S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎడిట్ పేజీ

03/08/2019 - 22:08

ఏవిధంగా చూసినా ఆధునిక నాగరిక ప్ర పంచంలో మరణశిక్ష అత్యంత దారు ణమైన, అమానుషమైన దండన. ఈ విషయం మొత్తం ప్రపంచం గుర్తించింది. అందుకే 80 శాతం దేశాలలో ఇది అమలులో లేదు. అత్యధిక దేశాలు తమ చట్టాలలోనే అటువంటి అవకాశం లేకుండా చేయగా, మరి కొన్ని దేశాలలో ఉన్నా మరణశిక్ష అమలు జరగడం లేదు. మన దేశంలో కూడా చాలా అరుదుగానే దీన్ని అమలు జరుపుతున్నారు.

03/08/2019 - 01:37

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 72 ఏళ్లు గడచినా జమ్మూ కశ్మీర్ సమస్య రావణకాష్టంలా రగులుతూనే ఉంది. అక్కడ శాంతి భద్రతల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం ఎక్కువ మొత్తంలో నిధులను కేటాయించవలసి వస్తున్నది. దీని మూలంగా దేశంలోని ఇతర రాష్ట్రాలలో అభివృద్ధి కార్యక్రమాలకు, ప్రజోపయోగ పథకాలకు తగినన్ని నిధులు సరిపోవడం లేదు.

03/07/2019 - 01:34

‘వడ్డించేవాడు మనవాడైతే పంక్తిలో ఎక్కడ కూర్చున్నా ఫర్వాలేదు..’ అన్న సామెత రాయలసీమకు మాత్రం వర్తించదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ‘సీమ’కు అన్యాయమే జరుగుతోంది. పాలకులు ఇక్కడి వారే అయినా.. ఈ ప్రాంతానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఏపీ నూతన రాజధానిని అమరావతిలో ఏర్పాటు చేసినా సమైక్యత కోణంలో సీమ ప్రజలు స్వాగతించారు. అమరావతి ప్రాంతం ఐశ్వర్యవంతులకు మాత్రమే పరిమితమైన రాజధాని.

03/06/2019 - 02:11

భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ విడుదల సందర్భంగా ‘జెనీవా ఒ ప్పందం’పై సర్వత్రా విస్తృత చర్చ జరిగింది. అసలు ‘జెనీవా ఒప్పందం’ అంటే ఏమిటి? ఎందుకు దాన్ని అమలు చేస్తున్నారు? ఈ ఒప్పందం ఎపుడు మొదలైంది? వంటి అనుమానాలకు సమాధానం తెలుసుకునే ఉత్సుకత ఇపుడు అందరిలోనూ కలిగింది. ప్రతి వ్యక్తీ ప్రైవేటు చట్టాలు, ప్రభుత్వ చట్టాలను పాటించాల్సి ఉంటుంది.

03/05/2019 - 02:03

ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పైనే అంతా చర్చిస్తున్నారు. కొందరు దీన్ని ‘మోదీ సర్జికల్ స్ట్రయిక్’ అన్నారు. అయితే, ప్రతిపక్ష నేతల ముఖాల్లో నెత్తురుచుక్క కనబడడం లేదు. కొందరు మీడియా ప్రముఖులు దీన్ని ‘ఎన్నికల బడ్జెట్’ అన్నారు. ఎన్నికల వేళ వరాలిచ్చే బదులు రెండు, మూడేళ్ల ముందే ఈ పనిచేసి వుండచ్చు కదా! అని ఇంకొందరు వ్యాఖ్యానించారు.

03/03/2019 - 00:18

పుల్వామా ఉగ్రదాడితో భారత్-పాక్‌లమధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. యుద్ధం జరుగుతుందేమోనని సామాన్య ప్రజలు భావిస్తున్నారు.. కశ్మీర్‌లోయలో అప్పుడే వదంతులు- పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అనూహ్యంగా వంద కంపెనీల పారామిలటరీ బలగాలు అక్కడికి చేరుకోవడంతో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయన్న భావన చాలామందిలో కలుగుతోంది. దాంతో అక్కడి ప్రజలు నిత్యావసర సరకులను ఎక్కువ మోతాదులో కొనుగోల చేసి నిల్వ చేసుకుంటున్నారు.

03/01/2019 - 22:07

రాష్ట్ర విభజన జరిగిన తీరుపై 2014 ఎన్నికల సభల్లో ప్రధాని నరేంద్ర మోడీ విమర్శనాస్త్రాలను సంధించారు. హడావుడిగా చేసిన రైల్వే జోన్ ప్రకటన కూడా అందుకు భిన్నంగా లేదు. ఏనాడో జోన్ ఏర్పాటు చేయవలసిందిపోయి నాలుగేళ్లపాటు జాప్యం చేసి ఇప్పుడివ్వడం ఒకటైతే, విశాఖ డివిజన్‌నే లేకుండా చేయడం తలతీసి మొండెం ఇచ్చినట్లుగా ఉంది.

03/01/2019 - 01:35

80వదశకం నుండి పాకిస్థాన్ వ్యూహాత్మకంగా ఉగ్రవాదాన్ని పెంచి, పోషించి, మన దేశాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేస్తున్నది. విచ్ఛిన్నం చెయ్యాలన్న లక్ష్యంతో మత రాజ్యమైన పాకిస్థాన్ మధ్యయుగాలనాటి భావజాలంతో, ప్రజాస్వామిక, లౌకిక, ఆధునిక రాజ్యమైన భారతదేశంపై చేస్తున్న ‘పవిత్ర యుద్ధం’లో భాగంగానే దేశంలో ఉగ్రవాదుల దాడులు జరుగుతున్నాయి.

02/28/2019 - 01:28

శాంతి కావాలంటే యుద్ధం చేయాల్సిందే అనే సుప్రసిద్ధ యుద్ధం సామెత నిజమైంది. ఎట్టకేలకు శతాబ్దాల తరబడి దాచుకున్న బలహీనతలను త్యజించి భారత్ దాయాది దేశంలో ఉగ్రవాద శిబిరాలపై రెండున్నరేళ్ల వ్యవధిలో రెండవ సారి భీకర దాడి చేసింది. దశాబ్దాల తరబడి భారత్ ఉపఖండాన్ని అతలాకుతలం చేస్తూ హింసను ప్రజ్వరిల్లింపచేస్తున్న కాశ్మీర్ సమస్యకు ద్వైపాక్షిక చర్చలు, శాంతి భేటీలు పనికిరావని తేలిపోయింది.

02/27/2019 - 03:57

తాజాగా సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలతో అటవీ ప్రాంతాల్లో ఉన్న ఆదివాసీలు అంతా అడవులను ఖాళీ చేయాల్సిందేనా? అసలు వివాదం ఏమిటి? కొత్త వివాదం ఎందుకు వచ్చింది? వన్యప్రాణుల సంరక్షణకు అడవుల్లో మనిషి ఉనికి లేకుండా చూడాలనే ఆలోచన ఎవరికి వచ్చింది? అసలు మన వన్యప్రాణి సంరక్షణ చట్టాలు ఏం చెబుతున్నాయి? ఆదివాసీల భవిష్యత్ ఏమిటి? 21 రాష్ట్రాలు సుప్రీంకోర్టు ఆదేశాలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి.

Pages