S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

01/05/2016 - 06:10

వరంగల్, జనవరి 4: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1800 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు, ఇతర అభివృద్ధి పనులకు రూ.41వేల కోట్లు వెచ్చించనున్నట్టు కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. సోమవారం వరంగల్ నగరం మడికొండ వద్ద యాదగిరిగుట్ట నుంచి వరంగల్ ఆరెపల్లి వరకు 1905 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నాలుగు లైన్ల జాతీయ రహదారి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.

01/05/2016 - 06:07

హైదరాబాద్, జనవరి 4: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు తెరాసకు మాత్రమే కాదు, వారసుడు కెటిఆర్‌కూ పెద్ద పరీక్ష. గ్రేటర్ ఎన్నికల్లో అంతా తానై కెటిఆర్ ఇప్పటికే నగరం నలుమూలలా చుట్టివచ్చారు. శంకుస్థాపనలు, కాలనీవాసులతో సమావేశాలు, పార్కుల్లో మీటింగ్‌లు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల శంకుస్థాపనలు అదీఇదని కాకుండా మూడువారాల్లో హైదరాబాద్‌ను చుట్టేశారు.

01/05/2016 - 06:12

హైదరాబాద్, జనవరి 4: ప్రస్తుత ఆర్థిక బడ్జెట్‌లో నీటిపారుదల ప్రాజెక్టులకు కేటాయించబోయే రూ.25 వేల కోట్లలో ప్రతీ నెలా రూ. 2,083 కోట్లు విడుదల చేస్తామని, దానికి అనుగుణంగా పనులు జరగాలని సిఎం కె చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. కృష్ణా, గోదావరి నదులపై తలపెట్టిన ప్రాజెక్టుల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించాలన్నారు.

01/05/2016 - 06:02

హైదరాబాద్, జనవరి 4: జిహెచ్‌ఎంసి పాలక మండలి ఎన్నికలను హైకోర్టు విధించిన గడువులోపే పూర్తి చేస్తామని సిఎం కెసిఆర్ ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర మున్సిపల్ వ్యవహరాల శాఖ ఎన్నికల ప్రక్రియ తతంగాన్ని కుదించింది. సాధారణంగా ఎన్నికలంటే నామినేషన్లు దాఖలు చేసిన నాటినుంచి పోలింగ్‌కు 45 రోజుల వ్యవధి ఉంటుంది.

01/05/2016 - 06:00

హైదరాబాద్, జనవరి 4: రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం ప్రోత్సాహానికి ప్రస్తుత కఠిన నిబంధనలను సరళీకృతం చేయడంతోపాటు, బిల్డర్లకు అనేక రాయితీలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నగరాలు, పట్టణాభివృద్థి సంస్థల పరిధిలో భవన నిర్మాణాల నిబంధనలను సరళీకృతం చేస్తూ మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫారసులను సిఎం కె చంద్రశేఖర్‌రావు సోమవారం ఆమోదించారు.

01/04/2016 - 17:02

మెదక్ : దౌల్తాబాద్‌లోని శంభుదేవుని గుట్టపై మంటలు చెలరేగాయి.ఈ ఆలయానికి ఆనుకుని వంద ఎకరాల్లో అటవీ ప్రాంతం విస్తరించింది. ఈ మంటలు అటవీ ప్రాంతానికి సైతం విస్తరించాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేస్తున్నాయి.

01/04/2016 - 16:58

ఖమ్మం: జిల్లాలోని ఆర్టీవో కార్యాలయంపై ఏజెంట్ల బాధితుల ఫిర్యాదుతో సోమవారం మధ్యాహ్నం ఏసీబీ దాడులు నిర్వహించింది. డీఎస్పీ సాయిబాబా ఆధ్వర్యంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఆర్టీవో అధికారి సహా 16 మంది ఆర్టీవో ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నట్టు ఏసీబీ వెల్లడించింది.

01/04/2016 - 12:07

హైదరాబాద్: టాస్క్ఫోర్స్ పోలీసుల పేరిట వసూళ్లకు పాల్పడుతున్న కానిస్టేబుల్ గణేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు హయత్‌నగర్ పోలీసుస్టేషన్‌లో పనిచేస్తూ వాహనదారులు, ఇతరుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలొచ్చాయి.

01/04/2016 - 12:06

హైదరాబాద్: నగరంలోని సీతారాంబాగ్‌లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించటం సంచలనం సృష్టించింది. ఇద్దరు కవల పిల్లలను హత్యచేసి, దంపతులు రాధిక, రాజు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇనుము తుక్కు వ్యాపారం చేస్తున్న రాజు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

01/04/2016 - 12:05

హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు తెలుగుదేశం పార్టీ వ్యూహ రచన చేస్తోంది. ఈ నెల 7న నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో భారీఎత్తున బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించినట్లు గ్రేటర్ టిడిపి అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ తెలిపారు. మిత్రపక్షంగా ఉన్న బిజెపి నేతలు కూడా ఈ సభలో పాల్గొంటారు.

Pages