సందేశాత్మకంగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రశాంత్, మణికంఠ, ప్రసన్న, అశ్విని ప్రధాన తారాగణంగా వెల్ఫేర్ క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.5వ చిత్రంగా రూపొందిస్తున్న చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. శివశ్రీ దర్శకత్వంలో డా.మళ్ల విజయ్‌ప్రసాద్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ యువతకు సందేశాత్మకంగా రూపొందిస్తున్న ఈ చిత్రంలో కథాకథనాలు హైలెట్‌గా ఉంటాయని, దర్శకుడు ప్రతి సన్నివేశాన్ని అద్భుతంగా చిత్రీకరిస్తున్నారని తెలిపారు. నేటి యువత ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఈ చిత్రంలో చర్చిస్తున్నామని, అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామన్నారు. త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి, ప్రేక్షకుల ముందుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన అన్నారు. సుమన్, ప్రభు, మధునందన్, వెంకట్, హేమ, భార్గవి, శ్రీముఖి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: శివశ్రీ, ఇందురమణ, పాటలు: శ్రీమణి, చిన్నిచరణ్, సంగీతం: వికాస్ కురిమెళ్ల, ఎడిటింగ్: నందమూరి హరి, నిర్మాత: డా.మళ్ల విజయ్‌ప్రసాద్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శివశ్రీ.