కాపు కాస్తారు. అమ్మాయిలను సైగలతోగానీ, లైంగికంగా వేధిస్తున్నట్లు కంటపడితే వెనువెంటనే ఆర్‌పిఎఫ్ పోలీసులకు తెలియజేస్తారు. వారు వచ్చి ఆ రౌడీల భరతం పడతారు. అలాగే ఓ హెల్ప్‌లైన్‌ను సైతం ఏర్పాటుచేశారు. ఈ హెల్ప్‌లైనుకు ఫోన్‌చేస్తే చాలు వెనువెంటనే వారికి సహయం ఎక్కడ ఉన్నది తెలుసుకుని సహయం అందజేస్తారు. అంతేకాదు ‘మా బెహెన్ క్యాంపెయిన్’ నిర్వహిస్తూ.. యువతులకు, మహిళలకు అవగాహన సదస్సులు ఏర్పాటుచేస్తున్నారు. అమ్మాయిల మీద ఎవరైనా ఎటాక్ చేస్తే భయపడి పారిపోకుండా నిర్భయంగా ఎదుర్కునేందుకు శారీరక శిక్షణ, ట్రిక్కులను ఈ సదస్సులలో అవగాహన కల్పిస్తారు. ముఖ్య కూడలి ప్రాంతాలలో రౌడీలను ఎలా ఎదుర్కోవాలో ప్రదర్శనలు ఇస్తుంటామని పురనిక్ స్నేహితులు అఖిల్ కపూర్, అర్జున్ తెలియజేస్తున్నారు. ఈ సంస్థ ఆరంభించిన ఈ మూడేళ్లలో దాదాపు 45 మంది నిస్సహాయ యువతులను రౌడీల బారి నుంచి వీరు రక్షించగలిగారు.
*