రాష్ట్రీయం

బాక్సైట్ వ్యతిరేక ఉద్యమానికి మద్దతు ఇస్తా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 18: విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ ఉద్యమానికి తమ మద్దతు ఉంటుందని విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. విశాఖ ఏజెన్సీలోని ముంచింగిపుట్, పెదబయలు మండలాల్లో స్వరూపానందేంద్ర శుక్రవారం పర్యటించి, అక్కడి గిరిజనులకు దుప్పట్లు, దుస్తులు పంపిణీ చేసి, వారితో మాట్లాడారు. పురాణ పురుషులైన రాముడు, హనుమంతుడు వంటి వారు సంచరించిన ప్రదేశాలు ఈ అటవీ ప్రాంతాలు అని అన్నారు. ఆంజనేయుడు కూడా ఒక గిరిజనుడేనని స్వామి గిరిజనులకు గుర్తు చేశారు. వీటిని ధ్వంసం చేయాలన్న ప్రభుత్వ ఆలోచన సరికాదని అన్నారు. ఆదివాసీల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని గిరిజన సందపదను కొల్లగొట్టాలని ప్రభుత్వం యోచిస్తోందన్నారు. ఇదంతా కేవలం రాజకీయ స్వార్థం కోసమే చేస్తున్నారని అన్నారు.
ప్రతి ఆదివాసి బాక్సైట్‌కు వ్యతిరేకంగా పోరాడాలని స్వరూపానందేంద్ర పిలుపునిచ్చారు. ఏజెన్సీ ప్రాంతంలో మత మార్పిడులు విస్తృతంగా జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మత మార్పిడులు ఆగాలంటే, ప్రతి గ్రామంలో హిందూ దేవాలయాలను నిర్మించాల్సిన అవసరం ఉందని అన్నారు.

ఇటీవల తను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులను కలిసి ఈ విషయాన్ని తెలియచేశానని చెప్పారు. ఎక్కడెక్కడ ఆలయాలు నిర్మించాలో జాబితాను త్వరలోనే టిటిడికి అందచేస్తానని స్వరూపానందేంద్ర వివరించారు. ఈ సందర్భంగా గిరిజనులకు స్వరూపానందేంద్ర నరసింహ మాల వేసి, వారితో దీక్ష ప్రారంభింప చేశారు.