S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

11/23/2015 - 12:05

దిల్లీ: ఉత్తర భారతంలోని పలు ప్రాంతాలతోపాటు పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్‌లలో ఆదివారం అర్ధరాత్రి దాటాక భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. జమ్మూ కాశ్మీర్, దిల్లీలో భూమి స్వల్పంగా కంపించింది. పాక్‌లోని లాహోర్, రావల్పిండి, ఫైసలాబాద్, ఇస్లామాబాద్, ఆఫ్గన్‌లోని కాబూల్ ప్రాంతంలో ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 6.2 గా నమోదైంది. ఎక్కడా ఎలాంటి ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం లేదు.

11/23/2015 - 12:04

కర్నూలు: సొంత కొడుకే కత్తితో దాడి చేయడంతో ఓ తండ్రి ఆస్పత్రి పాలయ్యాడు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. రుద్రవరం మండలం ఆలమూరులో తండ్రిపై కొడుకు ఈ రోజు ఉదయం కత్తితో దాడిచేసి తీవ్రంగా గాయపరిచాడు. స్థానికులు వెంటనే తండ్రిని ఆస్పత్రిలో చేర్పించారు.

11/23/2015 - 12:04

చిత్తూరు: కొద్ది రోజుల క్రితం హత్యకు గురైన మేయర్ అనురాధ దంపతుల హత్య కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. హత్య కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న చింటూ అనుచరుల ఇళ్లపై సోమవారం సోదాలు ప్రారంభించారు. ఇక్కడి సంతపేటలో మహిళా కార్పొరేటర్ భర్త మురుగ ఇంట్లో పోలీసులు ఆధారాల కోసం ఆరా తీశారు.

11/23/2015 - 12:03

విజయనగరం: గతంలో కంటే ఇప్పుడు ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు మెరుగు పడుతున్నాయని కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు అన్నారు. ఇక్కడి మహారాజా ప్రభుత్వ ఆస్పత్రిలో ఆధునీకరించిన శస్తచ్రికిత్సల విభాగాన్ని ఆయన సోమవారం ప్రారంభించారు. సామాన్య ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం కుదిరేలా వైద్యులు సేవలందించాలని ఆయన సూచించారు.

11/23/2015 - 12:03

గుంటూరు: నాగార్జున విశ్వవిద్యాలయంలో జూనియర్లపై కొందరు సీనియర్లు తాజాగా ర్యాగింగ్‌కు పాల్పడిన సంఘటన సంచలనం సృష్టించింది. ఇటీవల రిషితేశ్వరి అనే విద్యార్థిని ర్యాగింగ్ కారణంగా ఆత్మహత్యకు పాల్పడగా, కొందరు విద్యార్థులు జైలుపాలైనప్పటికీ మళ్లీ ఈ తరహా సంఘటనలు ఇక్కడ చోటు చేసుకుంటున్నాయి.

11/23/2015 - 12:03

నెల్లూరు: నెల్లూరు జిల్లా గూడూరు మండలంలో కైవల్య నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఐదుగురు వ్యక్తులు ఆదివారం సాయంత్రం గల్లంతయ్యారు. గల్లంతయిన వారి ఆచూకీ కనుగొనేందుకు గాలింపు చర్యలు ప్రారంభించగా, సోమవారం ఉదయం ఓ వ్యక్తిని పోలీసులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. మిగతా నలుగురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

11/23/2015 - 12:02

అనంతపురం: సత్యసాయిబాబా జయంతి వేడుకలు సోమవారం అనంతపురంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్, రాష్ట్ర మంత్రి పల్లె రఘునాథరెడ్డి, తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.

11/23/2015 - 12:01

విజయవాడ: చైనాకు చెందిన ప్రతినిధుల బృందంతో ఎ.పి. సి.ఎం. చంద్రబాబు సోమవారం ఇక్కడ ఓ హోటల్‌లో సమావేశమయ్యారు. రాజధాని అమరావతి నిర్మాణం, పరిశ్రమల్లో పెట్టుబడులు, తదితర అంశాలపై చైనా బృందంతో సి.ఎం. చర్చిస్తున్నారు.

11/21/2015 - 15:47

చిత్తూరు: పొలానికి వెళ్లిన ఓ రైతు ప్రమాదశాత్తు జారి చెక్ డ్యాంలో పడి ప్రాణాలు కోల్పోయాడు. చిత్తూరు జిల్లా పెద్దతిప్పసముద్రం మండలం మారుదానిపల్లి గ్రామానికి చెందిన వెంకట్రాయప్ప(70) మధ్యాహ్నం పొలానికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు అక్కడే ఉన్న చెక్‌డ్యాంలో పడిపోయాడు. వర్షాలకు చెక్‌డ్యాం నిండి ఉండటంతో వరద తాకిడికి ఆయన కొట్టుకుపోయాడు.

11/21/2015 - 14:21

నెల్లూరు: టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. శనివారం మధ్యాహ్నం సీఎం చంద్రబాబు నెల్లూరు జిల్లా పర్యటనలో పాల్గొన్న సోమిరెడ్డికి ఛాతిలో నొప్పి రావడంతో వెంటనే నెల్లూరులోని ఆస్పత్రికి తరలించారు. ఆయన్ను పరీక్షించిన వైద్యులు ఎలాంటి అపాయం లేదని తెలిపారు.

Pages