S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

02/19/2016 - 16:38

నల్గొండ: సూర్యాపేటలోని ఖమ్మం క్రాస్‌రోడ్స్ వద్ద పోలీసులు శుక్రవారం తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ నుంచి కారులో వస్తున్న ఇద్దరు అనుమానితులను అరెస్టు చేసి, వారి నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

02/19/2016 - 16:37

హైదరాబాద్: పోలీసు శాఖలో మరో 332 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. పోలీసు శాఖలోని కమ్యూనికేషన్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేస్తారు. ఈ నెల 25 నుంచి మార్చి 15 వరకూ అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.

02/19/2016 - 16:36

హైదరాబాద్: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణ అసెంబ్లీలో ఇపుడున్న 119 నియోజకవర్గాలను 153కి పెంచాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ కేంద్ర హోం శాఖ కార్యదర్శికి లేఖ రాశారు.

02/19/2016 - 13:00

సికిందరాబాద్: సికిందరాబాద్‌లోని ప్రభుత్వ గాంధీ ఆస్పత్రిలో శుక్రవారం ఉదయం తెలుగురాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఆకస్మిక తనిఖీలు జరిపారు. వైద్యసేవలు, పరిశుభ్రత, వైద్యుల పనితీరు వంటి విషయాలపై ఆయన రోగులను ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు.

02/19/2016 - 12:07

నల్గొండ: ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో పి.జి. విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన నల్గొండ జిల్లా చిలుకూరులో శుక్రవారం జరిగిది. ప్రియుడు మోసం చేసినందువల్లే విద్యార్థిని లక్ష్మి ఆత్మహత్య చేసుకుందని ఆమె బంధువులు ఆందోళనకు దిగారు.

02/19/2016 - 12:07

హైదరాబాద్: జెఎన్‌యు విద్యార్థి కన్నయ్యను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ వామపక్ష పార్టీకి చెందిన విద్యార్థి సంఘాలు రాజ్‌భవన్ ముట్టడికి పిలుపు నివ్వడంతో శుక్రవారం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజ్‌భవన్ పరిసరాల్లో ఎవరినీ అనుమతించకుండా కట్టడి చేశారు.

02/19/2016 - 12:03

హైదరాబాద్: సికిందరాబాద్ సమీపంలోని బోయిన్‌పల్లిలో చింతల నరసింహం అనే చేపల వ్యాపారిని గుర్తు తెలియని వ్యక్తులు గురువారం రాత్రి బండరాయితో తలపై మోది హత్య చేశారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

02/19/2016 - 12:02

హైదరాబాద్: నగరంలోని ఎ.పి. సచివాలయంలోని ‘ఎల్’బ్లాక్ రెండో అంతస్థులో శుక్రవారం ఉదయం స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌వల్లే మంటలు వ్యాపించాయని తెలుస్తోంది. సమాచారం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలను అదుపు చేశారు. వికలాంగ సంక్షేమ శాఖ కార్యాలయంలో ఈ ఘటన జరిగింది.

02/19/2016 - 12:01

వరంగల్: సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ, ఆయన సతీమణి శుక్రవారం ఉదయం మేడారం జాతరలో సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లను దర్శించుకొని పూజలు చేశారు. తెలంగాణ సంస్కృతికి మేడారం జాతర నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుందని బాలయ్య అన్నారు.

02/19/2016 - 07:48

మేడారం: పున్నమి వెనె్నల్లో చందమామ తోడురాగా సమ్మక్కతల్లి చిలకలగుట్ట నుండి గద్దెలకు చేరింది. రెండేళ్లకోసారి జరిగే మేడారం సమ్మక్క - సారలమ్మ జాతరలో ఇదొక అపురూప ఘట్టం కాగా గుట్ట నుండి గద్దెకు చేరే వరకు ఆ అపురూప క్షణాలు భక్తజనకోటికి మరుపురాని, మరచిపోలేని సన్నివేశాలు. చిలకలగుట్ట నుండి మేడారం గద్దెపైకి సమ్మక్కతల్లి అరుదెంచిన అపురూప సన్నివేశం భక్తులను తన్మయత్వానికి గురిచేసింది.

Pages