మెయిన్ ఫీచర్

వైకల్యాన్ని జయంచింది...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘వివేకం కలవారు జరిగిన నష్టం గురించి దిగులు పడరు. నష్టాన్ని ఎలా భర్తీ చేయాలా అని మాత్రమే ఆలోచిస్తారు’’ అన్న ప్రముఖ నాటకకర్త విలియమ్ షేక్‌స్పియర్ మాటలను ఆచరణలో చేసి చూపించింది ఈ చిన్నారి. వివేకం చూపడానికి వయస్సుతో పనిలేదని నిరూపించిన ఈ చిన్నారి కల్లోలిత దేశమైన ఇరాక్‌లోని ‘బకువా’ అనే ప్రాంతానికి చెందినది. బకువా అనేది ఇరాక్ రాజధాని బాగ్దాద్‌కు సమీపంలో వున్న ఒక పట్టణం. 2004వ సంవత్సరంలో నెజ్లా ఇమద్ అనే మూడు సంవత్సరాల బాలిక కారులో తమ కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తూన్నది. అదే సమయంలో ఒక బాంబు కారుమీద పడింది. ఈ దుర్ఘటనలో నెజ్లా కుడికాలు, చెయ్యి, ఎడమ ముంజేతులు బాగా
దెబ్బతిన్నాయి. దీంతో నెజ్లా అంగవైకల్యంతో జీవించడం తప్పదని అందరూ భావించారు. నెజ్లాకు తగిలిన గాయాలు తగ్గడానికి చాలా సమ యం పట్టింది. బాంబు దాడివలన కలిగిన అంగవైకల్యం గురించి చింతిస్తూ కూర్చోవడం కన్నా ఏదైనా వినూత్నంగా చేయాలనే ఆలోచన ఆమెకు కలిగింది. నాలుగు సంవత్సరాల వయసులో ఆమె టేబుల్ టెన్నిస్ ఆడటం ప్రారంభించింది.
టేబుల్ టెన్నిస్ ఆడటం వలన తనలో ఆత్మవిశ్వాసం రోజు రోజుకూ పెరుగుతున్నదని నెజ్లా చెబుతారు. నెజ్లా ఒకవైపు చదువుకొంటూనే మరోవైపు వారానికి మూడు రోజులు బకువాలో, రెండు రోజులు బాగ్దాద్‌లో శిక్షణ పొందుతుంది. శిక్షణ పొందడంతోపాటు ఆమె పలు టోర్నమెంట్లలో పాల్గొని పెక్కు బహుమతులు గెల్చుకొంది. 2015లో జాతీయ స్థాయిలో జరిగిన అండర్-16 టేబుల్ టెన్నిస్ పోటీలలో నెజ్లా ద్వితీయ స్థానంలో నిలిచింది. అరబ్ ఛాంపియన్‌షిప్‌లో సిల్వర్ మెడల్ సాధించింది. పారా ఒలింపిక్స్‌లో పాల్గొనే ఇరాక్ టేబుల్ టెన్నిస్ జట్టుకు ఎంపికైన నెజ్లా ప్రస్తుత వయస్సు 12 సంవత్సరాలు మాత్రమే. టేబుల్ టెన్నిస్ తన జీవితంలో మంచి మార్పులకు దారితీసిందని గర్వంగా చెప్పే నెజ్లా ఇమ్మద్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆశిద్దాం. అంగవైకల్యం శాపం కాదు. వివేకం, ఆత్మస్థైర్యాల ముందు అంగవైకల్యం చిన్నబోక తప్పదని నిరూపించిన చిన్నారి నెజ్లా ఇమ్మద్ అందరికీ ఆదర్శప్రాయురాలు.
.................
టేబుల్ టెన్నిస్
ఆత్మవిశ్వాసాన్ని పెంచింది...
టేబుల్ టెన్నిస్ ఆడటం వలన తనలో ఆత్మవిశ్వాసం రోజు రోజుకూ పెరుగుతున్నదని నెజ్లా చెబుతారు. నెజ్లా ఒకవైపు చదువుకొంటూనే మరోవైపు వారానికి మూడు రోజులు బకువాలో, రెండు రోజులు బాగ్దాద్‌లో శిక్షణ పొందుతుంది. శిక్షణ పొందడంతోపాటు ఆమె పలు టోర్నమెంట్లలో పాల్గొని పెక్కు బహుమతులు గెల్చుకొంది.

- పి.హైమా