S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/09/2016 - 21:44

సిద్ధార్థ్, లక్ష్మీమీనన్ జంటగా కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో గ్లోబల్ వన్ స్టూడియోస్, సాయి మణికంఠ క్రియేషన్స్ పతాకంపై కె.రమేష్ నిర్మిస్తోన్న చిత్రం ‘చిక్కడు దొరకడు’. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత వివరాలు తెలియజేశారు.

03/09/2016 - 21:42

సాయిరోణక్, అతిథిసింగ్ జంటగా వినోద్ లింగాల దర్శకత్వంలో ఐవింక్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందిన ‘గుప్పెడంత ప్రేమ’ సినిమా ట్రైలర్‌ను బుధవారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. దర్శకుడు మధుర శ్రీ్ధర్‌రెడ్డి ట్రైలర్ విడుదల చేసిన అనంతరం మాట్లాడారు. ‘ఇట్స్ మై లవ్‌స్టోరీ’ సినిమాతో వినోద్ తనతో కలిసి పనిచేశాడని, ట్రైలర్ బాగుందని, తప్పకుండా ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని అన్నారు.

03/09/2016 - 21:41

‘ప్లేయర్’ చిత్రంలో కథానాయకుడిగా నటించిన పర్వీన్‌రాజ్ లార్డ్ శివ క్రియేషన్స్ పతాకంపై రూపొందిస్తున్న తొలి చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఈనెల 18న అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభం కానుంది. శేషసాయి మరుప్రోలు దర్శకత్వంలో ఎం.వి.ఎస్.సాయికృష్ణారెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

03/09/2016 - 21:39

ఎస్.జె.ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై సంజీవ్ జాథన్, పవిత్ర జంటగా సురేష్ దర్శకత్వంలో దీపక్ సోహైల్ జిలాని రూపొందించిన చిత్రం ‘జానూ నువ్వెక్కడ’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

03/09/2016 - 21:38

సందీప్‌కిషన్, నిత్యామీనన్ జంటగా రాజసింహ తాడినాడ దర్శకత్వంలో అంజిరెడ్డి రూపొందిస్తున్న చిత్రం ‘ఒక్క అమ్మాయి తప్ప’. ఈ చిత్రం కోసం మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండగా, మరో సంగీత దర్శకుడు తమన్ కథానాయకుడు ఇంట్రొడక్షన్ పాటను పాడారు.

03/09/2016 - 21:37

యూత్‌ఫుల్ దర్శకుడిగా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుని లేటెస్టుగా ‘భలే భలే మగాడివోయ్’ సక్సెస్‌తో దూసుకుపోతున్నాడు మారుతి. ఆయన తాజాగా వెంకటేష్‌తో రూపొందిస్తున్న ‘బాబు బంగారం’ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే సగానికిపైగా షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా తరువాత మారుతి ఓ యానిమేషన్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది.

03/09/2016 - 21:35

నిశ్చల్, వందనాగుప్త జంటగా కలర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ఆర్.పి.పట్నాయక్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘తులసిదళం’. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని రేపు విడుదలకు సిద్ధంగా వుంది. ఈ సందర్భంగా ఆర్.పి.పట్నాయక్ చెప్పిన విశేషాలు..ఆయన మాటల్లోనే
ప్రేమకు సమస్య హారరే

03/08/2016 - 22:25

ప్రస్తుతం ‘బ్రహ్మోత్సవం’ సినిమా షూటింగ్‌లో బిజీగా వున్నాడు మహేష్‌బాబు. ఈ సినిమా తరువాత ఆయన నటించే చిత్రానికి దాదాపు అన్ని కార్యక్రమాలు పూర్తికావచ్చాయి. ప్రముఖ తమిళ దర్శకుడు మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించడానికి రెడీ అవుతున్నారు. న్యాయవ్యవస్థపై పోరాటం అంశంగా తెరకెక్కుతున్న ఈ సినిమా తమిళ, తెలుగు భాషలతోపాటు హిందీలో కూడా రూపొందిస్తారట.

03/08/2016 - 22:24

ఆదిత్య 369 సీక్వెల్‌తో మనోజ్ఞ ఎంట్రీ ** వందో సినిమాకు కథలు సిద్ధం : బాలకృష్ణ

03/08/2016 - 22:23

ఆర్.నారాయణ మూర్తి ప్రధాన పాత్రలో స్నేహ పిక్చర్స్ పతాకంపై రూపొందించిన చిత్రం ‘దండకారణ్యం’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈనెల 18న విడుదలకు సిద్ధం చేశారు.

Pages