S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/19/2015 - 14:02

హైదరాబాద్: నగరంలో శాంతిభద్రతల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ఇవాళ ఆయన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన 77 కమ్యూనిటీ సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరవ్యాప్తంగా 10 వేల సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.

12/19/2015 - 13:07

హైదరాబాద్‌: వైకాపా ఎమ్మెల్యే రోజాపై ఏడాదిపాటు సస్పెన్షన్‌ వేటు వేయడం బాధాకరమని భాజపా సభ్యుడు విష్ణుకుమార్‌ రాజు అన్నారు. ఏపీ శాసనసభలో విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ... సస్పెన్షన్‌ను ఈ సమావేశాల వరకే పరిమితం చేస్తే బాగుంటుందని సభాపతికి విజ్ఞప్తి చేశారు. అధికార పార్టీ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే సభలో ప్రతిపక్ష సభ్యులు ఉండే అవకాశమే లేదన్నారు.

12/19/2015 - 13:06

హైదరాబాద్: దేశ సమస్యలు పరిష్కరించేలా యువత కొత్త పరిశోధనలు చేయాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కోరారు. సికింద్రాబాద్‌లోని మిలిటరీ కాలేజీ 88వ స్నాతకోత్సవాన్ని నిర్వహించారు. ఈ స్నాతకొత్సవానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, గవర్నర్ నరసింహన్‌తోపాటు ఇతర ప్రముఖులు హాజరయ్యారు. మెరిట్ సాధించిన విద్యార్థులకు మెడల్స్ ప్రదానం చేశారు.

12/19/2015 - 13:03

హైదరాబాద్: ఏపీ అసెంబ్లీ భవనం ప్రాంగణంలోకి వచ్చిన వైసీపీ ఎమ్మెల్యే రోజా సెల్వమణిని అసెంబ్లీ మార్షల్స్ గెంటివేశారు. నిన్నటి అసెంబ్లీ సమావేశాల్లో సీఎం చంద్రబాబును కించపరుస్తూ మాట్లాడరనే ఆరోపణలపై స్పీకర్ ఆమెను ఏడాదిపాటు సస్పెండ్ చేస్తూ ఆదేశించారు. ఈమేరకు ఇవాళ ఆమె అసెంబ్లీకి రావడంతో మార్షల్స్ అడ్డుకున్నారు. మార్షల్స్‌తో రోజా వాగ్వాదానికి దిగారు.

12/19/2015 - 13:03

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో ప్రభుత్వం ఇవాళ 5బిల్లులు ప్రవేశపెట్టింది. మౌలిక సదుపాయల అభివృద్ధి సవరణ బిల్లు, విద్యుత్‌ సుంకం బిల్లు, నౌకాశ్రయాల అభివృద్ధిపై మ్యారీటైమ్‌ బోర్డు బిల్లు, విలువ ఆధారిత పన్ను, విదేశీ మద్యం సవరణ బిల్లులను ప్రభుత్వం స్పీకర్‌ అనుమతితో సభలో ప్రవేశ పెట్టింది. వైకాపా సభ్యుల నినాదాల మధ్యే మంత్రులు ఆయా బిల్లులను సభలో ప్రవేశపెట్టారు.

12/19/2015 - 13:02

హైదరాబాద్ : నేడు రాష్ర్ట వ్యాప్తంగా కేబుల్ టివి కనెక్షన్ నిలిపివేయనున్నట్లు తెలంగాణ ఎంఎస్‌ఒల, అపరేటర్ల జెఎసి ప్రకటించింది. కార్పొరేట్ టివి మీడియా అరాచకాలకు నిరసనగా కేబుల్ టివి ప్రసారాలు నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. 19న సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రసారాలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు.

12/19/2015 - 13:01

గుంటూరు : మూడేళ్లలో మంగళగిరిలో ఎయిమ్స్‌ నిర్మాణం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి జేపీ.నడ్డా తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఎయిమ్స్‌ నిర్మాణానికి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి నడ్డా ప్రసంగించారు. 193 ఎకరాల విస్తీర్ణంలో రూ.1,618 కోట్ల పెట్టుబడితో ఎయిమ్స్‌ నిర్మిస్తామని చెప్పారు.

12/19/2015 - 12:55

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సోమవారానికి వాయిదా పడింది. శనివారం ఉదయం సభ ప్రారంభమైనప్పటి నుంచి వైసిపి ఎమ్మెల్యే ఆర్.కె.రోజా సస్పెన్షన్‌ అంశంపై గందరగోళం కొనసాగింది. దానికితోడు రోజును అసెంబ్లీ ప్రాంగణంలో పోలీసులు అటకాయించడంతో జరిగిన ఘటనలో రోజా కిందపడి గాయపడ్డారు. దాంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కూడా వైసిపి సభ్యులు సభలో తీవ్ర ఆందోళన చేశారు.

12/19/2015 - 07:13

భద్రాచలం, డిసెంబర్ 18: ఖమ్మం జిల్లా భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా శ్రీ సీతారామచంద్రస్వామి శుక్రవారం బలరామావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
గర్భగుడిలో పూజలు నిర్వహించిన అనంతరం స్వామివారిని మేళతాళాలు, మంగళవాయిద్యాలు, కోలాటాల నడుమ ఊరేగింపుగా కల్యాణ మండపం వద్దకు తీసుకొచ్చారు. కల్యాణ మండప వేదిక వద్ద భక్తులకు స్వామివారి దర్శనభాగ్యం కల్పించారు.

12/19/2015 - 07:11

విశాఖపట్నం, డిసెంబర్ 18: విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ ఉద్యమానికి తమ మద్దతు ఉంటుందని విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. విశాఖ ఏజెన్సీలోని ముంచింగిపుట్, పెదబయలు మండలాల్లో స్వరూపానందేంద్ర శుక్రవారం పర్యటించి, అక్కడి గిరిజనులకు దుప్పట్లు, దుస్తులు పంపిణీ చేసి, వారితో మాట్లాడారు. పురాణ పురుషులైన రాముడు, హనుమంతుడు వంటి వారు సంచరించిన ప్రదేశాలు ఈ అటవీ ప్రాంతాలు అని అన్నారు.

Pages