S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం

08/24/2019 - 18:11

సీతాదేవిని అపహరించిన కారణాన కలిగిన దుఃఖం వల్ల బాధపడే రాముడిని, శోకం వల్ల తపించే రాముడిని, ప్రళయకాలాగ్ని లాగా లోకాలను సమూలంగా కాల్చివేద్దామన్న పరుష గుణం వహించిన రాముడిని, ఎక్కుపెట్టిన విల్లు నీడ చూస్తున్న రాముడిని, వేడి నిట్టూర్పులు విడుస్తున్న రాముడిని, సర్వప్రాణి సంహారం చేయడానికి విజృంభించి ప్రళయకాల రుద్రుడిలాగా వెలుగుతున్న రాముడిని, శత్రుసంహారం కొరకు తప్ప ఎప్పుడూ కోపం తెచ్చుకోని రాముడిని చూసి

08/17/2019 - 18:45

రాముడు లక్ష్మణుడితో ఇంకా ఇలా అన్నాడు. ‘ఇక్కడ జరిగిన విషయం ఆలోచించి చూస్తుంటే ఎవడో రాక్షసుడు అడవిలో నా భార్యను అపహరించినట్లు స్పష్టంగా కనిపిస్తున్నది. ఇప్పటిదాకా, సీత తనంతట తానుగా, ఎక్కడికైనా పోయిందేమోననీ, లేదా, మృగాలే భక్షించాయేమోననీ, లేదా, మాంసార్థి అయిన ఏ బక్క రాక్షసుడో హరించాడేమోనని ఎవరి మీదా నింద మోపకుండా, ఎక్కడికో పోయి వుంటుందేమో అని ఉపేక్ష చేస్తున్నాను.

08/10/2019 - 17:25

లక్ష్మణుడి మాటలకు జవాబుగా శ్రీరాముడు తమ్ముడితో, ‘లక్ష్మణా! నువ్వు గోదావరి నది దగ్గరకు వెళ్లు. అక్కడ సీతాదేవి పద్మాలు కోయడానికి వెళ్లి ఉండవచ్చు’ అని అనగానే లక్ష్మణుడు అలాగే అంటూ, గోదావరీ తీరానికి వెళ్లాడు. అక్కడ ‘ఓ సీతమ్మా! ఓ వదినమ్మా!’ అని ఎంత అరిచినా బదులు మాట వినపడలేదు. అక్కడ అంతా వెతికి సీత కనబడనందున ఆ వార్తను అన్న రామచంద్రమూర్తికి తెలిపి ఇలా అన్నాడు.

08/03/2019 - 18:31

ప్రియురాలినీ, ఆమెకు కలిగిన ఆపదనూ స్మరించడం వల్ల కలిగిన పరవశత్వంతో ప్రియ విరహం వల్ల కలిగిన శోకంతో, తనకు కలిగిన దుఃఖాన్ని తనలాగే శోకిస్తున్న తమ్ముడు లక్ష్మణుడితో రామచంద్రమూర్తి ఇలా అన్నాడు.

07/27/2019 - 18:30

వాస్తవానికి సీతాదేవి తన ఎదురుగా లేకపోయినా, మన్మథ తాపం వల్ల కళ్లకు కట్టినట్లు దగ్గరే వున్నట్లు భావించిన శ్రీరాముడు, ఆ సీతను గురించి గద్గద స్వరంతో, మాట కూడా సరిగ్గా రాకుండా, తన బాధ ఇలాంటిదని చెప్పనలవి కాకుండా, విచారంతో చాలా చాలా అన్నాడు, తనలో అనుకున్నాడు.

07/20/2019 - 18:34

ఎంతగానో కలత చెందిన మనసుకల శ్రీరామచంద్రుడు, సీతాదేవి రాక్షసుల చేతిలో చిక్కి మరణించిందేమోనని అనుమానపడతాడు. అలా కాకపోతే ఇంతలోనే ఎక్కడికి పోయి ఉంటుందని అనుకుంటాడు. ‘అయ్యో! అందమైన కమ్మలతో, చంద్రబింబం, కమలాలతో సమానమైన సీత ముఖం ఇప్పటికే ఎంత వాడిపోయిందో కదా? మనోహరమైన సంపెంగ పూవులాగా వుండే ఆమె పచ్చని దేహంతో ముత్యాల సరాలు ఆమె వొంటి మీద వేలాడుతుంటే, ఆమెను అదే పనిగా అరుస్తుంటే రాక్షసులు నరికి వేశారేమో?

07/13/2019 - 20:21

రాముడు తాను చెప్పదలచుకున్న మాటలను లక్ష్మణుడికి చెప్పి, త్వరత్వరగా ఆశ్రమం వైపు అడుగులు వేస్తుంటే, ఎడమకన్ను కింది భాగంలో అదిరింది. కాళ్లు కూలబడ్డాయి. దేహం వణకడం మొదలైంది. ఆయన తనకు కలుగుతున్న అపశకునాలకు వ్యాకులపడుతూ, ‘సీతాదేవి ఇంకా క్షేమంగా ఉన్నదా? నేనామెను చూడగలనా?’ అనుకుంటాడు. ఇలా అనుకుంటూనే తన ఆశ్రమంలో ప్రవేశిస్తాడు.

07/06/2019 - 18:31

పర్ణశాలకు వెళ్తున్న శ్రీరాముడు తనను కలవడానికి వస్తున్న తమ్ముడు లక్ష్మణుడిని దారిలో చూసి శోకంతో తపిస్తూ ఇలా అన్నాడు. ‘నువ్వు సీతను రక్షిస్తావని నమ్మి కదా సీతను ఒంటరిగా నీ స్వాధీనంలో వుంచి నేనిలా వచ్చాను? నేను కాపాడలేక నీకాపని అప్పజెప్పానా? ఆ స్ర్తిరత్నాన్ని అడవిలో ఒంటరిగా వదలిపెట్టి ఇక్కడేదో మునిగిపోయినట్లు ఆదరాబాదరాగా పరుగెత్తుకుంటూ వచ్చావు. నిన్ను చూసింది మొదలు నాకేదో భయంగా ఉంది లక్ష్మణా.

06/29/2019 - 17:45

ఇక్కడ సీతాదేవి వ్యవహారం, సంగతులు ఇలా వుంటే, అక్కడ దండకంలో రాముడి సంగతి వేరే విధంగా ఉంది. కామరూపి, మాంస భక్షకుడు, జింక రూపం ధరించిన వంచకుడు మారీచుడుని చంపిన రాముడు ఆశ్రమానికి రావాలని త్వర త్వరగా వస్తుంటే, వెనుక పక్క నక్క కూత వినిపించింది. ఇది అశుభం తెలుపుతున్నది. దీనివల్ల కీడు కలుగుతుంది, అని భావించిన రాముడు, రాక్షసులు సీతను ఎత్తుకు పోయారేమో అని అనుమానిస్తాడు.

Pages