S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం

01/29/2019 - 01:19

శ్రీరాముడి బలపరాక్రమాలను రావణుడికి చెప్పిన మారీచుడు
*
వాసుదాసు వ్యాఖ్యానం
*అరణ్యకాండ
*

01/19/2019 - 18:40

దేహాన్ని గగుర్పాటు కలిగించే భయోత్పాదకములైన శూర్పణఖ మాటలు విన్న రావణుడు, మంత్రులతో ఆలోచించి, కార్యం ఎలా చేయాలో నిర్ణయించుకొని, వాళ్లను పొమ్మని పంపి, ఎలా ముందుకు పోవాలో ఆలోచన చేశాడు.

01/12/2019 - 18:34

ఈ విధంగా సిగ్గు, బిడియం, భయం లేకుండా శూర్పణఖ చెప్పిన తన దోషాల గురించి ధనగర్వం, సేనాబల గర్వం కలవాడైనందున, ఎంత మాత్రం విచారపడక, తనను ఎవ్వడు ఏం చేయగలడన్న మదాంధుడై, తన చెల్లెలు చెప్పిన విషయం గురించి ఆలోచన చేశాడు. కోపంతో కళ్లెర్ర చేసి, తనను నిష్ఠూరాలు ఆడే చుప్పనాతితో, ‘చెల్లెలా! అక్కడి వృత్తాంతమంతా వివరంగా చెప్పు. రాముడనే ఎవడు? వాడెట్టి పరాక్రమవంతుడు? దేవతా రూపమా? మనుష్య రూపమా?

01/05/2019 - 19:12

రావణుడిని నిందిస్తూ శూర్పణఖ ఇంకా ఇలా అంది. ‘ఇంత వయసు వచ్చినా అవివేకం పోలేదు నీకు. వివేకం రాలేదు. ఏమేమి తెలుసుకోవాలో అది నీకు తెలియదు. ఇలాంటి వాడివి రాజై ఎలా బాగుపడుతావు? తనకు స్వంత వేగుల వాళ్లు లేకుండా, ఇతరులు ఏర్పాటు చేసిన వేగుల వాళ్ల మాటలు నమ్మి ప్రవర్తించేవాడు, కోశాగారానికి ఇతరులకు పెత్తనమిచ్చేవాడు, ఇతరులు చెప్పిన నీతులు అనుసరించేవాడు, వాడెంత గొప్పవాడైనా పామరుడితో సమానమే.

12/29/2018 - 17:25

పధ్నాలుగు వేల మంది క్రూరులైన రాక్షస శ్రేష్టు లు, ఖరుడు, దూషణుడు, త్రిశిరుడు- ఒంటరిగా యుద్ధం చేసిన శ్రీరాముడి చేతిలో చావడం చూసిన శూర్పణఖ- ఇతరులకు సాధ్యం కాని రాముడి పరాక్రమంగా స్వయంగా చూసి భయపడి, బొబ్బలు పెట్టుకుంటూ, ఏడ్చుకుంటూ, శీఘ్రంగా రావణుడు పాలించే లంకకు పోయింది.

12/22/2018 - 18:41

అకంపనుడు శ్రీరాముడి వధోపాయంగా సీతాపహరణం చేయమని ఇలా చెప్పాడు రావణుడితో. ‘ఓ అసురరాజా! రామచంద్రుడి భార్యైన సీత గురించి నేనేం చెప్పగలను? రాముడి గురించి వృత్తబాహుడని, వృషాంసుడని చెప్పాను కాని సీతాదేవి విషయం చెప్పడానికి నాకు సాధ్యం కాదు. అయినా చెప్పాలి కాబట్టి చెప్తాను. ఆమె అందం లాంటి అందం ముల్లోకాలలో ఎక్కడా లేదు. ఆమె నడక ఏనుగు నడకలా ఉంటుంది. నడి వయస్సులో ఉంది.

12/15/2018 - 17:25

జనస్థానం నుండి అకంపనుడనే రాక్షసుడు, రావణుడి వేగులవాడు, శీఘ్రంగా బయల్దేరి లంకకు పోయి, లంకాసురుడైన రావణాసురుడితో ఇలా అన్నాడు. ‘రాజా! జనస్థానంలో వున్న ఖరుడుతో సహా రాక్షసులందరూ యుద్ధంలో చంపబడాడరు. నేనెలాగో స్ర్తి వేషం వేసుకుని అతి కష్టం మీద ప్రాణాలను దక్కించుకుని ఈ వృత్తాంతాన్ని నీకు చెప్పడానికి వచ్చాను’. ఈ మాటలు విన్న రావణుడు అదిరిపడి, కళ్లల్లో నిప్పులు కురుస్తుంటే, ‘ఓరీ!

12/08/2018 - 18:19

ఇలా తనను నిష్ఠూరాలు ఆడుతున్న రామభద్రుడిని చూసి, అవి తన మేలు కొరకై చెప్పబడుతున్న మాటలని తెలుసుకోలేని ఆ ఖరుడు, ఇవన్నీ యుద్ధంలో సాధారణంగా చెప్పే బెదిరింపు మాటలని భావించి, కోపంతో కళ్లు ఎర్రచేసి నవ్వుతూ ఇలా అన్నాడు.

12/01/2018 - 18:45

యుద్ధంలో దూషణుడు, త్రిశిరుడు చావడం చూసి ఖరుడు తన గుండె ఝల్లుమనగా ఇలా అనుకున్నాడు. ‘ఆహా! ఇదేమి విక్రమం? ఔరా! ప్రసిద్ధికెక్కిన బలశాలులను పధ్నాలుగు వేల మందిని, దూషణుడిని, త్రిశిరుడుని ఒక్కడిని కూడా వదలకుండా ఒంటరిగానే రాముడు చంపాడు. ఏమి భయంకర బలం? నేనొక్కడినీ వీడికి లక్ష్యమా? అయినా కానిమ్ము.

11/24/2018 - 18:33

ఐదు వేల మంది కఠిన దేహాలు, మనస్సు కల రాక్షసులను రామభద్రుడిని చంపడానికి పంపాడు దూషణుడు. వాళ్లు వజ్ర సమానమైన శూలాలను, ఖడ్గాలను, బాణాలను వర్షంలాగా కురిపిస్తూ రాముడి మీదకు వస్తుంటే, ఆయన పరాక్రమించి తన బాణాలతో వారి ఆయుధాలన్నింటినీ ఖండించాడు. దూషణుడితో సహా సైన్యాన్నంతా దుఃఖ దశకు తీసుకొచ్చాడు. బాణ వర్షంతో వారందరినీ స్నానం చేయించాడు రాముడు.

Pages