S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/18/2015 - 15:36

హైదరాబాద్‌: అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించేందుకు వెళుతుండగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలను పోలీసులు సభ వెలుపల అడ్డుకున్నారు. అనుమతి తీసుకున్నామని చెప్పినా పోలీసులు వినిపించుకోలేదు. గేటుకు తాళాలు వేసి విగ్రహంవైపు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

12/18/2015 - 15:32

న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్ లో నెలకొన్న రాజకీయ సంక్షోభం అంశంపై పార్లమెంట్ ఉభయ సభల్లో విపక్ష కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. అరుణాచల్ వ్యవహారంపై చర్చకు లోక్ సభలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ సుమిత్రా మహాజన్ తిరస్కరించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సహా కాంగ్రెస్ సభ్యులు వెల్ లోకి దూసుకొచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

12/18/2015 - 13:56

మెదక్ : విశ్వక్షేమం కోసమే అయుత చండీయాగం నిర్వహిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. శుక్రవారం మెదక్ జిల్లా జగదేవ్ పూర్ మండలం ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో చండీయాగం కోసం చేపట్టిన పనులను కేసీఆర్ పరిశీలించారు. అనంతరం కేసీఆర్ విలేకర్లతో మాట్లాడుతూ... అయుత చండీయాగం డిసెంబర్ 23 నుంచి 27వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

12/18/2015 - 13:42

చెన్నై ‌: చెన్నైలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో సీబీఐ అధికారులు శుక్రవారం సోదాలు నిర్వహించారు. విమానాశ్రయంలో పట్టుబడిన బంగారం విషయంలో అవకతవకలు జరుగుతున్నాయన్న ఆరోపణలతో సీబీఐ ఈ సోదాలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

12/18/2015 - 13:40

హైదరాబాద్: శుక్రవారం నిర్వహించిన మెట్రో ట్రెయిన్ ట్రయల్ రన్‌లో ప్రయాణికులతో కలిసి మంత్రులు కూడా ప్రయాణించారు. డిప్యూటీ సీఎం మహమూద్ ఆలీ, మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్,పద్మారావు తదితరులు రైలులో ప్రయాణించారు. అంతకు ముందు ఎల్ అండ్ టీ అధికారులు వారికి ఘనస్వాగతం పలికారు. రైల్వే స్టేషన్‌లో అత్యాధునికి వ్యవస్తను పరిశీలించిన అనంతరం మంత్రులు రైలులో ప్రయాణించారు.

12/18/2015 - 13:35

రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. జిల్లా డీసీసీ మాజీ అధ్యక్షుడు కేఎం ప్రతాప్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను కాంగ్రెస్ అధిష్టానానికి పంపినట్లు సమాచారం. భవిష్యత్ కార్యాచరణపై త్వరలోనే ఆయన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది.

12/18/2015 - 13:27

హైదరాబాద్‌: తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి శుక్రవారం ఉదయం వైకాపా అధినేత జగన్‌ పాలాభిషేకం చేశారు. అంబేద్కర్ పట్ల ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ పాలాభిషేకం నిర్వహించారు.

12/18/2015 - 13:16

చిత్తూరు : చిత్తూరు జిల్లాలో పోలాలపై ఏనుగులు దాడి చేసి చేశాయి. రామకుప్పం మండలంలోని పల్లికుప్పం, పండ్యాలమడుగు గ్రామాలలోని పంట పోలాల్లో ప్రవేశించిన ఏనుగులు... పంటలను ధ్వంసం చేశాయి. భారీగా పంట నష్టం వాటిల్లింది.

12/18/2015 - 13:11

విజయవాడ : వేతనాలు పెంచాలని కోరుతూ శుక్రవారం చలో విజయవాడ పిలుపు మేరకు పలు జిల్లాల నుండి బెజవాడకు చేరుకున్న అంగన్ వాడీలపై పోలీసులు జులుం ప్రదర్శించారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం నుండి సీఎం క్యాంపు కార్యాలయానికి ర్యాలీ నిర్వహించారు. మహాత్మాగాంధీ రోడ్డు వద్ద పోలీసులు ర్యాలీని అడ్డుకున్నారు. దీనితో ఆ ప్రాంతం మొత్తం రణరంగంగా మారిపోయింది.

12/18/2015 - 13:06

విజయవాడ: ప్రముఖ రంగస్థల నటులు చాట్ల శ్రీరాములు కన్నుమూశారు. అనారోగ్యంతో సికింద్రాబాద్‌ రైల్వే ఆసుపత్రిలో చికిత్సపొందుతూ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. 1931లో చాట్ల శ్రీరాములు విజయవాడలో జన్మించారు. కేంద్ర సంగీత నాటక అకాడమీ ఎన్టీఆర్‌ పురస్కారం, పొట్టి శ్రీరాములు తెలుగువిశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్‌ అందుకున్నారు.

Pages