S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

01/02/2016 - 11:57

హైదరాబాద్: పంజాబ్‌లో వైమానిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి జరిపిన నేపథ్యంలో ఇక్కడి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ప్రయాణీకులను క్షుణ్ణంగా తనిఖీ చేశాకే, అనుమతిస్తున్నారు.

01/02/2016 - 11:54

హైదరాబాద్: సుదీర్ఘ విరామం అనంతరం తెలంగాణ మంత్రిమండలి సిఎం కెసిఆర్ అధ్యక్షతన శనివారం ఉదయం సచివాలయంలో భేటీ అయ్యింది. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన కేబినెట్ సమావేశం రాత్రి వరకు జరుగుతుంది. గ్రేటర్ ఎన్నికలు, నీటిపారుదల ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ వంటి పలు విషయాలపై ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

01/02/2016 - 07:29

మహబూబ్‌నగర్, జనవరి 1: మహబూబ్‌నగర్ జిల్లాలో కృష్ణా పుష్కరాలకు సంబంధించిన ఏర్పాట్లపై ప్రభుత్వం ఇప్పటి నుండే కసరత్తులు మొదలుపెట్టింది. ఈ ఏడాది ఆగస్టులో జరుగనున్న కృష్ణా పుష్కరాలకు భక్తుల సౌకర్యార్థం ఘాట్ల ఏర్పాట్లపై ఉన్నటువంటి ఘాట్లను మరమ్మతులు చేసేందుకు సంబంధిత అధికారులు నిధుల కోసమై రాష్ట్ర ప్రభుత్వానికి అంచనాలతో కూడిన ప్రతిపాదనలు పంపారు.

01/02/2016 - 07:26

హైదరాబాద్, జనవరి 1:నూతన సంవత్సరం సందర్భంగా పలువురు ప్రముఖులు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును శుక్రవారం క్యాంపు కార్యాలయంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

01/02/2016 - 07:26

హైదరాబాద్, జనవరి 2: తెలంగాణలో పర్యటించాలని ప్రధానమంత్రిని ఎన్నిసార్లు కోరినా రావడం లేదని ఐటి శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. ప్రధానమంత్రి తెలంగాణకు ఏమిచ్చారో ప్రశ్నించాలని ప్రజలను కోరుతున్నట్టు చెప్పారు. ఇప్పటికి ఆయనను మూడుసార్లు ఆహ్వానించామని, కొత్తరాష్ట్రానికి రావలసిన బాధ్యత ఆయనపై ఉందని ఆయన అన్నారు. ప్రధానిని ఆహ్వానించలేదంటూ బిజెపి నాయకులు చేస్తున్న విమర్శలపై ఆయన స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

01/02/2016 - 07:25

సిద్దిపేట, జనవరి 1: కొత్త సంవత్సరంలో కొత్త ఒరవడికి అడుగులు వే ద్దామని..ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఎవ్వరూ నేలపై కూర్చోవద్దని.. ప్రతి పాఠశాలకూ డ్యూయల్ డెస్క్‌లు పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. రూ.1.50 కోట్లతో సిద్దిపేట ని యోజకవర్గంలో అన్ని పాఠశాలలకు డ్యూయల్ డెస్క్‌ల పంపిణీ కార్యక్రమానికి కొత్తసంవత్సరంలో శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.

01/02/2016 - 07:24

హైదరాబాద్, జనవరి 1: పెరిగిన జనాభా ప్రకారం గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని గిరిజన సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.

01/02/2016 - 07:24

హైదరాబాద్, జనవరి 1: తెలంగాణ ఆర్టీసిలో పని చేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 3న రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్లు టిఎస్‌ఆర్టీసి కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల యూనియన్ సన్నాహక కమిటీ సభ్యుడు విఎస్ బోస్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి డిపోలో 50 మంది వరకు కాంట్రాక్ట్ వర్కర్స్ ఉన్నారని, వీరంతా కూడా ఎలాంటి సెక్యూరిటీ లేకుండా పని చేస్తున్నారని అన్నారు.

01/02/2016 - 07:23

హైదరాబాద్, జనవరి 1:గ్రేటర్ హైదరాబాద్‌లో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ప్రధాన రాజకీయ పక్షాలు విస్తృతంగా సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ఒకవైపు టిఆర్‌ఎస్ వరుస సమావేశాలు నిర్వహిస్తూ ప్రజలకు చేరువ అవుతుండగా, అదే సమయంలో గ్రేటర్ వాసులపై ప్రభుత్వం వరాలు కురిపిస్తోంది.

01/02/2016 - 07:13

భద్రాచలం, జనవరి 1: నూతన సంవత్సరం ప్రారంభం వేళ శుక్రవారం ఖమ్మం జిల్లా భద్రాచల శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం భక్తులతో పోటెత్తింది. గోదావరి నుంచి తీర్థబిందెను తెచ్చి దేవస్థానం అర్చకులు మూలవరులకు అభిషేకం చేశారు. ఉత్సవమూర్తులను సుందరంగా అలంకరించి బేలమండపానికి తీసుకొచ్చారు. అక్కడ స్వామికి విశేషమైన పూజలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకున్నారు. స్వామికి బాలభోగం నివేదించారు.

Pages