S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

11/30/2015 - 11:46

విజయవాడ: కార్తీక మాసం మూడో సోమవారం సందర్భంగా శైవ క్షేత్రాల్లో భక్తుల రద్దీ అధికమైంది. తెల్లవారుజాము నుంచే భక్తులు తరలి రావడంతో ఆలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి. ఎ.పి.లోని పంచారామ క్షేత్రాలు, శ్రీశైలం, శ్రీకాళహస్తి, తెలంగాణలోని భద్రాచలం, యాదగిరిగుట్ట, తదితర పుణ్యక్షేత్రాల్లో కార్తీక దీపాలు వెలిగించారు.

11/30/2015 - 11:45

ఒంగోలు: ఇక్కడి వ్యవసాయ మార్కెట్ యార్డు సమీపంలో సోమవారం ఉదయం ఓ ప్రైవేట్ స్కూల్‌కి చెందిన బస్సు బోల్తాపడగా 40 మంది విద్యార్థులు గాయపడ్డారు. త్రోవగుంట నుంచి ఒంగోలు వైపు స్కూల్ బస్సు వస్తుండగా వేగంగా వస్తున్న లారీ ఢీకొంది. దీంతో బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. డ్రైవర్‌తోపాటు గాయపడిన విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు.

11/28/2015 - 14:07

ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లాలో సంచలనం సృష్టించిన కృపామణి హత్యకేసు నిందితుడు శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం సాయంత్రం మీడియా ముందు ప్రవేశపెట్టనున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు.

11/28/2015 - 14:05

విజయవాడ : ఏపీ భాజపా పదాధికారుల సమావేశం విజయవాడలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి ఎంపీ, పార్టీ ఏపీ అధ్యక్షుడు కంభపాటి హరిబాబు, మాజీ కేంద్రమంత్రి పురంధ్రీశ్వరి, భాజపా ముఖ్యనేతలు హాజరయ్యారు. పార్టీ మండల, జిల్లా కమిటీల ఎన్నికలు త్వరలో పూర్తిచేస్తామని కంభంపాటి హరిబాబు చెప్పారు.

11/28/2015 - 14:03

చిత్తూరు : స్థానికి ఆర్ అండ్ బి అతిథి గృహంలో మేయర అనురాధ హత్యకేసుపై డీజీపీ రాముడు సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా డీజీపీ రాముడు మాట్లాడుతూ హత్యకేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, ఎవ్వరినీ వదిలే ప్రసక్తిలేదని అన్నారు.

11/28/2015 - 11:29

విజయవాడ: చిరకాలంగా అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నూజివీడులోని ట్రిపుల్ ఐటి లెక్చరర్లు శనివారం ఆందోళన ప్రారంభించారు. వీరంతా విధులను బహిష్కరించటంతో పరీక్షలు నిలిచిపోయాయి.

11/28/2015 - 11:29

గుంటూరు: నాగార్జున యూనివర్సిటీలో ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం విద్యార్థి గణేశ్ అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఈ యువకుడు కొద్ది రోజులుగా కనిపించటం లేదు. ఈ విషయం తెలుసుకొని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. గణేశ్ ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

11/28/2015 - 11:28

నెల్లూరు: అనుమానం పెనుభూతం కావడంతో భార్యను కత్తితో నరికి చంపి ఓ భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన విడవలూరు మండలం రామతీర్థంలో శనివారం వెలుగు చూసింది. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు గ్రామానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు.

11/28/2015 - 11:28

రాజమండ్రి: కూనవరం మండలం ముల్లూరులో శనివారం ఉదయం ముగ్గురు యువతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. స్థానికులు వెంటనే వీరిని గమనించి ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యా యత్నానికి దారితీసిన కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

11/28/2015 - 11:27

విశాఖ: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగటంతోపాటు ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో రాబోయే రెండు రోజుల్లో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అధికారులను ఎ.పి. ప్రభుత్వం అప్రమత్తం చేసింది.

Pages