S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

11/25/2015 - 11:36

ఒంగోలు: ఇక్కడి రాజీవ్‌నగర్‌లో ఓ గ్రానైట్ వ్యాపారి ఇంట్లో మంగళవారం అర్ధరాత్రి దొంగలు ప్రవేశించి ఐదు సవర్ల బంగారం, మూడు కిలోల వెండి, మూడు లక్షల నగదును దోచుకున్నారు. చోరీ జరిగినట్లు బుధవారం ఉదయం గుర్తించి బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

11/25/2015 - 11:35

హైదరాబాద్: కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా ఆంధ్ర, తెలంగాణాల్లో ప్రముఖ శైవ క్షేత్రాలు బుధవారం భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో శివాలయాలకు చేరుకొని పూజాదికాలు నిర్వహిస్తున్నారు. భద్రాచలం వద్ద గోదావరిలో వేలాదిమంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. గుంటూరు జిల్లా బాపట్ల సమీపంలోని సూర్యలంక సాగర తీరంలో వేలాదిగా భక్తులు పుణ్యస్నానాలు చేశారు.

11/24/2015 - 18:18

చిత్తూరు: మేయర్‌ అనూరాధ దంపతుల హత్య కేసులో మరో ఇద్దరు లొంగిపోయినట్లు జిల్లా ఎస్పీ శ్రీనివాస్‌ వెల్లడించారు. మంగళవారం చిత్తూరు రెండో పట్టణ పోలీస్‌స్టేషన్లో మురగ, పరందామన్‌ అనే ఇద్దరు లొంగిపోయారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ ముగ్గురు నిందితులను మీడియా ఎదుట హాజరుపరిచారు.

11/24/2015 - 15:54

విజయవాడ : పోలవరం ప్రాజెక్టుపై వున్న పర్యావరణ ఆంక్షలన్నీ శాశ్వతంగా రద్దుచేయాలని సీఎం చంద్రబాబు కోరారు. మంగళవారం పార్లమెంటు సభ్యులతో సీఎం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే నాలుగేళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తామని తెలిపారు.

11/24/2015 - 14:29

నెల్లూరు : ప్రభుత్వం నుంచి సాయం అందేలా టీడీపీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని బాధితులకు వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. మంగళవారం నెల్లూరు జిల్లాలో వెంకటగిరిలో పర్యటించారు. ఉధృతంగా ప్రవహిస్తున్న కైవల్యానదిని ఆయన పరిశీలించారు. అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలను వైఎస్ జగన్ పరామర్శించారు.

11/24/2015 - 11:40

నెల్లూరు: గూడూరు మండలం తిప్పవరపాడు వద్ద వాగులో సోమవారం గల్లంతయిన నలుగురిలో ముగ్గురి మృతదేహాలు మంగళవారం ఉదయం లభ్యమయ్యాయి. ఈ ఘటనలో ఓ వ్యక్తిని సోమవారం నాడు స్థానికులు రక్షించారు. వాగులో మునిగి తన కుమార్తె రమణమ్మ మృతి చెందినట్లు తెలిసాక ఆమె తండ్రి హఠాత్తుగా గుండెపోటుకు లోనై మరణించాడు. తండ్రీ కుమార్తెల మరణంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి

11/24/2015 - 11:40

హైదరాబాద్: వరంగల్ ఉపఎన్నికలో తెరాస అభ్యర్థిని గెలిపించటం కోసమే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పోటీ చేసిందని, ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రయోజనాలను పరిరక్షించేందుకే జగన్ ఆరాట పడుతున్నారని టిడిపి నేత గాలి ముద్ద కృష్ణమనాయుడు ఆరోపించారు. విపక్షాల ఓట్లను చీల్చి పరోక్షంగా తెరాస గెలుపునకు జగన్ సహకరించారని విమర్శించారు.

11/24/2015 - 11:38

చిత్తూరు: పెద్దతిప్ప సముద్రం మండలంలో ఉధృతంగా ప్రవహిస్తున్న పాపాగ్ని నదిలో మంగళవారం ఉదయం 30 మంది కూలీలు చిక్కుకొన్నారు. వీరిని కాపాడేందుకు స్థానికులు సహాయక చర్యలు ప్రారంభించారు.

11/24/2015 - 11:37

కర్నూలు: చాగలమర్రి మండలం చిన్నవంగళిలో మంగళవారం ఉదయం పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేసి ఎర్రచందనం డంప్‌ను గుర్తించారు. అందులో దాదాపు కోటి రూపాయల విలువచేసే 300 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటిని దాచిపెట్టిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

11/24/2015 - 11:36

విజయవాడ: నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో వరద నష్టం సహాయ కార్యక్రమాల అమలుతీరుపై ఎ.పి. సి.ఎం. చంద్రబాబు మంగళవారం ఉదయం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పలువురు అధికారులతో ఆయన నేరుగా మాట్లాడారు. వరద ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు.

Pages