S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/05/2015 - 07:44

విశాఖపట్నం, డిసెంబర్ 4: ప్రపంచ దేశాల్లో విశాఖ కీర్తిని మరింతగా పెంచే లక్ష్యంతో విశాఖ ఉత్సవ్‌ను నిర్వహించనున్నట్టు రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. విశాఖలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఏడాది కంటే ఈసారి మరింత వైభవంగా దీనిని నిర్వహించి విశాఖ ప్రతిష్టను పెంచాలన్నారు.

12/04/2015 - 12:52

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలో షీ-ఆటోలను ప్రారంభించారు. తొలి దశలో 49మంది మహిళలకు బ్యాంకు రుణాల ద్వారా ఆటోలు పంపిణీ చేశారు.

12/04/2015 - 12:50

విజయవాడ : అమరగాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు 93వ జయంతిని విజయవాడలోని ఘంటసాల సంగీత ప్రభుత్వ కళాశాలలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర సాంస్కృతికశాఖ డైరెక్టర్‌ విజయభాస్కర్‌ ఘంటసాల విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఘంటసాల పేరిట ఒక గ్రంధాలయాన్ని ఏర్పాటు చేయాలని సినీ నేపథ్య గాయకులు కోరారు.

12/04/2015 - 11:44

గుంటూరు: మంగళగిరిలోని పోలీస్ బెటాలియన్‌లో శుక్రవారం ఉదయం జాతీయ భద్రతా దళం (ఎన్‌ఎస్‌జి) కు చెందిన ఓ గార్డు తుపాకీని శుభ్రపరుస్తుండగా ప్రమాదవశాత్తు అది పేలడంతో గాయపడ్డాడు. గాయపడిన గార్డును ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

12/04/2015 - 11:43

తిరుమల: వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల సందర్భంగా ఈ నెల 21, 22 తేదీల్లో స్వామివారి ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టిటిడి ప్రకటించింది. సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇవో సాంబశివరావు తెలిపారు.

12/04/2015 - 11:42

అనంతపురం: ఉరవకొండ సబ్ జైలులో రిమాండ్ ఖైదీకి ఉంటున్న 35 ఏళ్ల సమీర్‌ఖాన్ ఆత్మహత్యకు పాల్పడినట్లు శుక్రవారం ఉదయం జైలు సిబ్బంది కనుగొన్నారు. పలు చోరీ కేసుల్లో నిందితుడైన ఇతను గత నెల 13 నుంచి ఈ జైలులో ఉంటున్నాడు. శుక్రవారం ఉదయం స్నానానికని బాత్‌రూంలోకి వెళ్లి ఎంతసేపటికి రాకపోవడంతో జైలు సిబ్బంది అనుమానించి చూడగా అతడు ఉరి వేసుకొని కనిపించాడు.

12/04/2015 - 11:41

తిరుపతి: తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలను ఈ నెల 8 నుంచి 16 వరకు నిర్వహించేందుకు టిటిడి యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. 16న పంచమ తీర్థం, చక్ర స్నానంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. పుష్కరిణిలో భక్తుల స్నానాలకు అనుమతిస్తారు.

12/04/2015 - 11:40

విజయవాడ: భారీ వర్షాల కారణంగా అతలాకుతలమైన నాలుగు జిల్లాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు కలెక్టర్లు తక్షణ చర్యలు తీసుకోవాలని ఎ.పి. సి.ఎం. చంద్రబాబు ఆదేశించారు. ఆయన శుక్రవారం ఉదయం కలెక్టర్లకు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద ప్రాంతాల్లో రోడ్లు, చెరువులను పునరుద్ధరించి, రవాణా వ్యవస్థను మెరుగుపరచాలని ఆదేశించారు.

12/04/2015 - 07:49

ప్రతి టవర్‌కూ మామూళ్లు
అనంతపురంలో అధికార పార్టీ నేతలకు వరం
ఇబ్బందిపడుతున్న కంపెనీలు

Pages