S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయన్ ఫీచర్

09/22/2019 - 03:47

ఇటీవలి లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రాంతీయ పార్టీలు ఎంతగా ‘మహా’ జోరు ప్రదర్శించాయో... ఎంతగా ఆకాశానికి నిచ్చెనలు వేశాయో..! అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇదిగో మహా కూటమి అంటే.. అదిగో మరో కూటమి.. అంటూ ప్రాతీయ పార్టీల మహా నాయకులు మహా సందడి చేశారు. తెలుగు రాష్ట్రాలలో అయితే ఈ సందడి మరీ ఎక్కువగా కనిపించింది.

09/20/2019 - 22:44

ఈ ఏడాది జూన్ త్రైమాసికానికి మన దేశ జీడీపీ (స్థూల జాతీయ ఉత్పత్తి) వృద్ధి రేటు 5 శాతానికి తగ్గింది. దాంతో ‘ఆర్థిక మందగమనం’ పై దేశంలో పెద్ద ఎత్తున చర్చ ప్రారంభమైంది. గత 70 ఏళ్ళల్లో ఆర్థిక వృద్ధి రేటు ఇంత మందగమనంగా లేదని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ ఒక సందర్భంలో పేర్కొనడంతో మన ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడానికి సిద్ధంగా ఉన్నట్లు ఒక అభిప్రాయం పెంపొందటం ప్రారంభమైనది.

09/19/2019 - 02:43

గోదావరి నదిలో వెళుతూ పాపికొండల రమణీయ దృశ్యాలను తిలకించాలని వెళ్లిన పర్యాటకుల్లో చాలామంది మృత్యువాత పడ్డారు. గోదావరి నదిలో బోటు ప్రమాదాలు తరచూ జరుగుతున్నా, దుర్ఘటనలను నివారించేందుకు ప్రభుత్వం వద్ద ఎటువంటి నిర్దిష్టమైన ప్రణాళికలు లేవని మరోసారి రుజువైంది. ఆంధ్ర, తెలంగాణల్లో గోదావరిపై లాంచీలు ప్రయాణించేందుకు అనువైన జలరవాణా మార్గం రాజమహేంద్రవరం నుంచి కూనవరం వరకు మాత్రమే ఉంది.

09/18/2019 - 02:12

మూడున్నర దశాబ్దాల క్రితం నిర్ధారించిన యురేనియం తవ్వకాలకు సంబంధించి ఎట్టకేలకు జనంలో మేల్కొలుపు వచ్చింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ‘యురేనియం’ సెగలు భగ్గుమంటున్నాయి. ముఖ్యంగా విపక్ష రాజకీయ పార్టీలు ఈ అంశాన్ని తమకు అనుకూలంగా వాడుకునేందుకు కదం తొక్కుతున్నాయి. యరేనియం వినాశనం కళ్లారా చూసిన పర్యావరణ వేత్తలు మాత్రం ఆందోళనతో బెంబేలెత్తుతున్నారు.

09/15/2019 - 00:55

ప్రపంచ వ్యాప్తంగా ఏటా 90 లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్ర జలాల్లో కలుస్తున్నాయి. ఇవిగాక చేపలు పట్టడానికి ఉపయోగించి, ఆ తర్వాత సముద్రంలో పారేసే ప్లాస్టిక్ వలలు ఏటా 6 లక్షల 40వేల టన్నుల వరకు ఉంటాయి. నౌకలలో ప్రయాణించేవారు పారవేసే ప్లాస్టిక్ వ్యర్థాలకు అంతే లేదు.

09/13/2019 - 22:15

అలనాటి కేంద్ర హోమ్ మంత్రి సర్దార్ పటేల్ సైన్యాన్ని తెలంగాణకు పంపించి రాజ్యాన్ని ఆక్రమించుకున్నారని, హైదరాబాద్ సంస్థానం ఎప్పుడూ బ్రిటిష్ పాలనలో భాగం కాదని, స్వతంత్ర దేశమని, అందుకనే దేశం అంతా వచ్చిన స్వాతంత్య్రం ఈ ప్రాంతానికి వర్తించదని... అంటూ వామపక్షాలతో పాటు ముస్లిం మతోన్మాదులకు వంత పాడుతున్న రాజకీయ నేతలు, పార్టీలు, కుహనా మేధావులు తరచూ వితండ వాదం చేస్తుంటారు.

09/12/2019 - 04:27

రాజ్యాంగంలోని 371వ అధికరణం జోలికెళ్లేప్రసక్తి లేదని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా చేసిన ప్రకటన దేశవ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకుంది. జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే 370వ అధికరణాన్ని ఇటీవల కేంద్రం రద్దు చేసిన సంగతి విదితమే. 370వ అధికరణం రద్దుతో 72 ఏళ్లుగా దేశాన్ని పట్టి పీడిస్తున్న కశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. దీంతో 371వ అధికరణను సైతం రద్దు చేస్తారనే వదంతులు వచ్చాయి.

09/11/2019 - 01:45

‘శకునం చెప్పే బల్లి కుడితిలో పడింది..’, ‘కంచే చేను మేసినట్టు..’ - ఈ సామెతలు నేటి న్యా యవ్యవస్థలో కొంతమంది తీరుకు అద్దం పడుతున్నాయి. ప్రపంచంలోనే అత్యుత్తమమైనదిగా పేరుగాంచిన భారతీయ న్యాయవ్యవస్థకు ఏ ఇతర న్యాయవ్యవస్థ కూడా సాటిరాదు. కానీ ‘తులసివనంలో గంజాయి మొక్కల’ తీరుగా న్యాయవ్యవస్థకు మకిలి అంటించే న్యాయాధికారులు, న్యాయమూర్తులు రోజురోజుకూ పెరిగిపోతున్నారు.

09/06/2019 - 21:49

గత 70 ఏళ్ళలో దేశం ఎదుర్కొనని విధంగా నేడు ఆర్థిక వృద్ధి మందగిస్తున్నట్లు నీతిఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్ ఆ మధ్య ఒక సంద ర్భంలో చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా, ఆరేళ్లలో కనిష్టానికి - 5 శాతానికి జీడీపీ వృద్ధి రేటు పడిపోయింది. దేశం 5 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించినప్పటి నుండి అత్యంత కీల కమైన ఆర్థిక సూచికలు నిరాశ కలిగిస్తున్నాయి.

09/05/2019 - 02:05

ప్రతి అంశంపైన ఏకాభిప్రాయం ఉండాలనే నిబంధనేమీ లేదు. అవతలి వ్యక్తి చెప్పే ప్రతి అభిప్రాయానికి తానా అంటే తందానా చప్పట్లు కొట్టాల్సిన పనిలేదు. కానీ ప్రతి అంశంపై చర్చ ఉండాలి. ఈ చర్చ మర్యాదపూర్వకంగా కొనసాగాలి. ఈ చర్చలో అందరి అభిప్రాయాలను వినే ఓపిక ఉండాలి. వ్యక్తుల మధ్య, సంస్థల మధ్య అర్థవంతమైన చర్చలు ఉండాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటీవల ఒక సదస్సులో ప్రజలను కోరారు.

Pages