S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/03/2015 - 11:39

రాజమండ్రి: కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆంధ్రప్రదేశ్‌లో 81 మంది మరణించారని, డిప్యూటీ సిఎం నిమ్మకాయల చినరాజప్ప గురువారం ఇక్కడ చెప్పారు. అకాల వర్షాలకు పంటలు భారీగా దెబ్బతిన్నట్టు చెప్పారు. సుమారు 6,750 కోట్ల మేరకు ఆస్తి, పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశామన్నారు. వర్షాలతో అతలాకుతలమైన తమిళనాడుకు వీలైనంత సాయం చేస్తామని ఆయన వివరించారు.

12/03/2015 - 11:38

హైదరాబాద్: శుక్ర, శనివారాల్లో తమిళనాడు, ఆంధ్రా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. పలు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశం ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వారు హెచ్చరిస్తున్నారు.

12/03/2015 - 11:36

చిత్తూరు: చిత్తూరు నగర మేయర్ అనూరాధ దంపతుల హత్య కేసుకు సంబంధించి మరో నిందితుడిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన చింటూ డ్రైవర్ కోర్టులో లొంగిపోయేందుకు ఇక్కడికి రావడంతో పోలీసులు పసిగట్టి అరెస్టు చేశారు.

12/02/2015 - 13:23

విజయవాడ:జపాన్ తన పెట్టుబడులకు ఏపీని రెండో రాజధానిగా చేసుకోవాలనిముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలోని ఓ హోటల్లో జపాన్ బృందంతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జపాన్ కంపెనీలు రైస్, రైస్ బ్రాన్ ఆయిల్, ఆక్వా, పండ్లు, కూరగాయల ప్రాసెసింగ్‌లో పెట్టుబడులకు, మెగా ఫుడ్ పార్కుల ఏర్పాటుకు ఆసక్తి చూపిస్తున్నట్లు ప్రతినిధులు చెప్పారు.

12/02/2015 - 11:39

తిరుమల: తిరుమలలోని శ్రీవారి ఆస్థాన మండపంలో బుధవారం ఉదయం ధార్మిక సదస్సు ప్రారంభమైంది. వివిధ ప్రాంతాల నుంచి పలువురు పీఠాధిపతులు, మఠాధిపతులు, ఆధ్యాత్మికవేత్తలు సదస్సుకు హాజరయ్యారు. రాష్ట్ర దేవాదాయ మంత్రి మాణిక్యాలరావు, టిటిడి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఇవో సాంబశివరావు, తదితరులు ఈ సందర్భంగా మాట్లాడారు.

12/02/2015 - 11:39

చిత్తూరు: భారీ వర్షాల ఫలితంగా చిత్తూరు జిల్లాకు వరద ముప్పు పొంచి ఉంది. అనేక వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సత్యవేడు మండలం వెంకట్రాజుల కండ్రిగ వద్ద బుధవారం ఉదయం వాగులో నలుగురు గల్లంతయ్యారు. గోవిందవరం వద్ద స్వర్ణముఖి నదిలో కొట్టుకుపోతున్న ఇద్దరిని స్థానికులు రక్షించారు.

12/02/2015 - 11:38

చిత్తూరు: భారీ వర్షాల కారణంగా ఎ.పి. సి.ఎం. చంద్రబాబు బుధవారం తిరుపతిలో జరుపనున్న పర్యటన రద్దయింది. పద్మావతి వైద్య కళాశాల ప్రారంభోత్సవం, స్విమ్స్ స్నాతకోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొనాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నందున సహాయక చర్యలను పక్బందీగా చేపట్టాలని ఆయన అధికారులకు ఆదేశించారు. చెరువులకు గండ్లు పడకుండా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

12/02/2015 - 11:37

విజయవాడ: భారీ వర్షాలతో అతలాకుతలమైన చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని వారికి తక్షణ సాయం అందించాలని ఎ.పి. సి.ఎం. చంద్రబాబు ఆదేశించారు. జన్మభూమి కమిటీలతో కూడా ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి వరద ప్రాంతాల్లో సహాయక చర్యలకు అండగా ఉండాలని సూచించారు.

12/02/2015 - 11:36

విజయవాడ: నెల్లూరు జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులు ఆనం రామనారాయణరెడ్డి, ఆనం వివేకానందరెడ్డి బుధవారం ఉదయం ఇక్కడ టిడిపి అధ్యక్షుడు, ఎ.పి. సిఎం చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీలో చేరారు. చంద్రబాబు నివాసానికి ఉదయం 9 గంటలకు ఆనం సోదరులు వచ్చారు. వారికి పార్టీ కండువాలను కప్పి చంద్రబాబు ఆహ్వానించారు. రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని తాము తెలుగుదేశంలో చేరినట్లు ఆనం సోదరులు ప్రకటించారు.

12/01/2015 - 18:41

గుంటూరు : పేదల కోసం దూరదృష్టితో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. వేమూరులో నిర్వహించిన జనచైతన్య యాత్రలో భాగంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తెదేపా ఎప్పుడూ ప్రజల్లో ఉంటుందన్నారు.

Pages