హారర్ చిత్రాల్లో ట్రెండ్‌సెట్టర్ అవుతుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* దర్శకుడు అశోక్‌రెడ్డి
ఆశిష్‌గాంధీ, వంశీకృష్ణ, కునాల్ కౌశిక్, దీక్షాపంత్, శృతి, మనాలి ప్రధాన పాత్రల్లో రీడింగ్ లాంప్ క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం ‘ఓ స్ర్తి రేపురా’. ఈ చిత్రంతో దర్శక నిర్మాతగా పరిచయవౌతున్న అశోక్‌రెడ్డి చెప్పిన విశేషాలు ఆయన మాటల్లోనే.. ‘చిన్నప్పటి నుంచి సినిమాలంటే పిచ్చి. దాంతో ఎలాగైనా ఇండస్ట్రీలోకి రావాలనే కోరిక వుండేది. మాది గుంటూరు జిల్లాలోని అంబాపురం విలేజ్. ఎంబిఏ పూర్తిచేసి, బెంగళూరులో రెండున్నర సంవత్సరాలు ఉద్యోగం చేశా. ఆ సమయంలోనే రెండు షార్ట్ఫిలిమ్స్ తీశా. వాటికి మంచి పేరు రావడంతో సినిమా చేయాలనే కోరిక బలంగా కలిగింది. నేను ఎవరిదగ్గరా పనిచేయలేదు. మొత్తం ఆన్‌లైన్‌లోనే నేర్చుకున్నాను. అనుభవం కోసమే లఘు చిత్రాల్ని రూపొందించాను. నిజానికి ఈ సినిమా కూడా 40 నిమిషాల నిడివితో తీశాను. చూసిన చాలామంది బావుందనడంతో స్క్రిప్ట్ మీద రీసెర్చ్ చేశా. ‘ఓ స్ర్తి రేపురా’ అనే పదాన్ని అప్పట్లో చాలామంది ఇంటి గోడలపై రాసేవాళ్లు. అసలు అది ఎందు కు రాస్తున్నారు, ఏమిటాకథ అనే దానిపై చాలా రీసెర్చ్ చేశా. దీని గురించి ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్పేవారు. ఈ సినిమా 1980లో ఉన్న వాళ్లకి బాకా కనెక్ట్ అవుతుంది. ఇప్పటి జనరేషన్ వారికి తెలియాలనే ఉద్దేశంతో ఈ సినిమా చేశా. ఇక కథ గురించి చెప్పాలంటే ఒక దయ్యమే తన కథను చెబుతుంది. అదే సినిమాలో ప్రత్యేకత. ఇప్పుడొస్తున్న హారర్ సినిమాలకి ఇదొక ట్రెండ్‌సెటర్‌గా నిలుస్తుంది. గ్రాఫిక్స్ లేకుండా కేవలం సౌండ్‌తో మాత్రమే సినిమా చేశాం. కామెడీ కూడా కథలో భాగంగానే ఉంటుంది. మొత్తం 70 థియేటర్లలో ఈనెల 11న విడుదల చేస్తున్నాం’ అన్నారు.