S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/16/2015 - 08:27

సూళ్లూరుపేట, డిసెంబర్ 15: పోలార్ శాటిలైట్ వాహక నౌక (పిఎస్‌ఎల్‌వి) ద్వారా ఒకేసారి ఆరు సింగపూర్ దేశానికి చెందిన విదేశీ ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) గురిపెట్టింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్‌థావన్ స్పేస్ సెంటర్‌నుండి బుధవారం సాయంత్రం 6 గంటలకు పిఎస్‌ఎల్‌వి-సి 29 రాకెట్ ప్రయోగం జరగనుంది.

12/16/2015 - 08:24

హైదరాబాద్, డిసెంబర్ 15: ఆంధ్రలో విజయవాడ సహా పలు నగరాల్లో విస్తరించిన కాల్‌మనీ సెక్స్ రాకెట్‌పై నిష్పాక్షికంగా న్యాయ విచారణ జరిపించి దోషులను శిక్షించాలని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్‌ను కోరారు. మంగళవారం వైకాపా ఎమ్మెల్యేలతో కలిసి గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌ను రాజ్‌భవన్‌లో కలిశారు.

12/16/2015 - 05:59

విజయవాడ, డిసెంబర్ 15:కాల్‌మనీ కేసులో మంగళవారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. మొదటినుంచీ ఈ కేసులో నిందితులపై ఉక్కుపాదం మోపుతున్న విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ అకస్మాత్తుగా 15 రోజులు సెలవుపై వెడుతున్నారు. ఇందులో రాజకీయమేమీ లేదని డిజిపి స్వయంగా ప్రకటించినా, ప్రభుత్వ ఒత్తిళ్లు తట్టుకోలేకే సిపి సెలవుపై వెడుతున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి.

12/16/2015 - 05:53

హైదరాబాద్, డిసెంబర్ 15: ఆంధ్రప్రదేశ్‌లో 13 జిల్లాల్లో దరఖాస్తు చేసిన వారందరికీ తాత్కాలిక రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే చాలు వారికి తాత్కాలిక రేషన్ కార్డులను జారీ చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.

12/15/2015 - 16:42

హైదరాబాద్: నగర పోలీసులకు వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈమేరకు డీజీపీ అనురాగ్‌శర్మ ఈ వీడియో కాన్ఫరెన్స్‌ను ప్రారంభించి డీసీపీలు, స్టేషన్ హెచ్‌ఎస్‌వోలతో మాట్లాడారు. నగరంలోని 60 పోలీస్ స్టేషన్లతోపాటు సబ్ డివిజన్లు, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు, టాస్క్‌ఫోర్స్ తదితర 145 విభాగాలతో నేరుగా సంప్రదించే అవకాశం కలిగింది.

12/15/2015 - 16:41

హైదరాబాద్: రాష్ట్ర తాగునీటి కార్పొరేషన్ ఎండీగా ఎస్పీ సింగ్ నియమితులైయ్యారు. పంచాయతీరాజ్‌శాఖ ప్రత్యేక కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్న ఎస్పీ సింగ్‌కు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది.

12/15/2015 - 16:32

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ పరిధిలో ఓట్ల తొలగింపుపై వేసిన పిటిషన్‌పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. తొలగించిన 6.29 లక్షల ఓట్లపై విచారణ జరిపించామని, 21,360 ఓట్లు పునరుద్ధరించామని, ఓట్ల తొలిగింపులో ఎలాంటి రాజకీయ ప్రయోజనం లేదని ఎన్నికల సంఘం కోర్టుకు తెలిపింది. కేసు విచారణను శక్రవారానికి వాయిదా వేసింది.

12/15/2015 - 16:30

హైదరాబాద్ : రావాణా కార్యాలయాల్లో బ్రోకర్ల బెడద లేకుండా చేస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. బండ్లగూడలోని సౌత్‌జోన్ ఆర్టీఓ కార్యాలయాన్ని ఆయన మంగళవారంనాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రావాణా రంగంలో 15 సేవలను ఆన్‌లైన్ ద్వారా అందిస్తున్నామని తెలిపారు.

12/15/2015 - 13:14

హైదరాబాద్‌: వైకాపా అధినేత జగన్‌ మంగళవారం రాజ్‌భవన్‌లో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌ను కలిశారు. అనంతరం రాజ్‌భవన్ బయట మీడియాతో మాట్లాడారు. కాల్‌మనీ వ్యవహారంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. గిరిజనులకు వ్యతిరేకంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గిరిజన మహిళా ఎమ్మెల్యేపై కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు.

12/15/2015 - 04:24

బాసర, డిసెంబర్ 14: ఆదిలాబాద్ జిల్లా బాసరలోని శ్రీ జ్ఞానసరస్వతిదేవి ఆలయంలో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు విశ్వయోగి విశ్వం జీ సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Pages