-
విజయవాడ, ఏప్రిల్ 13: రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహారాల్లో తాజాగా చోటుచేసుకున్న
-
గుంటూరు, ఏప్రిల్ 13: స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసి కరోనా మహమ్మారి నుంచ
-
విజయవాడ: కరోనా వైరస్ సోకిన బాధితులకు ఎయిమ్స్ వైద్యులతో మాట్లాడి అత్యుత్తమ వైద
-
విజయవాడ: రాష్ట్రంలో సోమవారం సాయంత్రానికి 439 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఆంధ్రప్రదేశ్
విశాఖ: బంగాళాఖాతంలో స్థిరంగా ఉన్న ఉపరితల ఆవర్తనం మరింతగా బలపడి రానున్న 24 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నందున ఆది, సోమవారాల్లో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తమిళనాడు, పుదుచ్చేరిలో కూడా వర్షాలు కురుస్తాయి. మరోసారి వర్షాలు కురుస్తాయని తెలియడంతో అధికారులను ఎ.పి. ప్రభుత్వం అప్రమత్తం చేస్తోంది.
చిత్తూరు: ఎ.పి. సి.ఎం. చంద్రబాబు మనవడు దేవాంశ్ తలనీలాలను శుక్రవారం ఉదయం చిత్తూరు జిల్లా నారావారిపల్లిలో కుటుంబ ఇలవేల్పు అయిన నాగాలమ్మ తల్లికి సమర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు, బాలకృష్ణ దంపతులు నాగాలమ్మ తల్లి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. నారా, నందమూరి కుటుంబీకుల రాకతో గ్రామంలో కోలాహలం నెలకొంది.
విజయవాడ : ఇసుక తక్కువ ధరకు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలో ఇసుక విధానంపై చంద్రబాబు గురువారం శ్వేత పత్రం విడుదల చేశారు. రాష్ట్రంలో 387 ఇసుక రీచ్ ల గుర్తించినట్లు చెప్పారు. ఇందులో 368 రీచ్ లలో తవ్వకాలు జరుగుతున్నట్లు చంద్రబాబు తెలిపారు.
నరసరావుపేట : డిసెంబరు 11, 12, 13 తేదీల్లో గుంటూరు జిల్లా నరసరావుపేట పురపాలిక శతవసంత ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు. నరసరావుపేటలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.... కార్యక్రమం వివరాలు వెల్లడించారు. ఉత్సవాలకు గవర్నర్ నరసింహన్ హాజరవుతారని తెలిపారు.
శ్రీకాకుళం: వజ్రపుకొత్తూరు మండలం అక్కుపల్లి వద్ద సముద్ర తీరానికి గురువారం ఉదయం 67 ఏళ్ల వృద్ధుడి మృతదేహం కొట్టుకు వచ్చింది. వృద్ధుడిని రిటైర్డ్ టీచర్ అప్పలస్వామిగా గుర్తించారు. ఇతను కొద్దిరోజులుగా కనిపించటం లేదని, పోలీసులు తెలిపారు. అప్పలస్వామి సముద్రంలో పడి ఆత్మహత్య చేసుకొని ఉండచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
కడప: కడప జిల్లా వేమూరు మండలం నల్లచెరువు వద్ద గురువారం ఉదయం ట్రాక్టర్ బోల్తాపడిన ఘటనలో ఓ మహిళ మరణించగా, 12 మంది గాయపడ్డారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా నల్లచెరువులోని భైరవ స్వామి ఆలయాన్ని సందర్శించుకొని వీరంతా ట్రాక్టర్‌లో వస్తూండగా ఈ ప్రమాదం జరిగింది.
నెల్లూరు: ఎ.పి. సి.ఎం. చంద్రబాబు తప్పుడు వాగ్దానాలతో ప్రజలను వంచిస్తూ పాలిస్తున్నారని వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి ఆరోపించారు. నెల్లూరు జిల్లాలో వరద బాధితులను పరామర్శించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కుంటే తాము చూస్తూ ఊరుకోమన్నారు. ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకున్న వారికి పక్కా ఇళ్లు నిర్మించాలని వారు డిమాండ్ చేశారు.
ఏలూరు: పాఠశాలలో విద్యుత్ షాక్‌కు గురై ఇద్దరు చిన్నారులు మరణించిన దుర్ఘటన పెద్దవేగి మండలం భోగాపురంలోని బైబిల్ స్కూల్‌లో గురువారం ఉదయం జరిగింది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
విశాఖ: దక్షిణ అండమాన్ సముద్రం పరిసర ప్రాంతాల్లో స్థిరంగా ఉన్న ఉపరితల ఆవర్తనం మరింత బలపడి అల్పపీడనంగా మారే అవకాశాలు ఉన్నందున దక్షిణ కోస్తాలో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్‌లలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
చిత్తూరు: ఎ.పి. సి.ఎం. చంద్రబాబు రెండు రోజులపాటు పర్యటించేందుకు చిత్తూరు జిల్లాకు చేరుకున్నారు. గురువారం రాత్రి ఆయన తన స్వగ్రామమైన నారావారిపల్లిలో కుటుంబ సభ్యులతో బస చేస్తారు. ఈ నెల 27న ఆయన తన మనవడు దేవాంశ్ తలనీలాల కార్యక్రమం నిర్వహిస్తారు.