S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

01/07/2016 - 05:35

నల్లగొండ, జనవరి 6: రాష్ట్రంలో సంచలనం రేపిన కిడ్నీ విక్రయాల దందా వ్యవహారంలో నల్లగొండ జిల్లా పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ ప్రకటించారు.

01/07/2016 - 05:31

హైదరాబాద్, జనవరి 6: దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజన్లలో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులపై రైల్వే శాఖ, రైల్వే బోర్డు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎంపిలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గత ఏడాది చేసిన ప్రతిపాదనల్లో ఏ ఒక్కటీ కూడా అమలు కాలేదని, తెలంగాణ ప్రాంత రైల్వే ప్రాజెక్టుల నిర్లక్ష్యానికి గురవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

01/07/2016 - 05:29

హైదరాబాద్, జనవరి 6: అమెరికాలోని పలు యూనివర్శిటీల్లో చదువుకునేందుకు వెళ్లిన మరో 15మంది తెలుగు విద్యార్థులను ఇమిగ్రేషన్ అధికారులు వెనక్కి పంపించారు. బుధవారం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న విద్యార్థులు అమెరికాలో తెలుగు విద్యార్థులు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

01/07/2016 - 05:28

వరంగల్, జనవరి 6: దేశంలోనే అతి పెద్ద మల్టిపుల్ టెక్స్‌టైల్ పార్క్‌ను త్వరలో వరంగల్‌లో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్టు సిఎం కె చంద్రశేఖర్ రావు వెల్లడించారు. మూడోరోజూ వరంగల్‌లో పర్యటించిన కెసిఆర్ నగరాభివృద్ధికి వరాలు కురిపించారు. వరంగల్ సర్వతోముఖాభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించనున్నట్టు చెప్పారు. మూడు రోజుల పర్యటన అనంతరం బుధవారం నందన గార్డెన్‌లో మీడియాతో మాట్లాడారు.

01/06/2016 - 15:18

వరంగల్ : వరంగల్ అభివృద్ధి కోసం స్పెషల్ అథారిటీ డెవలప్‌మెంట్ ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. జిల్లా అభివృద్ధిపై సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి చందులాల్, జిల్లా పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

01/06/2016 - 13:40

వరంగల్‌ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ వరంగల్‌ పర్యటన మూడో రోజు బిజీబిజీగా సాగుతోంది. హన్మకొండలోని కలెక్టరేట్‌లో స్వయం సహాయక సంఘాల సభ్యులకి చెక్కులు పంపిణీ చేశారు. అంతకు ముందు మాజీ మంత్రి కెప్టెన్‌ లక్ష్మీకాంతారావు నివాసం వద్ద వికలాంగ బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. నగర అభివృద్ధిపై అధికారులతో సమావేశం నిర్వహించారు.

01/06/2016 - 11:43

కరీంనగర్: సింగరేణి బొగ్గు గనుల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోఅలను మోసగించిన ముగ్గురిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. సుమారు 60 మంది నిరుద్యోగుల నుంచి వీరు భారీగా డబ్బు వసూలు చేశారు. నిందితుల నుంచి 2 లక్షల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

01/06/2016 - 08:08

భువనగిరి, జనవరి 5: బంగారం నాణ్యతను పరిశీలించాల్సిన బ్యాంకు అప్రైజరే బినామి పేర్లతో నకిలీ బంగారాన్ని కుదువబెట్టి గోల్డ్‌లోన్ల పేరిట సుమారు 70లక్షలు డ్రా చేసిన సంఘటన మంగళవారం వెలుగుచూసింది. నల్లగొండ జిల్లాలోని కెనరాబ్యాంకు భువనగిరి, కొండమడుగు, యాదగిరిగుట్ట, కూనూరు గ్రామశాఖలలో ఖాతాదారుల బంగారం నాణ్యతను పరీక్షించేందుకు టి.గిరిధరాచారి ఒక్కరే అప్రైజర్‌గా కొనసాగుతున్నాడు.

01/06/2016 - 08:07

హైదరాబాద్, జనవరి 5: ఉన్నత విద్య కోసం హైదరాబాద్ నుంచి అమెరికా వెడుతున్న విద్యార్థులను అమెరికాలో వేధిస్తున్నారని, వెనక్కు పంపిస్తున్నారని, విద్యార్థుల పట్ల ఇలా వ్యవహరించడం సరికాదని ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు బేగంపేటలోని అమెరికా రాయబార కార్యాలయంలో ఆ దేశ ప్రతినిధి మైకేల్ మల్లిన్స్‌ను కలిసి వివరించారు.

01/06/2016 - 08:07

హైదరాబాద్, జనవరి 5: దేశంలో ఎక్కడైనా 14 రోజుల ఎన్నికల ప్రక్రియ ఉంటుందా? అని టిటిడిపి ఎమ్మెల్యే కెపి వివేకానందగౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో పట్టులేని తెలంగాణ రాష్ట్ర సమితి అడ్డదారిలోనైనా, దొడ్డి దారిలోనైనా గ్రేటర్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలన్న ఆలోచనతో అప్రజాస్వామిక విధానాలకు పాల్పడుతున్నదని ఆయన మంగళవారం విలేఖరుల సమావేశంలో విమర్శించారు.

Pages