ఆంధ్రప్రదేశ్‌

బాక్సైట్ తవ్వకాలపై మేధావులు స్పందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప ముఖ్యమంత్రి కెఇ
కర్నూలు, డిసెంబర్ 4: బాక్సైట్ తవ్వకాలపై మేధావులు ఆలోచించి త్వరితగతిన నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి అన్నారు. కర్నూలులో శుక్రవారం జరిగిన నీరు-ప్రగతి ముగింపు కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ దేశవ్యాప్తంగా బాక్సైట్ తవ్వకాలు జరుగుతున్నాయని వాటిలో ఒడిస్సా రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందన్నారు.. అలాంటిది మన రాష్ట్రంలో మాత్రమే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అందరి ఆమోదం మేరకే నిర్ణయం తీసుకోవాలని ఆ నిర్ణయాన్ని వాయిదా వేశామని తెలిపారు. ప్రకృతి సౌందర్యం దెబ్బతింటుందన్న కారణం మినహా మరే కారణం చూపడం లేదని విమర్శించారు. బాక్సైట్ తవ్వకాల వల్ల రాష్ట్రానికి భారీ ఎత్తున ఆదాయం వస్తుందని, తద్వారా రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. నీరు లేనిదే మానవ మనుగడ లేదన్న ప్రచారం ఎక్కువగా జరుగాల్సి ఉందని ఆయన తెలిపారు. గతంలో చంద్రబాబు ఇంకుడు గుంతల కార్యక్రమం చేపడితే ఎద్దేవా చేశారనిఐ ఆ గుంతలే నేడు భూగర్భజలాలు పెరగడానికి దోహదపడ్డాయని తెలిపారు. నదుల అనుసంధానంపై దశాబ్దాలుగా చర్చిస్తూనే ఉన్నారని అయితే చంద్రబాబు మాత్రం ఆ పనికి శ్రీకారం చుట్టి అనుసంధానం పూర్తి చేసి చూపించారని పేర్కొన్నారు.