-
విజయవాడ, ఏప్రిల్ 13: రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహారాల్లో తాజాగా చోటుచేసుకున్న
-
గుంటూరు, ఏప్రిల్ 13: స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసి కరోనా మహమ్మారి నుంచ
-
విజయవాడ: కరోనా వైరస్ సోకిన బాధితులకు ఎయిమ్స్ వైద్యులతో మాట్లాడి అత్యుత్తమ వైద
-
విజయవాడ: రాష్ట్రంలో సోమవారం సాయంత్రానికి 439 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఆంధ్రప్రదేశ్
విజయవాడ: ఏపీ డీజీపీ క్యాంపు కార్యాలయాన్ని విజయవాడలో డీజీపీ జేవీరాయుడు ప్రారంభించారు. క్యాంపు ఆఫీసులో డీజీపీ పేషీతో పాటు ఇతర పోలీసులు విభాగాలను ఏర్పాటు చేశారు. ఆరు నెలల్లో డీజీపీ క్యాంపు కార్యాలయాన్ని సిద్ధం చేశారు.
విజయవాడ: ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన సుమారు నాలుగు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలపై కేబినెట్ సుదీర్ఘంగా చర్చించింది. రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీవర్షాలు, వరదలు, రాజధాని నిర్మాణంతదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది.
చిత్తూరు :చిత్తూరు మేయర్ అనురాధ, ఆమె భర్త మోహన్ హత్యకేసులో ప్రధాన నిందితుడు చింటూ సోమవారం కోర్టులో లొంగపోయారు. ఈ హత్యకేసులో ఎ1 నిందితుడిగా చింటూపై పోలీసులు కేసు నమోదు చేశారు. మేయర్ దంపతులు హత్య జరిగినప్పటి నుంచి చింటూ అజాతంలో ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో చింటూ విదేశాలకు పారిపోకుండా అన్ని విమానాశ్రయాలలో అలెర్ట్ చేశారు. సోమవారం చింటూ చిత్తూరు జిల్లా కోర్టులో లొంగిపోయారు.
చిత్తూరు: చిత్తూరు నగర మేయర్ అనూరాధ, ఆమె భర్త హత్య కేసుకు సంబంధించి మహిళా కార్పొరేటర్ భర్త మురుగ, ప్రధాన సూత్రధారి చింటూ పి.ఏ పరంధామ, హరిదాసులను పోలీసులు అరెస్టు చేశారు. కీలక నిందితుడైన చింటూ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. తాజాగా అరెస్టు చేసిన ముగ్గురిని సోమవారం మీడియా ముందు హాజరుపరిచారు.
విశాఖ: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరో విధంగా ఎ.పి. సి.ఎం. చంద్రబాబు వ్యవహరిస్తున్నారని సిపిఎం నేత బృందా కారత్ ఆరోపించారు. బాక్సైట్ తవ్వకాలపై రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన శే్వతపత్రం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోందని ఆమె సోమవారం ఇక్కడ మీడియాతో అన్నారు.
విశాఖ: విశాఖ జిల్లా అచ్యుతాపురంలో సోమవారం ఉదయం యలమంచిలి వైపు వెళ్తున్న ట్రాక్టర్‌ను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో ఓ వ్యక్తి మరణించాడు. ట్రాక్టర్‌లో ప్రయాణిస్తున్న మరో ఐదుగురు కూలీలు గాయపడ్డారు. క్షతగాత్రులను విశాఖ కెజిహెచ్‌కు తరలించారు.
ఏలూరు: జిల్లా పంచాయతీ అధికారి శ్రీ్ధర్ అక్రమంగా ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై ఎసిబి అధికారులు సోమవారం ఉదయం వివిధ ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఏలూరు, విజయవాడ, కడప, హైదరాబాద్, తణుకు ప్రాంతాల్లో శ్రీ్ధర్, ఆయన బంధువుల ఇళ్లపై సోదాలు చేస్తున్నారు.
విజయవాడ: విజయవాడ నుంచి పోలీస్ వ్యవస్థ పనితీరును కేంద్రీకృతం చేసేందుకు సోమవారం ఉదయం ఇక్కడ డీజిపి క్యాంప్ కార్యాలయాన్ని డీజిపి జె.వి.రాముడు ప్రారంభించారు. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం సమీపంలోనే ఇది ప్రారంభమైంది. డీజిపి అధికారిక నివాసం కూడా రెండు నెలల క్రితమే ఇక్కడ ప్రారంభమైంది.
విశాఖ: గూడెం కొత్తవీధి మండలం కుంకుమపూడిలో ఆదివారం అర్ధరాత్రి మావోయిస్టులు ప్రవేశించి రేషన్ దుకాణాన్ని ధ్వంసం చేశారు. దుకాణంలో సరుకులన్నింటినీ వారు దోచుకెళ్లారు.
చిత్తూరు: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి, ఉపరితల ఆవర్తనం కదులుతుండటంతో చిత్తూరు, తమిళనాడులోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు జిల్లా చంద్రగిరి, సత్యవీడు, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా ఆరు జిల్లాల్లో పాఠశాలలకు తమిళనాడు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.