-
విజయవాడ, ఏప్రిల్ 13: రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహారాల్లో తాజాగా చోటుచేసుకున్న
-
గుంటూరు, ఏప్రిల్ 13: స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసి కరోనా మహమ్మారి నుంచ
-
విజయవాడ: కరోనా వైరస్ సోకిన బాధితులకు ఎయిమ్స్ వైద్యులతో మాట్లాడి అత్యుత్తమ వైద
-
విజయవాడ: రాష్ట్రంలో సోమవారం సాయంత్రానికి 439 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఆంధ్రప్రదేశ్
విశాఖ: విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో చలి తీవ్రత పెరుగుతూ పగటి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. పాడేరు మన్యంలో గురువారం ఉదయం దట్టమైన పొగమంచు ఆవరించింది. దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది.
చిత్తూరు: చిత్తూరు మేయర్ అనురాధ దంపతుల హత్య కేసులో పోలీసు అధికారులు మరో ఇద్దరు నిందితులను బుధవారం అరెస్ట్ చేశారు. మంగళవారం ఈ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులు లొంగిపోయిన విషయం తెలిసిందే.
చిత్తూరు : జిల్లాలోని గుర్రంకొండలో ఇండియన్ పబ్లిక్ స్కూలు పాఠశాల భవనం కూలిపోవటంతో ఎల్‌కేజీ విద్యార్థిని రేష్మీ మృతిచెందగా, మరో ముగ్గురుకి గాయాలు అయ్యాయి. భవనం పాతది కావటంతో పాటు గత కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నానిపోవటంతో ఒక్కసారిగా కుప్పకూలింది.
అనంతపురం : జనవరినాటికి 11 లక్షల కుటుంబాలకు రేషన్‌కార్డులు అందజేస్తామని మంత్రి పరిటాల సునీత చెప్పారు. ఆమె బుధవారంనాడు రాయదుర్గంలో దీపం పథకం కింద లబ్ధిదారులకు గ్యాస్ కనెక్షన్లను మంజూరు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.
అనంతపురం : నార్పల మండలం బండ్లపల్లిలో దారుణం జరిగింది. పిల్లలకు పాలలో విషం కలిపి ఇచ్చి అనంతరం ఉరేసుకుని మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
తిరుమల : భారీ వర్షాలకు శ్రీవారి ఆలయం నీటమునిగినట్లు, ఘాట్‌రోడ్ల పరిస్థితి ప్రమాదకరంగా ఉందని తిరుమల గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు స్పష్టం చేశారు. ఎడతెరపిలేని వర్షాలకు కొన్ని సమస్యలు తలెత్తిన మాట వాస్తవమే అయినా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోందని జీఈవో చెప్పారు.
విజయవాడ : రాష్ర్టాభివృద్ధికి కేంద్రం సాయం చాలా అవసరమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. బుధవారం నగరంలో సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్‌ను చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
నెల్లూరు: గుంటూరు జిల్లాకు చెందిన ఓ డిప్యూటీ తహసీల్దార్‌పై నెల్లూరు జిల్లా నాయుడుపేటలో స్థానిక సబ్ ఇన్‌స్పెక్టర్ దాడి చేయడంపై రెవిన్యూ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో వరద నష్టాన్ని అంచనా వేసేందుకు ఆ డిప్యూటీ తహసీల్దార్ నాయుడుపేట వచ్చి మంగళవారం రాత్రి ఓ హోటల్‌లో బస చేశారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఎస్‌ఐ హోటల్‌లో బసచేసిన వారి గురించి ఆరా తీశారు.
ఒంగోలు: భార్యను అనుమానించిన ఓ భర్త ఇంటికి నిప్పంటించిన సంఘటన మంగళవారం రాత్రి జరిగింది. గిద్దలూరులోని ఏడవ వార్డులో ఈ ఘటన చోటు చేసుకుంది. మంటలు వ్యాపించడంతో ఇంట్లో ఫర్నిచర్, ఇతర పరికరాలు కాలిపోయి మూడు లక్షల మేరకు నష్టం సంభవించింది.
కడప: నందలూరు మండలం నల్ల తిమ్మాయపల్లి వద్ద చెయ్యేరు నదిలో చేపల వేటకు వెళ్లిన 12 మంది మత్స్యకారులు బుధవారం ఉదయం జాడ తెలియకుండా పోయారు. వారిని రక్షించేందుకు స్థానికులు సహాయక చర్యలు ప్రారంభించారు.