S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

01/02/2016 - 06:49

హైదరాబాద్/ఖైరతాబాద్, జనవరి 1: అరుదైన వ్యాధితో బాధపడుతూ నిమ్స్‌లో చికిత్స పొందుతున్న 14 ఏళ్ల సంతోష్ అనే విద్యార్థిని మంత్రి కెటిఆర్ కలుసుకుని కాసేపు ముచ్చటించారు. ‘నిర్భయంగా ఉండు..నేనున్నా’నంటూ అతనికి ధైర్యం చెప్పారు. ఖమ్మం జిల్లా కృష్ణారావు, జ్యోతిల కుమారుడు సంతోష్ (14) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పదవతరగతి చదువుతున్నాడు.

01/02/2016 - 06:47

హైదరాబాద్, చార్మినార్, జనవరి 1: పేద, మధ్య తరగతికి చెందిన యువతులకు ఉన్నత విద్యనందించేందుకు ప్రతి ఏటా నిర్వహిస్తున్న అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్)ను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు శుక్రవారం సాయంత్రం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో లాంఛనంగా ప్రారంభించారు.

01/02/2016 - 06:24

హైదరాబాద్, జనవరి 1: ‘రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అందజేసిన సహాయం ఇప్పటికే లక్ష కోట్ల రూపాయలు దాటినట్లు చూపిస్తే, రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉంటారా?..’ అని బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి, కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ రాష్ట్ర మంత్రి కె. తారక రామారావుకు సవాల్ విసిరారు.

01/02/2016 - 06:22

హైదరాబాద్, జనవరి 1: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) ఎన్నికలకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టి.పిసిసి) సమాయత్తమవుతోంది. స్థానిక సంస్ధల కోటా నుంచి ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో రెండు స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.

01/02/2016 - 06:20

ఆంధ్రభూమి బ్యూరో

01/02/2016 - 06:16

హైదరాబాద్, జనవరి 1: ఓట్ల కోసమే ఆంధ్ర సోదరులంటూ తెలంగాణ రాష్ట్ర మంత్రులు మాట్లాడుతున్నారని తెలంగాణ తెలుగు దేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. గతంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆంధ్ర వారిపై ద్వేషభావం ప్రదర్శించారని ఆయన శుక్రవారం విలేఖరుల సమావేశంలో అన్నారు. ఆంధ్ర వంకతో బిసి జాబితానుంచి తొలగించిన 26 కులాలను తిరిగి జాబితాలో చేరుస్తారా? అని ఆయన ప్రశ్నించారు.

01/02/2016 - 02:37

హైదరాబాద్, జనవరి 1: ఈ ఖరీప్ సీజన్‌నుంచి వ్యవసాయానికి పగటిపూట తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా చేయడంతోపాటు ఇతర వర్గాలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయనున్నట్టు సిఎం కె చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. నూతన సంవత్సరం మొదటిరోజు, మొదటి సమీక్షను ముఖ్యమంత్రి విద్యుత్‌పై నిర్వహించారు.

01/02/2016 - 02:30

హైదరాబాద్, జనవరి 1: తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ జారీ చేసిన నోటిఫికేషన్‌కు స్పందనగా గ్రూప్-2 పోస్టులకు తొలిరోజే ప్రభంజనంలా దరఖాస్తులు వచ్చాయి. 439 గ్రూప్-2 పోస్టులతోపాటు మరో మూడు ఇతర కేటగిరి పోస్టులకు కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది.

01/02/2016 - 02:43

హైదరాబాద్, జనవరి 1: కాగితాలపై ప్రతిపాదనల స్థాయినుంచి అనేక రకాలైన ఒడిదుడుకులు ఎదుర్కొన్న హైదరాబాద్ మెట్రో రైలు ఎట్టకేలకు నగరవాసులకు ఈ ఏడాదిలోనే అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

01/01/2016 - 15:51

నేరేడుచర్ల: నల్లగొండ జిల్లా నేరేడుచర్ల మండలం కోమటికుంట గ్రామంలో అప్పుడే పుట్టిన ఆడశిశువును గుర్తుతెలియని వ్యక్తులు గ్రామ శివారులోని పంటపొలాల్లో వదిలి వెళ్లారు. శుక్రవారం ఉదయం ఇది గుర్తించిన స్థానిక రైతులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ శిశువును ఆస్పత్రికి తరలించారు. కాగా.. అప్పటికే శిశువు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

Pages