S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/06/2016 - 22:08

* దర్శకుడు అశోక్‌రెడ్డి

03/06/2016 - 22:06

ప్రముఖ నటుడు పవన్‌కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా బిజినెస్ పరంగా కూడా సంచలనం సృష్టిస్తోందని వార్తలొస్తున్నాయి. ‘అత్తారింటికి దారేది’ సినిమా తర్వాత పవన్‌కళ్యాణ్ నటిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా కాజల్ నటిస్తోంది.

03/06/2016 - 22:05

ప్రముఖ నటుడు ఎన్టీఆర్ ఇటీవలే ‘నాన్నకు ప్రేమతో’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఎన్టీఆర్ నటుడిగానే కాక, ఈమధ్య తను నటిస్తున్న సినిమాల్లో పాటలు కూడా పాడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈసారి ఆయన తన స్నేహితునికోసం కన్నడంలో ఓ పాట పాడాడు. ప్రముఖ కన్నడ నటుడు పునిత్ రాజ్‌కుమార్ హీరోగా నటిస్తున్న ‘చక్రవ్యూహ్’ సినిమాకోసం ఎన్టీఆర్ పాట పాడాడు.

03/06/2016 - 22:04

ప్రముఖ నటుడు రజనీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో భారీగా రూపొందుతున్న చిత్రం ‘కబాలి’. కలైపూలి ధాను నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవలే మలేషియా షెడ్యూల్ పూర్తిచేసుకుని, పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.

03/05/2016 - 21:58

హరిబాబు ప్రధాన పాత్రలో శ్రీనివాస్ జి.ఎల్.బి. స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘సాయే దైవం’. భగవాన్ షిరిడీ సాయిబాబా భక్తుల అనుభవాలను ప్రధానాంశంగా తీసుకుని, బాబాను విశ్వసించిన భక్తుల జీవితాల్లో జరిగిన అద్భుతాలే ప్రధాన కథనంగా ఈ చిత్రం రూపొందించామని శ్రీనివాస్ తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్‌తోపాటుగా పాటల చిత్రీకరణ పూర్తిచేశారు.

03/05/2016 - 21:56

దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ జంటగా మలయాళంలో రూపొందిన ‘ఉస్తాద్ హోటల్’ చిత్రాన్ని తెలుగులో ‘జతగా’ పేరుతో అందిస్తున్నారు. అన్వర్ రషీద్ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రాన్ని సురేష్ కొండేటి అనువదించారు. తొలి కాపీ సిద్ధమైన ఈ చిత్రం గూర్చి నిర్మాత మాట్లాడుతూ, మలయాళంలో మ్యూజికల్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రంలో దుల్కర్, నిత్యామీనన్ జంట ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని తెలిపారు.

03/05/2016 - 21:51

ప్రశాంత్, మణికంఠ, ప్రసన్న, అశ్విని ప్రధాన తారాగణంగా వెల్ఫేర్ క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.5వ చిత్రంగా రూపొందిస్తున్న చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. శివశ్రీ దర్శకత్వంలో డా.మళ్ల విజయ్‌ప్రసాద్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

03/05/2016 - 21:48

హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్‌ను కథానాయకుడుగా పరిచయం చేస్తూ మ్యాట్రిక్స్ టీమ్‌వర్క్స్ పతాకంపై అన్నపూర్ణ స్టూడియోస్ రూపొందిస్తున్న యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్ ‘నిర్మలా కానె్వంట్’. జి.నాగకోటేశ్వరరావు దర్శకుడుగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో శ్రేయాశర్మ కథానాయికగా నటిస్తోంది.

03/05/2016 - 21:45

గ్లామర్ భామ రెజినా ఈ మధ్య జోరుగా సినిమా చేస్తూ మంచి క్రేజ్ తెచ్చుకుంటోంది. ఇప్పటికే స్టార్ హీరోయిన్‌గా మారిన ఈ భామ మరోసారి మెగా హీరోతో జోడి కట్టేందుకు రెడీ అయింది. ఆ మెగా హీరో ఎవరంటే మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్! ఇప్పటికే ‘పిల్లా నువ్వులేని జీవితం’, ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ సినిమాల్లో నటించిన ఈ భామ ఇప్పుడు మరోసారి జోడీకట్టింది.

03/05/2016 - 21:41

రూపానటరాజన్, రంజన్‌శెట్టి, శే్వత, విక్రమ్ ప్రధాన తారాగణంగా కన్నడంలో రూపొందించిన ‘మిస్ మల్లిక’ చిత్రాన్ని తెలుగులో ‘కుమారి మల్లిక’గా అనువదిస్తున్నారు. శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయక పిక్చర్స్ పతాకంపై ఆస్కార్ కృష్ణ దర్శకత్వంలో వంశీ కిరణ్‌రెడ్డి, స్వర్ణ శ్రీనివాస్ అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి.

Pages