S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎడిట్ పేజీ

07/05/2019 - 21:54

ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా తన పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల నడవడి పట్ల ఆగ్ర హం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్‌లోని ఇండో ర్‌లో భాజపా శాసనసభ్యుడు ఆకాశ్ వర్గియా మున్సిపల్ అధికారిపై క్రికెట్ బ్యాట్‌తో దాడి చేయడం, ఆ తర్వాత ఆయనను పోలీసులు అరెస్టు చేయడం వంటి పరి ణామాలపై మోదీ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు.

07/04/2019 - 02:44

చర్చల ద్వారా చిరకాల సమస్యలనైనా పరిష్కరించుకోవచ్చు. ముఖాముఖిగా కూర్చుని వివాదాలపై మాట్లాడుకోవడం వల్ల వాతావరణం తేలిక పడుతుంది, ఉద్రిక్తతలు చల్లారుతాయి, అపోహలు అంతరిస్తాయి. చిన్నాచితకా సమస్యలకు చిటికెలో పరిష్కారం లభిస్తుంది. కోర్టుల గుమ్మం ఎక్కడం, కేంద్రం వద్దకు వెళ్లి ఒకరిపై ఒకరు పితూరీలు చేసుకునే పని ఉండదు.

07/03/2019 - 04:37

అంతర్జాతీయ వాణిజ్యాన్ని పర్యవేక్షించడానికి, సరళీకృతం చేయడానికి ప్రారంభమైన ‘ప్రపంచ వాణిజ్య సంస్థ’ (డబ్ల్యూటీవో) పై అమెరికా ‘పెద్దన్న’ పాత్ర ఇక ఎంతో కాలం కొనసాగే పరిస్థితి లేదు. ఈ విషయాన్ని గ్రహించిన అమెరికా కొద్ది రోజులుగా తాను ప్రపంచ వాణిజ్య సంస్థ నుండి తప్పుకుంటానంటూ గాండ్రింపులు ప్రారంభించింది. దానికి కారణాలు లేకపోలేదు. చాలా దేశాలు అమెరికా వాణిజ్య ఒప్పందాల ఉల్లంఘనను తప్పుపట్టడమే.

06/30/2019 - 03:52

ఎన్నికల రాజకీయాలలో గెలుపు ఓటములు సహజం. ఓడలు బండ్లవుతాయి.., బండ్లు ఓడలవుతాయి. ఒక ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన ఇక ఆ పార్టీ కథ ముగిసిందని అనుకోవడం పొరపాటే అవుతుంది. గతంలో అనేకమార్లు ఇదే నిజమని రుజువైంది. ఒకప్పుడు రెండు సీట్లకు పరిమితమైన బీజేపీ ఇప్పుడు 300లకు పైగా స్థానాల్లో విజయం సాధించింది. ఒకప్పుడు 400 మార్క్ దాటిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రెండంకెల సంఖ్య (52) దగ్గరే ఆగిపోయింది.

06/29/2019 - 00:20

పార్లమెంట్‌లో తిరుగులేని ఆధిక్యత ఉన్నంత మాత్రాన రాజకీయ సుస్థిరత ఆశింపలేమని, ప్రభుత్వం అభద్రతకు గురికాకుండా అడ్డుకో లేమని గతంలో రాజీవ్ గాంధీ ప్రభుత్వం వెల్లడి చేస్తోంది. స్వతంత్ర భారత చరిత్రలో ఇప్పటివరకూ కనీవినీ ఎరుగని రీతిలో 400కు పైగా సీట్లు గెలుపొందినా అభద్రతకు గురికావడంతో పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని రాజీవ్ గాంధీ తీసుకు వచ్చారు.

06/28/2019 - 02:49

కండపట్టి ఉండే కొన్ని జంతువులు క్రూర జంతువుల నుండి తప్పించుకునేందుకు అప్పుడపుడు వలసపోతుంటాయి. పరిస్థితులు చక్కబడగానే తిరిగి తమ స్వస్థలానికి చేరుకుంటాయి. కొన్ని పక్షుల్లో, జంతువుల్లో తల్లే స్వయంగా సురక్షిత ప్రదేశంలో పిల్లల్ని ఉంచి అనుకూల పరిస్థితులు వచ్చాక వాటిని తిరిగి తెచ్చుకుంటుంది.

06/27/2019 - 01:46

లోక్‌సభకు, అన్ని శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే అంశంపై విధి విధానాలను ఖరారు చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్రం న్యాయ నిపుణులతో కమిటీని ఏర్పాటు చేయడాన్ని ఆహ్వానించాలి. ప్రధానిగా రెండవసారి ఎన్నికైన తర్వాత మోదీ లోక్‌సభతో పాటు అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే విషయమై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి, వివిధ రాజకీయ పార్టీల అభిప్రాయాలను సేకరించారు.

06/26/2019 - 01:37

ఎన్నికలు వస్తే చాలు.. హామీల సునామీ మనకు కొత్తేమీ కాదు. గత ప్రభుత్వాలు చేసిందేమీ లేదని, తాము అధికారంలోకి రాగానే సరికొత్త సంక్షేమ పథకాలు అమలుచేస్తామని రాజకీయ పార్టీలు వాగ్దానాలు చేయడం పరిపాటి. ఒకప్పుడు జాతీయ అంశాలు ఎన్నికల వేళ ప్రధాన ప్రచారాస్త్రాలుగా ఉండేవి. ఆ తర్వాత జాతీయ సమస్యలు ప్రధానాస్త్రాలుగా మారాయి.

06/23/2019 - 02:08

నీళ్లు, నిధులు, నియామకాల్లో వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతానికి అనాదిగా తీరని అన్యాయం జరుగుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయాలే ఇపుడు అవశేష ఆంధ్రప్రదేశ్‌లో కూడా జరుగుతున్నాయి. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ‘ఉత్తరాంధ్ర గోడు’ ఆలకించి, దానిపై దృష్టి సారించాల్సిన సమయం ఆసన్నమైంది.

06/21/2019 - 21:54

దశాబ్దం క్రితం వరకు భారత రాజకీయాలలో వామపక్షాలు నిర్ణయాత్మక పాత్ర వహిస్తూ వచ్చాయి. కేంద్రంలో ప్రభుత్వాల ఏర్పాటులో కీలక పాత్ర వహించాయి. జాతీయ స్థాయిలో వా మపక్షాలు లేకుండా ఎటువంటి రాజకీయ కూటమి ఏర్పాటైనా ప్రయోజనం ఉండబోదనే అభిప్రాయం ఉండేది. భాజపాతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అవగాహనకు వస్తే వామపక్షాలకు కోపం వస్తుందనే భయంతో చాలా రాజకీయ పక్షాలు భాజపాను దాదాపు అంటరాని రాజకీయ పక్షంగా చూస్తూ వచ్చాయి.

Pages