S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

11/28/2015 - 11:27

కాకినాడ: రాజానగరం మండలం దివాన్ చెరువు వద్ద శనివారం తెల్లవారుజామున వేగంగా వస్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఢీకొంది. ఈ ఘటనలో ఇంజనీరింగ్ విద్యార్థి ఆదిత్య మరణించగా, ఆరుగురు ప్రయాణీకులు తీవ్రంగా గాయపడ్డారు. విశాఖలోని గీతం కళాశాలలో చదువుతున్న ఆదిత్య స్వస్థలమైన తిరుపతి వెళ్లేందుకు బస్సులో బయలుదేరగా ఈ దుర్ఘటన జరిగింది.

11/28/2015 - 11:26

నెల్లూరు: కోవూరు వద్ద పెన్నానదిలో శనివారం ఉదయం ఇద్దరు విద్యార్థులు నీట మునిగి గల్లంతయ్యారు. వీరి ఆచూకీ కోసం స్థానికులు గాలిస్తున్నారు.

11/28/2015 - 11:25

హైదరాబాద్: దాదాపు నెల రోజుల విరామం అనంతరం ఎ.పి. సి.ఎం. చంద్రబాబు శనివారం ఉదయం ఇక్కడి సచివాలయానికి వచ్చి వివిధ శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. వివిధ సంక్షేమ పథకాలు, వాటి లక్ష్యాలకు సంబంధించి ఆయన ఆరా తీశారు. పలువురు మంత్రులు కూడా ఈ సందర్భంగా హాజరయ్యారు.

11/28/2015 - 11:24

ఒంగోలు: ఒంగోలు పట్టణంలో శనివారం ఉదయం కొన్ని సెకన్ల పాటు భూమి స్వల్పంగా కంపించింది. దీంతో జనం భయాందోళనలకు గురై ఇళ్లల్లోంచి పరుగులు తీశారు. ఎక్కడా ఎలాంటి ఆస్తి నష్టం జరగలేదు.

11/27/2015 - 13:48

నెల్లూరు : ఆనం సోదరులు టిడిపిలో చేరేందుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో శుక్రవారంనాడు ఆనం సోదరులు మీడియా సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆనం వివేకానందరెడ్డి మాట్లాడుతూ సామాజిక బాధ్యతతోనే టిడిపిలో చేరాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆనం నారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రజాసేవే తమ లక్ష్యమని వెల్లడించారు.

11/27/2015 - 13:48

చిత్తూరు : ఏడాదికి 400 కి.మీ చొప్పున ఐదేళ్లలో గ్రామీణ ప్రాంత రోడ్ల నిర్మాణం పూర్తిచేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆయన నారావారిపల్లెలో జన్మభూమి కమిటీ సభ్యులు, అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వందశాతం మరుగుదొడ్ల నిర్మాణం చేపడతామని వెల్లడించారు.

11/27/2015 - 12:54

హైదరాబాద్ : హైదరాబాద్ లో నలుగురు సభ్యుల డ్రగ్స్ ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. గోవా నుంచి డ్రగ్స్ తీసుకుని హైదరాబాద్ లో విద్యార్థులకు విక్రయిస్తుండగా వారిని పోలీసులు పట్టుకున్నారు. ముఠా నుంచి భారీగా డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.

11/27/2015 - 11:58

శ్రీకాకుళం: శ్రీకాకుళం పట్టణం శివారులోని కొత్తరోడ్డు జంక్షన్‌లో శుక్రవారం తెల్లవారుజామున ఫ్లైఓవర్ పైనుంచి ఒక కారు కిందికి బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మరణించగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా కారులో ఒడిశా వైపు వెళుతున్నారు. అతి వేగం కారణంగానే ఈ ఘటన జరిగినట్లు పోలీసులు చెప్పారు.

11/27/2015 - 11:57

చిత్తూరు: గుడుపల్లి మండలం బోయినపల్లి, చినపర్తికుంట, సంగనపల్లి తదితర గ్రామాల్లో శుక్రవారం తెల్లవారుజామున ఏనుగులు బీభత్సం సృష్టించాయి. పొలంలో నిద్రిస్తున్న ముగ్గురు రైతులపై ఏనుగులు దాడి చేయగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి గ్రామస్థులు అటవీ శాఖ అధికారులకు సమాచారం చేరవేశారు.

11/27/2015 - 11:56

చిత్తూరు: తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో ఎయిర్ ఇండియా మేనేజర్‌తో వాదానికి దిగి అక్కడి సిబ్బందిపై దాడి చేశారన్న ఆరోపణలకు సంబంధించి రాజంపేట వైకాపా ఎం.పీ. మిథున్‌రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి సహా 13 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Pages