తెలంగాణ

వారసుడికి గ్రేటర్ పరీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 4: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు తెరాసకు మాత్రమే కాదు, వారసుడు కెటిఆర్‌కూ పెద్ద పరీక్ష. గ్రేటర్ ఎన్నికల్లో అంతా తానై కెటిఆర్ ఇప్పటికే నగరం నలుమూలలా చుట్టివచ్చారు. శంకుస్థాపనలు, కాలనీవాసులతో సమావేశాలు, పార్కుల్లో మీటింగ్‌లు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల శంకుస్థాపనలు అదీఇదని కాకుండా మూడువారాల్లో హైదరాబాద్‌ను చుట్టేశారు. ఉప ఎన్నికల్లో మంత్రులకు బాధ్యతలు అప్పగించడం కొత్తకాదు. ఎన్నికల బాధ్యతలు నిర్వహించడమూ కొత్తేమీకాదు. మెదక్ పార్లమెంటు నియోజకవర్గం ఉప ఎన్నిక, వరంగల్ ఉప ఎన్నికలు, సికిందరాబాద్ కంటోనె్మంట్ ఉప ఎన్నికలు, గ్రాడ్యుయేట్ నియోజకవర్గ శాసన మండలి ఎన్నికల్లో మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. ఈ ఎన్నికల్లో మిగిలిన మంత్రులతో పాటు కెటిఆర్ సైతం విస్తృతంగా ప్రచారం చేశారు. ఇక త్వరలో జరిగే నారాయణఖేడ్ ఉప ఎన్నికల బాధ్యత తన్నీరు హరీశ్‌రావుకు అప్పగించారు. మంత్రులందరూ మంగళవారం నుంచి గ్రేటర్ పరిధిలో తమకు అప్పగించిన డివిజన్ల బాధ్యతలు చేపడుతున్నారు. అయితే మొత్తం గ్రేటర్‌లో మాత్రం కెటిఆర్ సుడిగాలిలా పర్యటిస్తూ మూడువారాలుగా ప్రచారం సాగిస్తున్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా అభివృద్ధి చేసేందుకు చేపట్టిన ప్రాజెక్టులోని తొలి శంకుస్థాపనలు సైతం కెటిఆర్ చేశారు. హైదరాబాద్‌లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బహుళస్థాయి ఆకాశ మార్గాల నిర్మాణానికి కెటిఆర్ శంకుస్థాపన చేశారు. సాధారణ ప్రజలతో వారికి అర్థమయ్యే విధంగా, ఐటి ఉద్యోగులతో వారికినచ్చేలా, చివరకు పాతబస్తీలో ఉర్దూలో ఉపన్యాసమిస్తూ వారిలో కలిసి పోయారు. వారసత్వం అనే విమర్శలు ఉన్నా, తెరాసకు బలం చేకూర్చేలా తమ సామర్ధ్యంతో నెల రోజుల్లోనే కెటిఆర్ హైదరాబాద్‌లో తెరాసకు స్టార్ క్యాంపైనర్‌గా నిలిచారు. ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు? నిర్వహిస్తారా? లేదా అనే విమర్శలు సాగుతుండగానే కెటిఆర్ మాత్రం ఇప్పటికే ఒకసారి నగరాన్ని చుట్టివచ్చారు. దీంతో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కెటిఆర్ ప్రధానాంశమే అయ్యారు.
మంత్రులందరికీ సిఎం కెసిఆర్ గ్రేటర్‌లో బాధ్యతలు అప్పగిస్తూనే ఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి నెలముందే కెటిఆర్‌కు హైదరాబాద్‌లో ప్రచార బాధ్యత అప్పగించారు. వారసునిగా నిలదొక్కుకునేందుకు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు కెటిఆర్‌కు ఒక పరీక్షలాంటివి. పలు సర్వేల్లో తెరాసకు గ్రేటర్‌లో 80నుంచి 85 సీట్లు వస్తాయని తేలినట్టు సిఎం తెలిపారు. గ్రేటర్‌లో ఎవరు అధికారంలోకి వచ్చినా ఎంఐఎంతో సన్నిహితంగా ఉండటం అవసరం. హైదరాబాద్‌లో ఎంఐఎం ప్రాధాన్యత గుర్తించి తెరాస మొదటి నుంచి వారితో సానుకూలంగానే ఉంటోంది. తొలుత మంత్రివర్గంలో చేరాలని ఎంఐఎం కార్యాలయానికి వెళ్లి కెటిఆర్ అసదుద్దీన్‌తో చర్చలు సైతం జరిపారు. అయితే పార్టీ విధానాల ప్రకారం మంత్రివర్గంలో చేరడం లేదని ప్రకటించారు. కెటిఆర్ అప్పటి నుంచీ ఎంఐఎంతో స్నేహపూర్వకంగానే ఉంటూ రాజకీయ చతురత ప్రదర్శించారు. ఈ పరిస్థితుల్లో గ్రేటర్‌లో బలంగా నిలబడటం తెరాసకు పరీక్ష అయితే, కెసిఆర్ వారసునిగా ఈ ఎన్నికలు కెటిఆర్‌కూ పెద్ద పరీక్షే.
చిత్రం... పాతబస్తీలోకి ఓ స్టేడియం ప్రారంభోత్సవ కార్యక్రమంలో
సరదాగా బ్యాటింగ్ చేస్తున్న కెటిఆర్